File No.7





 ఇరువదొకవెయ్యి ఆరు నూరులు జరుగు హంసలు, తరుగునాయువు, హరిహరాదులు వచ్చి నిలచిన, ఆగదీతనువూ, జీవా మేలుకొనవే. అంటే అర్థం ఏమిటి? ఏమిటి అర్థం? తనువు ఎప్పటికైనా పోతుంది అంటున్నావే కానీ, ఆ తనువుని నమ్ముకోవటం మానేశావా? అది మాన లేదు కదా! ఇంకోటి ఏంటట? అది మానాలి అంటే, ఏం గుర్తించాలట? అది తెలుసుకోవాలి. అందులోనే రెండూ వున్నాయి. సమస్యా వుంది, నీ పరిష్కారం కూడా అందులోనే వుంటుందండి. ఏం చెయ్యాలి? నీ సమస్య ఏమిటి? నీ సమస్య ఏమిటి? తనువును ఆశ్రయించావు. తనువే నేను అనుకుంటున్నావు. ఈ తనువు నేను అనుకోకుండా జీవించాలి అంటే ఏం చెయ్యాలి? ఇరువదొకవెయ్యి ఆరు నూరులు జరుగు హంసలు, తరుగునాయువు, హరిహరాదులు వచ్చి నిలచిన, ఆగదీతనువూ. నువ్వు ఆ హరిహరాదులను ఎంతసేపూ ఏమి వేడుకొంటున్నావు? నేను చావకుండా చూడు, నేను చావకుండా చూడు, ఈ సుఖం వుండేట్టుగా చూడు, ఈ సుఖం వుండేట్టుగా చూడు, ఈ శరీరంతో కూడిన సుఖం వుండేట్టుగా చూడమనే కదా జీవితకాలం వాడిని బతిమలాడావు? బతిమలాడితే వాడేమన్నా చేయగలడా? ఏం చేయలేడు నాయనా! ఎందుకని నాయనా? వాడి చేతిలో ఏమీ లేదు నాయనా! ఎందుకని? మరణం ధృవం. పుట్టిన వాడు పోక తప్పదని పురాణాలు, అష్టాదశ పురాణాల్లో ప్రతీ దేవుడూ ఎన్ని తపస్సులు చేసినా కూడా చెప్పింది అదే! అయితే ఏమిటట? నువ్వు తప్పించుకోవచ్చు. ఎట్లా అయ్యా? ఆత్మజ్ఞానం తెలిస్తే, మరణాన్ని ధిక్కరించవచ్చు. మరణాన్ని అధిగమించవచ్చు. అట్లా సాధ్యం గాని, మరణ కాలంలో ఏ సాధన గనుక నీ దగ్గర వుంటే, మరణాన్ని నువ్వు సాక్షిగా చూడగలుగుతున్నావో, అటువంటి జ్ఞానం నీ దగ్గర వుంటే, నువ్వు దానిని అధిగమించవచ్చు. అంతే గాని దానిని లేకుండా చేయడం ఎవరివల్లా అవ్వదు. ఎందుకని? అది తనువును ఆశ్రయించి వున్నది. తనువు పుట్టింది, తనువు పోక తప్పదు. నువ్వు పోవడం అనేది అసాధ్యం అన్నమాట. అనే జ్ఞానం నీకు కలగాలి. కలగాలి అంటే దేనిని ఆశ్రయించాలి? అంటే ఈ తనువు నేను కాదు అని నిరశించాలి అంటే, ఈ తనువు దేనిమీద పనిచేస్తందంట ఇప్పుడూ? ఆయుష్షు మీద పనిచేస్తుంది. అంతేనా? ఈ తనువు దేనిమీద ఆధారపడి వుంది? ఆయుష్షు మీద ఆధారపడి వుంది. ఆయుష్షు దేని మీద ఆధారపడి వుంది? హంస మీద ఆధారపడి వుంది. ఆ హంసని గుర్తెరుగు మొట్టమొదట. ఆ హంసని గుర్తించే ప్రయత్నం చేస్తే, అది ఇరువది ఒక్క వెయ్యి ఆరు నూరులు జరుగతోందంట. క్రమం తప్పకుండా తల్లి గర్భం నుంచి మొదలు పెడితే, మరణ కాలం వరకూ కూడా ఆ హంస 21,600 సార్లు కొట్టుకొంటోందంట. ఎందుకని రోజూ అంత పెద్దపని మనలో జరుగుతూ వున్నా కూడా, మరి మనం ఎందుకు గుర్తించలేకపోతున్నాము? అర్థమైందా అండీ!
            చిన్న చిన్న బయట ఆవగింజ కదిలినా, చీమ కదిలినా గుర్తుపడుతానంటున్నావే, కానీ ఏమి గుర్తించలేక పోతున్నావు? నీలోపల హంస, పుట్టింది మొదలు పోయేదాకా రోజూ కొట్టుకొంటోందే? దాన్ని గుర్తించు మొట్టమొదట. దాన్ని గుర్తిస్తే, నీ ఆయుష్షు ఎలా తరిగిపోతోందో తెలుస్తుంది నీకు. నీ ఆయుర్దాయం ఎలా క్షీణించిపోతుందో అప్పుడు తెలుస్తుంది నీకు. (ఇన్నాళ్ళు) నువ్వేం మోసపోయావో. దేని గురించి నీ ఆయుర్దాయాన్ని ఖర్చు పెడుతున్నావు? అర్థమైందా? నీ ఆయుర్దాయం ఇప్పటి దాకా దేని కోసం ఖర్చు పెట్టావు? ఒకసారి వెనక్కు తిరగి చూసుకో! భగవంతుడు నీకు ఆయుర్దాయాన్ని ఇచ్చాడు. అదే సంపద. ఆ 21,600 సార్లు హంస కొట్టుకోవడం అనే శక్తిని ఇచ్చాడు. ఈ హంస శక్తిని ఇప్పటి వరకూ దేనికి వుపయోగించావు?
            వెలలేని, విలువలేని వాటిని సంపాదించడానికి వుపయోగించి, ఇది తరిగిపోయి, జరిగిపోయి, విడిచిపెట్టేసే సమయం వచ్చేటప్పటికి, అయ్యో, కుయ్యోమర్రో అంటే ప్రయోజనం ఏముంది? కాబట్టి నేను తనువు కాదుఅని నిర్ణయించాలి అంటే, నువ్వు హంసని గుర్తించాలి. ఆ ప్రాణశక్తిని గుర్తించాలి. నిరంతరాయంగా దృష్టిని, ప్రాణశక్తిని అదీ ఆనాపానసతి, అదీ పిరమిడ్‌ ధ్యానం అన్నీ అవే. ఆ ప్రాణశక్తిని గుర్తించే ప్రయత్నం చేస్తే, ఏం పోయింది నీకు? ‘నేను శరీరం కాదుఅని స్థిర పడింది. నేను శరీరం కాదు. నేను ఎవరిని? నేను ప్రాణాన్ని. ప్రాణమే దైవం. ఎందుకని? ఆ ప్రాణమే, ఆ ప్రాణం పోతే అంతా పోయినట్టే. శరీరమే నేను అయినప్పుడు ప్రాణమే దైవం. ఇంకెక్కడో లేదు దైవం. హరిహరాదులు కానీ, ఎవ్వరైనా పెట్టుకో, ముప్ఫై మూడు కోట్ల దేవతలు ఆ ప్రాణంలోనే వున్నారు. ఎందుకని? నువ్వు శరీరంగానే వున్నావు కాబట్టి. నేను శరీరం కాదయ్యా అన్నావనుకో, నేను ప్రాణాన్ని అనే స్థితికి రావాలన్నమాట. నేను శరీరం కాదు, నేను ప్రాణాన్ని. ఎందుకని? తరిగిపోతోంది ఏది శరీరమా? ప్రాణమా? ప్రాణం తరిగిపోతోంది. ఆయుష్షు తగ్గిపోతోందన్నమాట. నేను ప్రాణాన్ని అంటే అప్పుడు ఏమైంది? మనసు దైవం అయ్యింది. నేను ప్రాణమును అంటే, మనసు దైవం అయ్యింది. నేను మనస్సు అనే స్థితికి వచ్చావు ఇప్పుడు. ఈ హంసని గుర్తించడం ద్వారా అది యాంత్రికంగా కొట్టుకొంటోంది తప్ప దాంట్లో ఏముంది? వేరే ఏమైనా వుందా? పైకి కిందకి, పైకి కిందకి, పైకి కిందకి కొట్టుకొంటోంది అంతే! పంచప్రాణాల రూపంలో వున్నది. ఏమిటి ఆ పంచ ప్రాణాలు? ప్రాణ, అపాన, సమాన, వ్యాన, ఉదాన అంతే కదండీ! ఆ అయిదు వాయువుల రూపంలో నీకు శరీరంలో వున్న అన్ని ఇంద్రియాలు పని చేసేట్టుగా చేస్తోంది. మనం తీసుకునే గాలి, ఆ ఐదు భాగాలుగా విడిపోయి, ఐదు స్థానాలలో నిలిచి వుండి, ఆ ఐదు స్థానాలలో నిలిచి వుండి, అన్ని ఇంద్రియాలన్నీ పనిచేయడానికి అదే కారణం. ఒక్కసారి ఆ ప్రాణ వాయువు తీసుకోవడం ఆపు. ఏవీ, నీ ఇంద్రియాలను పనిచేయమను. నీ గొప్పతనమంతా ఎవరికి అప్పజెప్పావు? ఆహా! నా కళ్ళు గొప్పవి, ఆహా! నా చెవులు గొప్పవి. ఆహా! నా చేతులు గొప్పవి. అంటున్నావా లేదా? వెయ్యి కాయలైనా సరే నేను పెట్టేస్తానండీ మాగాయి. ఎలా పెట్టావు ఏమిటి? ఆ ప్రాణం పనిచేయకుండా పెట్టావా? నీ గొప్పతనాలన్నీ, నీ ఇంద్రియాల గొప్పంతా ఎక్కడినుంచి వచ్చింది? దేని మీద ఆధారపడి వచ్చింది? ఆ ప్రాణం మీద ఆధారపడి వచ్చిందయ్యా! ఆ ప్రాణం ఎలా పనిచేస్తుందో తెలిసిందా? అది తెలియలేదు కదా! ప్రాణం అంటే ఎక్కడున్నది? అపానం అంటే ఎక్కడున్నది? వ్యానం అంటే ఎక్కడున్నది? సమానం అంటే ఎక్కడున్నది? ఉదానం అంటే ఎక్కడున్నది? ఏ స్థానములలో ఆ ఐదు వాయువులు పనిచేస్తే, ఈ ఇంద్రియాలు పనిచేస్తున్నాయో గుర్తించు. పంచకోశ విచారణ అందుకే చేయమంటారండి. తప్పనిసరిగా ఈ అన్నమయ్యకోశం పనిచెయ్యాలి అంటే లోపల ఆ ప్రాణమయ కోశం పనిచేస్తేనే. ఆ ప్రాణమయకోశం అనే సూక్ష్మం పని చేయకపోతే ఈ స్థూలం ఎందుకూ పనికి రాదు. కాబట్టి దీనికంటే స్థూలమైనటువంటి దాంట్లో నుంచి సూక్ష్మమైనదానిని గుర్తించు. ఆ సూక్ష్మమైనదానికంటే మరింత సూక్ష్మమైనదానిని గుర్తించు. దానికంటే సూక్ష్మమైనది, దానికంటే సూక్ష్మమైనది, దానికంటే సూక్ష్మమైనది అట్లా గుర్తిస్తూ పోతే, ఏమైందట ఇప్పుడు? అప్పుడు అన్నమయ్య కోశము నేను కాదు. ప్రాణమయకోశము నేను కాదు. మనోమయకోశము నేను కాదు. విజ్ఞానమయకోశము నేను కాదు. ఆనందమయకోశము నేను కాదు. నేను ఆత్మ స్వరూపుడను. అని చిట్టచివరికి తేలేటటువంటి నిర్ణయం అన్నమాట అది. కాబట్టి శరీరం నేను కాదు. ప్రాణం నేను కాదు. మనసు నేను కాదు. బుద్ధి నేను కాదు. నేను ఆత్మ స్వరూపుడను. ఇలాగ ప్రతినిత్యము మీరు విషయాలు వచ్చినప్పుడల్లా, ఆ ఆలోచన వచ్చినప్పుడల్లా, అనుభవం కలుగుతున్నప్పుడల్లా, ఏ పని ప్రారంభించబోయినా సరే, నేను శరీరం కాదు. నేను ప్రాణం కాదు. నేను మనస్సును కాదు. నేను బుద్ధిని కాదు. నేను ఆత్మ స్వరూపుడను. నేను ఇందులో స్థిరమయ్యే, ఈ పనిని చేశాను అంతే. ఇందులో స్థిరం కాలేదు, అప్పుడు ఏవో జరుగుతూ వుంటాయి.  ఎదుటివాడు దుఃఖిస్తూ వుంటాడు, నువ్వు దఃఖిస్తూ వుంటావు, వాడి దుఃఖం చూసి నువ్వు దుఃఖపడుతూ వుంటావు, వాడి సుఖం చూసి నువ్వు సుఖపడుతూ వుంటావు, నీ సుఖం చూసి వాడు సుఖపడుతూ వుంటాడు. ఇలా అన్నీ జరిగిపోతూ వుంటాయి. ఇవన్నీ కూడా. ఇవన్నీ ఏ పరిధిలో జరుగతూ వున్నాయి? శరీరం పరిధిలో జరుగుతూ వున్నాయి. ఒక నిర్ణయం చేశాము, ఒక నిర్ణయం చేస్తే ఏమిటి? ఎవరికో ఒకరికి దుఃఖం కలుగవచ్చు దానిలో ఏముంది? దుఃఖం కలుగుతూ వుందంటే అజ్ఞానం వుంది వెనుకాల. అది ఏ రకమైన దుఃఖం అయినా సరే. ఏ నిర్ణయమైనా కానీ నువ్వు ఎందుకు ఆనందించలేకపోతున్నావు? (మనవల్ల వాళ్ళు బాధపడుతారేమో అని)  మళ్ళా మొదటికి వచ్చావు అదే. ఆత్మ స్వరూపజ్ఞానం కోసం నువ్వు దేనినైనా త్యజించమంటున్నాడు. ఎందుకని? నువ్వు జన్మించిందే దానికోసమయ్యా! అసలుది పోయింది. అసలుది పోయి వాడు దుఃఖిస్తున్నాడని దీనిని వదిలేస్తివి. ఇప్పుడేమైంది? ప్రయోజన శూన్యం అయిపోలేదా? జన్మ వృధా అయిపోవడం లేదా? జన్మ వృధా అయిపోయినాక ఏం ప్రయోజనం? (మన వల్ల అవతల వాడు బాధ పడుతున్నాడేమో?) ఆ ధర్మాన్ని ఎందుకు పోషించమన్నారు? జ్ఞానం కలగడం కోసమని ధర్మాన్ని పోషించమన్నారండి. అదే నిన్న చెప్పింది. ధర్మాన్ని పాటించాలి. ఏ నిమిత్తమై? మోక్షం దృష్ట్యా పాటించాలి ధర్మాన్ని. ఉదాహరణ చెబుతానండి. ఇప్పుడు నేను మనం 6 గంటలకు లేచాం, మనపనిలో మనం వచ్చేశాము. మన పనిలోకి మనం వచ్చేస్తే ఏమైంది? ఈ గంటన్నర వీరి యొక్క సేవలు మనకు అందడం లేదే అని దుఃఖించేవారు లేరా? వుంటారు కదా ! ఇప్పుడేం చెయ్యాలట అయితే? ఈ గంటన్నర ఆపేసి వారి సేవలు చేస్తున్నావే అనుకోండి, మోక్షం ఎప్పటికైనా వస్తుందా? ధర్మమే. గృహిణి ధర్మమే. నేను కాదనడం లేదు. 6 to 7.30 ఉదయం పూట ఏదో ఇంతకు ముందునుంచీ ఏ పనీ లేదు కాబట్టి ఏ గోల లేదు కాబట్టి ఏదో ఇంట్లో ఆ చీపురితో జిమ్మటమో, ఈ చీపురితో అటు జిమ్మటమో ఏదో చేస్తూ వుంటావు. ఇప్పుడు నువ్వు ఆ పని చేయడం లేదండి. ఏమన్నా బ్రహ్మాండం బ్రద్దలైపోయిందా? ఏమీ అవ్వలేదుగా. (మనం ఎప్పుడూ పక్కవాడి గురించి) అదేగా నేను చెప్తోంది? చిన్న ధర్మాన్ని ఆశ్రయించి, పెద్ద లక్ష్యాన్ని వదిలేస్తివే? జీవితం ఎందుకోసం వచ్చిందో, జన్మ ఎందుకు జన్మించావో ఆ లక్ష్యం పోయి, ఏం మిగిల్చుకున్నావు? గుమ్మడికాయ పోయింది, ఆవ గింజ మిగిలింది. అర్థమైందా అండి?
            సేవే, ఎప్పుడు సేవ అయ్యింది? నీకు జ్ఞానం లభిస్తే సేవ అయ్యిందండి. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి. ఈ పని చేయడం ద్వారా నీకు జ్ఞానం లభిస్తే, అది సేవ అవుతుంది. నేను అనే కర్తను త్యజించాలి. ఇప్పుడు నేను అనే కర్త బలపడ్డాడా? త్యజించాడా? ఏమైందప్పుడు? జ్ఞానం ఎలా అయ్యింది మరి? ఆ ధర్మాన్ని ఆచరిస్తే, నేను అనే కర్త పోవాలి. ఎందుకని? ధర్మమే పరమాత్మ స్వరూపం. నేను పరమాత్మ ఒక్కటే. ఆచరించేవాడను నేను ఎక్కడ వున్నాను? పరమాత్మ పద్ధతిలో ఆచరిస్తున్నాను. కాబట్టి చేసేది ఎవరయ్యా? పరమాత్మే. చేయించేది ఎవరయ్యా? పరమాత్మే. అనుభవించేది ఎవరయ్యా? అంతా పరమాత్మే. నేను ఏమీ చెయ్యని వాడను. ఆ భావంలో వుండి నువ్వు చేస్తే సేవ అవుతుంది. కానీ మీరు మీ ఇళ్ళల్లో చేసింది సేవ అవుతుందా? అవ్వదు కదా! ఎందుకని? నువ్వు చేశావని వాడు గుర్తించబట్టే, వాడు గుర్తించకపోతే నువ్వు దుఃఖించబట్టే. (అంతేకదా మరి) చూడండి. అర్థమైందా? ఇలాగ. అందుకని మీరు రోజువారి నిత్య జీవితంలో ఎప్పుడైనా సరే వీటిని గుర్తు పెట్టుకోవాలి. ధర్మ సంకటం వచ్చినప్పుడల్లా వెంటనే ఈ ప్రశ్న వేసుకోవాలి. ఈ ధర్మాన్ని ఆచరించడం ద్వారా నాకు ఆత్మజ్ఞానం కలుగుతోందా? నేను సాక్షిగా వుండగలుగుతున్నానా? లేకపోతే జీవుడిగా కర్తగా అందులోకి దూరిపోతున్నానా? విషయంలో దూరిపోతున్నానా? ఉదాహరణ చెప్తానండి. ఇప్పుడు నిన్నటి దాకా మీరు అక్కడికి వచ్చారు. అర్థమైందా అండి. అక్కడినుంచి ఇప్పుడు ఇక్కడికి మార్చాము. మారిస్తే ఇంట్లో వారికి దుఃఖం వుండదా? వుండచ్చు దానిది ఏముంది? ఆవెడ దుఃఖపడుతారు కదా అని చెప్పడం మానేస్తామా? వినడం మానేస్తారా? మీరు కాకపోతే మరొకరు. నేను కాకపోతే మరొకడు. అంతే కదండి. చెప్పేవాళ్ళు దేశంలో, ప్రపంచంలో బోల్డుమంది వున్నారు. వినేవాళ్ళు అలాగే వున్నారు. అందుకని ఈ ప్రక్రియ బోధించడం, వినడం అనే ప్రక్రియ గురుశిష్య సాంప్రదాయం నీతో నాతో మొదలు కాలేదు. నీతో నాతో పోదు. అంతేనా కాదా? 12 ఏళ్ళ నుంచీ చెబుతూనే వున్నాము. ఎక్కడో ఒకచోట చెబుతూనే వున్నాము. ఎక్కడైనా ఒక్కటే. ఏ చెట్టుక్రిందైనా చెప్పేస్తాము. ఎక్కడైనా చెప్పేస్తాము. ఎందుకని? దానికి భూమండలం అంతా సమానమే దానికి. ఇక్కడ చెప్పడం, అక్కడ చెప్పడం అనే భేదం మాకేమీ లేదు. మీకు ఎక్కడ అనువుగా వుంటే అక్కడే చెప్తాం పో. ఇంకా అక్కడైనా ఏదో ఇల్లు కట్టారు కాబట్టి, అక్కడ నేను వుంటున్నాను కాబట్టి ఇక్కడకి రండి అంటున్నాము. అక్కడ ఆ విధానము ఏమీ లేదు ఎప్పుడూ కూడా. నీకు ఎక్కడ అనువుగా అనిపిస్తే నేను అక్కడికే వచ్చి చెప్తాను. ఎందువల్ల? నీకు అనువుగా వున్న చోట అయితే నువ్వు స్థిరంగా వుంటావు. నాకు అనువుగా వున్నచోట అయితే నువ్వు స్థిరంగా వుండవు. నువ్వు మనసేమో అక్కడ వుంటుంది. మనిషేమో ఇక్కడ వుంటావు. (నేను మటుకు స్థిరంగా వుండాలి). ఎందుకని? చెప్పేవాడు ఎప్పుడూ స్థిరంగానే వుంటాడు. వాడు ఆ స్థితికి వస్తేనే చెప్తాడు. లేకపోతే చెప్పలేడు కదా! అర్థమైందా? అందుకని మీరు ఎక్కడ అయితే స్థిరంగా వుంటారో, అందుకని ఆ విధానం మీకే వదిలేస్తాము. ఎక్కడ మీరు చేస్తే, ఎక్కడ మీరు వుంటే, మీరు ఏ స్థితిలో వుంటే, మీరు ఆ రెండు గంటల సేపు, స్థిరమైనటువంటి ఏకాగ్రతని నిలుపగలుగుతారు? Diversion వుండకూడదు అండీ మధ్యలో. మధ్యలో అది వచ్చీ, ఇది వచ్చీ, అది ఆపీ, ఇది ఆపీ. ఇది ఆపండి. చెప్పేవాడిని ఆపమనీ, వినేవాడిని ఆపమనీ రకరకాల పనుల మధ్యలో వస్తే ఏమైపోయింది అప్పుడు? మళ్ళా మామూలే. మిమ్మల్ని పైకి ఎత్తుకి ఎక్కించడం కష్టం కదా! అవునా కాదా?
            ఇప్పుడు మీ అందరి మనసుని, హృదయాన్ని ఏం చేస్తున్నాము? ఈ రెండు గంటల సేపు? మీరు ఇప్పటి వరకూ ఎలా జీవించారో, ఆ జీవించిన జీవితానికి వ్యతిరేకం చేస్తున్నాము. ఉల్టా. తిప్పేస్తున్నాము అంతా కూడా. అది పనికి రాదు. అది అట్టా పనికి రాదు. ఇట్లా మార్చుకోవాలి అని చెబుతున్నాము. ఏమౌతుంది మీ కుటుంబ సభ్యుల మధ్యలో చెప్తాం అనుకోండి ఏమౌతుంది? తగాదా రాదు? చాలా తగాదాలు వస్తాయండి. అని మీకు తెలియాలి. తెలియజెప్పడం వరికే నా బాధ్యత. దాన్ని ఎట్లా ఆచరించాలో, మీ తెలివిని ఉపయోగించి ఆచరించాలి. అందుకని అందుకనే చెప్పేదండి. వివిక్త వాసముఅని దీనికి అంటారండి. అంటే అర్థం ఏమిటి? (జనం) ప్రజల మధ్యలో ఎప్పుడూ చెప్పకూడదు నాయనా. కానీ ఇవాళ ఈ నియమాన్ని ఉల్లంఘించి, మైకులో కొన్ని లక్షల మందికి చెప్పేస్తున్నాము. ఎందుకనిట? అట్టా చెబితే అది రాదది. ఎందుకనిట? వివక్త వాసము. విడిగా పెట్టాలి వాళ్ళను. ఎట్లా అయితే (పిల్లాడిని) విద్యార్థిని స్కూలుకి పంపించినపుడు, వాడిని తీసుకెళ్ళి ఒక స్కూలు అని separate గా పెట్టావా లేదా? ఎందుకు పెట్టావు? మీ ఇంట్లోనే చెప్పవచ్చుగా? ఇంట్లోనే చదువుకున్న వాళ్ళు  B.Sc, B.Ed లు బోల్డు మంది వున్నారుగా, చెప్పవచ్చుగా. పనికి రాదు నాయనా అలాగ. వాడికి విద్య నేర్చుకోవాలి అంటే కచ్చితంగా వివిక్త వాసము వుండాల్సిందే. వుంటేనే వాడు బాగుపడుతాడు. లేకపోతే వాడికి విద్య రాదు. ఎందుకనిట? చెప్పేటప్పుడు గురువు ఎప్పుడూ కూడా, పరమాత్మను దృష్టిలో పెట్టుకుని చెప్తాడు ఎప్పుడూ కూడా. తాను ఆచరించేది పరమాత్మను దృష్టిలో పెట్టుకుని, అనుభవ జ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకుని, స్పష్టంగా చెప్పేస్తాడు. ఆ చెప్పేటప్పుడు ఎన్నింటినైనా నిరసించవలసి రావచ్చును. నిరసించి కచ్చితంగా, ఖండితంగా చెప్తాడు. ఆ నిరసించడం వల్ల నీ చుట్టుపక్కల వున్నవాళ్ళకు గాని, నీ మీద అభిమానము వున్నవాళ్ళకు గానీ, నా మీద అభిమానము వున్న వాళ్ళకు గాని దుఃఖం కలుగవచ్చు. అర్థమైందా? ఆ దుఃఖం వల్ల వాడు ఏం చేస్తాడు? ఊరుకుంటాడా? ఊరుకోడు, వచ్చి అడ్డంగా నిలబడుతాడు. నువ్వేం చెబుతున్నావు అంటాడు. అర్థమైందా అండీ! కాబట్టి గురుశిష్య సాంప్రదాయంలో మూడో వ్యక్తి్కి తావు లేదు. పరమాత్మకు కూడా తావు లేదు. అక్కడ ఎవరినైనా సరే, గురువు ఇది తప్పు వదల వలసిందే అంటే ఖండితంగా చెప్పవలసిందే. ఇది వదలవలసిందే. అంతేగాని దీనిని మిగిల్చుకో నాయనా! అని చెప్పడానికి వీలుకాదన్నమాట. అలా చెబితే అది ఆత్మజ్ఞానం అవ్వదన్నమాట. ఆత్మజ్ఞానం అంటే దాని మీదే నిలబెట్టి మాట్లాడుతాడు అంతవరకే. ఎందుకని? అది లభిస్తేనే నీ జన్మ సార్థకమౌతుంది. లేకపోతే సార్థకం కాదు. నువ్వు ఎన్నన్నా చేసుకో, నువ్వు చెయ్యి, మానేయి. నాకు అనవసరం. నువ్వు ఏ దృష్టితో చేయాలి? ‘నేను ఆత్మ స్వరూపుడనుఅనే భావంతోటే చేయాలి. లేకపోతే కటకటా మోసమాయెను - అనే దుఃఖం ఎప్పటికీ వుండిపోతుంది. ఆ చివరి కాలంలో మరణ వేదన అంతా కూడా ఈ జీవ చూడగానే నండి. గుర్తు పెట్టుకోండి. మరణకాలంలో అందరికి మరణ వేదన లభించే, దొరికే అనుభవం వస్తుందే ఆ మరణ వేదన అంతా కూడా ఈ చివరి జీవ చూడగనే.

            తర్వాత లేని పోనీ దుఃఖ జాలములోన బడి చెడిపోవుటెందుకు? మానవమానంబులని నీ మమత విడలేవూ జీవా మేలుకొనవే’ - లేని పోనీ - దుఃఖజాలము గూర్చి మాట్లాడుతున్నాడు. మనం అందరం ఎవరి గురించి, పది మంది కలిసిన చోటల్లా ఏం చెప్పుకుంటారండీ? (కష్టం సుఖం) లేని పోని దుఃఖం, దుఃఖజాలమట. ఎందుకని జాలము అన్నాడు? జాలం అంటే, సమూహము. ఒకటి చెబితే ఊరుకొంటావా? ఒకటి చెబితే పది చెబుతావు మళ్ళా. ఆ పదికి మళ్ళా వీడొక పది చెబుతాడు. ఈ పదికి మళ్ళా పది. ఏమైపోయింది ఇప్పుడు? ఎక్కడన్నా దానికి అంశం వుందా? ఫల్‌స్టాప్‌ వుందా? పుట్టింది మొదలు చెబుతూనే వుంటివి. ఎన్ని వ్రతాల్లో ఎంతమంది కలిసినా, అసలు వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు ఎందుకు పెట్టారు? ఎవరో ఒకరి ద్వారా నువ్వు ఆత్మజ్ఞానం నేర్చుకోవడం కోసమని పెడితే, ఇవన్నీ చేసి ఏం ముచ్చట్లు చెప్పావు? ఈ పది మందీ కలిసి, వీడి దుఃఖం వాడికి, వాడి దుఃఖం వీడికి. ఇప్పుడు జ్ఞానం వచ్చిందా? దుఃఖం వచ్చిందా? (దుఃఖమే) అర్థమైందా అండీ!
            దుఃఖం తగ్గిపోవాలి. దుఃఖం లేకుండా పోవాలి. అవన్నీ ఆచరిస్తే. ఆ సత్కర్మలు ఆచరిస్తే, దుఃఖం లేకుండా పోవాలి. కానీ ఏం జరిగింది? (దుఃఖం పెరిగిపోయింది) ఎందువల్ల? దుఃఖ జాలము - జాలమంటే రెండో అర్థం వుందండి. వల. అర్థమైందా అండీ? అది ఎటువంటిదట? వల. ఆ దుఃఖజాలము ఎంతగా సమూహమైపోయిందంటే, ఆ వల అది అంతగా బిగుసుకు పోయిందన్నమాట ఇప్పుడు. ఎందుకని? ఇప్పుడు అందులోనుంచి బయటకు రాలేక, పక్షి ఎట్లా అయితే వలలో చిక్కుకుంటే తన్నుకుంటున్నావో, అలా దుఃఖం అనే వలలో తన్నుకుంటున్నావు. ఆ సమూహములో తన్నుకుంటున్నావు. ఎటువంటిదంట అది? లేనిది, పోనిది. దానికి రెండు లక్షణాలు వున్నాయటండి. ఏమిటట అది? లేనిది. అసలు నిజంగా దుఃఖం వుందా? లేదయ్యా. మరి నువ్వు అనుభవిస్తున్నావు కదా! పోవడం లేదు. విచారణ చేసి చూస్తేనేమో, ఆ దుఃఖం లేనిది. కానీ పోతుందా? పోవడం లేదు. అర్థమైందా? అనుభవంలో వుంది కదా! లేనిదని ఎట్లా ఒప్పుకుంటావు? ఇప్పుడు గురువు ఏమంటున్నాడు? శాస్త్రం ఏమంటుంది? ఈ దుఃఖం అనేది లేనిది నాయనా! కలలోది లాంటిది. అది అసలు లేనే లేదు. నువ్వు ఎప్పుడూ ఆత్మస్వరూపుడివే. ఎప్పుడూ ఆనంద స్వరూపుడివే. నీకు అసలు దుఃఖమే లేదయ్యా! నువ్వు సాక్షి స్వరూపుడివి. నువ్వు జ్ఞాన స్వరూపుడివి. నువ్వు అనంతుడివి, నువ్వు అప్రమేయుడివి. నువ్వు సచ్చిదానంద స్వరూపుడివి. నీకు ఏ దుఃఖం లేదు నాయనా! ఆ పరమాత్మతో సమామైనటువంటి వాడివి. నీకు అసలు దుఃఖమనే ఛాయే లేదు నీకు. సుఖంలో కొంచెం ఎక్కువ, కొంచెం తక్కువ వుంటే వుండవచ్చేమో గానీ అసలు దుఃఖమనేదే లేదు నీకు. ఈ సృష్టిలో. నీవు కేవల జ్ఞాన స్వరూపుడివి. నీకు ఏ భేదభావాలు లేవు. నీవు సర్వసముడవు. సాక్షివి. అని చెప్పి చెబుతూ వుంటే, వీడు ఏమనుకుంటున్నాడు? ఏమిటి ఈయన ఇట్లా చెబుతాడు? పొద్దున లేచింది మొదలు రాత్రి దాకా దుఃఖమే కదా! ప్రతి పనిలోనూ దుఃఖమే కదా! ఇది చెయ్యకపోతే దుఃఖం. అది చేస్తే దుఃఖం. ప్రతి పనిలో ఏమిటండీ? చేస్తే ఒక దుఃఖం. చేయలేదంటావా? మరొక దుఃఖం. మరి ఏమిటట ఇప్పుడు నీ సుఖం? ఎక్కడ వుంది నీ సుఖం? వుందా? ఏది చూపెట్టు? ఎందుకని? చెయ్యలేదంటావా? చెయ్యలేదని వాడంటాడు. చేస్తివా నీకు దుఃఖం వస్తుంది. అర్థమైందా అండీ! కాబట్టి చెయ్యకపోతే వాడు మాటలు అన్నాడనీ దుఃఖం వస్తోంది. చేస్తేనేమో చేసిన తరువాత ఫలితాన్ని కూడా అంటాడు కదా! ఏదో ఒకటి? అనకుండా వుంటాడా? అంటే ఏమైంది? మళ్ళా దుఃఖం వచ్చింది. ఎందువల్ల అట ఇప్పుడు? అంటే, మానావమానములతో కూడుకుని వుందట అది. అదీ వచ్చిన చిక్కు అది. ఆ దుఃఖజాలమంతా ఎందువల్ల? ఎందులో ఇరుక్కున్నావయ్యా అంటే? ఇప్పుడు పక్షులను పట్టే వేటగాడు ఏం చేశాడట? వల పన్నాడు. వల కోసం పక్షి క్రిందకు దిగి వస్తుందా? రాదు. దాని లోపల గింజలు వున్నాయి. ఆ గింజలకోసం దిగింది. వలలో చిక్కుకుంది. అట్లాగే నీవు ఏం చేశావట? శరీరం అనేటటువంటి వలలో దిగావు. అర్థమైందా అండీ! ఎందుకు దిగావు? మానావమానములు అనే గింజలకోసం దిగావు. ప్రతిచోట నీ అహం సంతృప్తి చెందుతూ వుందన్నమాట. అక్కడ. ఎక్కడెక్కడైతే నీ అహంకారం సంతృప్తి చెందడం లేదో, అక్కడంతా దుఃఖం వస్తోంది. వాడు నన్ను గుర్తించలేదు. వాడు నా ప్రత్యేకతను గుర్తించ లేదు. వాడు నన్ను ఒప్పుకోలేదు. వాడు నా మాట వినలేదు. వాడు నా మాట వినలేదు. ఏమిటి ఇందులో వున్నది రహస్యం? అంటే, మానావమానాలు వున్నాయి నాయనా అందులో. నీ మాట వింటే, పొంగిపోతున్నావు. మాట వినకపోతే కుంగి పోతున్నావు. అర్థమైందా? ఈ మానావమానాలు అనే గింజలు వున్నాయి ఆ వలలో. అందువల్ల ఏమైందట అవి లేనివి, పోనివి. మానావమానాలు వున్నాయా ఎక్కడైనా చూపెట్టు. అవి లేనివి కదా! పోతున్నదా మరి? పోవడం లేదయ్యా. అంటే ఇప్పుడు ఏం చెయ్యాలట? “మానావమానములను పోగొట్టుకోవాలి, అవి లేనివి అనే భావంతో చూచి”.

            దేని దృష్ట్యా చూస్తే అవి లేవు? నేను ఆత్మస్వరూపుడిని అనే భావంతో చూస్తే అవి లేకుండా పోతాయి. నేను ఫలానా అని ఏ ఉనికితో చూచినా కూడా, అవి పోవు నాయనా! అర్థమైందా అండీ? ఏ ఉనికితో చూసినా సరే! నీవు జీవితం మొత్తం మీద జీవించే, అన్ని పాత్రలు అహంతో కూడుకున్నవే. అంటే అర్థం ఏమిటి? నేను ఫలానా వారి భార్యనండీ? అహం వుంది అందులో. లేదా? నీ ఉనికిని చాటుకుంటున్నావు. అర్థమైందా అండీ! మరి ఎందుకు చాటుతున్నావు? నీవు ఎవరివి? ఫలానా వారి భార్య అనేది దేనిది? శరీరంలోదా? లేకపోతే ప్రాణంలోదా? మనసులోదా? బుద్ధిలోదా? ప్రాణ మనో బుద్ధులకి ఎక్కడైనా భార్యాభర్తలు వున్నాయా? ప్రాణ మనో బుద్ధులకే లేనప్పుడు, దాని సాక్షినైన నాకు ఎక్కడుంది? లేవు కదా! నేను అంతరాత్మను కదా! ఆ ప్రాణ మనో బుద్ధులకు సాక్షిని కదా! ఈ సాక్షికి భార్యాభర్తలు వున్నాయా? లేవు కదా! తల్లిదండ్రులు వుందా? లేదు కదా! బంధుగణం వుందా? లేదు కదా! కూతుళ్ళు, కొడుకులు మనమరాళ్ళు వుందా? లేదు కదా! నీ పాత్రలు అన్నీ ఇవేగా. పుట్టింది మొదలు పోయే దాకా, ఈ పాత్రలే సత్యమనుకుంటివి కదా! పాత్రలు సత్యము ఎలా అయినాయి? పాత్రలు సత్యము అవ్వవు కదా! ఆ పాత్రల ద్వారా నీ అంతరాత్మయొక్క సాక్షిని కదా గుర్తెరగమని చెబుతోంది. కానీ, నీవేమి గుర్తెరిగావు? నీ అంతరాత్మ సాక్షిని గుర్తెరగవయ్యా అంటే, పాత్రలను గుర్తెరిగి, పాత్రే సత్యమంటివి. గిన్నె ఎట్లా సత్యమైంది? గిన్నె సత్యం కాదు కదా! ఎందువల్ల అటా? అలా నీవు గుర్తించడం వల్ల, నీవు రోజూ ఆ ప్రత్యేకత, అహం, ఆ సుఖం కలిగితేనేమో, ఆహా! ఆనందం. ఏమమ్మమ్మా! అంటూ మీ పిల్లలు వచ్చి కౌగలించుకున్నారనుకోండి. ఓ మహదానందం అబ్బా! నిన్ను పట్టించుకోకుండా అట్టాగే వాడెమ్మట వాడు పోయాడనుకో, ఓరినీ వీడు ఇటే పోతూ కనీసం నన్ను పట్టించుకోలేదు. అర్థమైందా? చూడండి. ఏమన్నా అర్థముందా? ఒక్కసారి ఆలోచించుకోండి. మనలో కలిగే భావములు అండీ ఇవన్నీ కూడా. ఎంత దుర్భావములు. ఔనా కాదా? ఆత్మజ్ఞానం దృష్ట్యా చూస్తే, ఎంతటి దుర్భావములు ఇవన్నీ? ఎప్పుడో వదులకోవలసినవి ఇవన్నీ కూడాను. ఏనాడో వదులకున్నట్లయితే, ఎప్పుడో జ్ఞానం వచ్చేసేది. ఈ వదులుకోక పోవడం చేత, పోనీ అదీ అందుకే చెప్పేదండీ. ఇవి పోకుండా పట్టుకున్నావు. అర్థమైందా అండీ? ఈ మానావమానములను అందుకే దేంతో పోలుస్తాడయ్యా అంటే, గబ్బిలం వంటివి. తల్లకిందులుగా కనీసం నిలువుగా కూడా కాదు. తల్ల కిందులుగా. ఆ గబ్బిలం ఎప్పుడూ తల్లకిందులుగానే వుంటుందండి. మనం కూడా అంతే. మనం మానవుడై ఎట్లా వుండాలంట? శిరస్సు పైకి పాదములు కిందకి కానీ ఈ మానావమానముల ప్రభావం చేత, ఏమైపోయావట? తల కిందకి కాళ్ళు పైకి. ఎందువల్ల? జ్ఞానం పోయి అజ్ఞానం వచ్చింది. ఆనందం పోయి దుఃఖం వచ్చింది. అర్థమైందా అండీ! నేను ఆత్మ స్వరూపుడు అని తోచే అవకాశమే లేకుండా పోయింది. పూర్తిగా కప్పివేసినాయి అవి. ఎంతగా కప్పివేసినాయయ్యా అంటే ఈ మానావమానములు, ఇక ఎప్పటికీ జ్ఞాన సూర్యుడు తోచే అవకాశం లేనంత గాఢాంధకారములో కప్పివేసినాయి. గబ్బిలం పగలు ఏం చేస్తుంది? పగలు బయట కనపడుతుందా? కనపడదు కదా! ఎక్కడికి పోతుంది? ఎక్కడ చీకటిగావుందో అక్కడికి చేరుతుంది. ఎందుకనిట? జ్ఞాన సూర్యుడు కనపడితే దానికి కళ్ళు కనపడవు. జ్ఞాన సూర్యోదయం కనుక జరిగితే గబ్బిలానికి కళ్ళు కనపడవు. అట్లాగే నీకు ఆత్మజ్ఞానం వుదయిస్తే, మానావమానములు లేనే లేవు. అవకాశమే లేదు అసలు దానికి. అయ్యో! ఇది నేనే, ఇట్లా చేయకూడదే. ఏమిటది నువ్వు అర్థం వుందా? నీవు ఎవరివి మొట్టమొదట? అది ఆలోచించు. నీవు పరమాత్మ స్వరూపుడవు. అథవా కాదు. ఆత్మ స్వరూపుడవు. ఈ రెండూ వదిలేసి ఎక్కడికి వచ్చేశావు? నేను జీవుడు. నేను శరీరం. నేను ఫలానా ఇల్లు. నేను ఫలానా ఇంట్లో ఫలానా గది. ఫలానా గదిలో ఫలానా మంచం. చివరకి ఎక్కడి దాకా వచ్చేశావు? (జీవుడని కూడా తెలియదు, శరీరమనే భ్రాంతి) ఇంకా కూడా చెబుతా వినండి.
            వృద్ధాప్యం వచ్చేసిందండి. మంచంలో పడ్డావండి. నీ ప్రపంచం ఏమైపోయింది అప్పుడు? మంచమే నీ ప్రపంచము. చూశా నేను అదికూడా చూశా. అట్లా కూడా చూశా. ఎంతో మందిని చూశా. ఆ మంచం తగిలితే చాలు. ఎరా ఎందుకు తగిలావు నా మంచాన్ని. గొడవపడే వృద్ధులు లేరా? ఎందుకని? మంచమే అతని ప్రపంచం. మిగిలిన ప్రపంచం అంతా అయిపోయింది. ఇంద్రియాల బలం క్షీణించిపోయింది. వెనక్కు తీసేసుకుంది. వృద్ధాప్యం వచ్చేసింది. చివరకు ఎంతకు వచ్చేసింది? మంచమే నీ ప్రపంచం. దుఃఖపడిపోతూ వుంటావు. అయినా సరే మార్చుకోలేవు. మీ కళ్ళ ముందు మీ పెద్దవాళ్ళను అందరినీ చూడండి. గతించినటువంటి పెద్దవాళ్ళను చూసి ఆహా! ఏమి జ్ఞానమును బోధించారు వీళ్ళు. వాళ్ళ చివరికాలంలో వాళ్ళు మనకి జ్ఞానమే బోధించి వెళ్తున్నారు. నాయనా! నావలె నీవు వుండమాకు. మానావమానములతోటి, పరిమితమైన భావంతోటి, దుఃఖపడిపోతూ ఎందుకు వెళ్తావు? ఆత్మజ్ఞానంతో సుఖంగా వెళ్ళిపో. సుఖంగా వెళ్ళాలి, సుఖంగా వెళ్ళాలి అని అందరూ అంటూ వుంటారండి. దేనిని ఆశ్రయిస్తే సుఖంగా ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళగలవో, ఆ పని చేయకుండా సుఖంగా వెళ్ళాలనే ఆశ మాత్రం వుండడం వల్ల ఏమి ప్రయోజనం వుంది? పేరాశ అది. ఎందుకని? జీవితకాలమంతా జ్ఞాన సముపార్జనకు ఏ ప్రయత్నమూ చేయలేదు. ఏ విచారణా చేయలేదు. ఏమీ మార్చుకోలేదు. మరి పేరాశ మాత్రం అట్లాగే వుండి పోయింది. ప్రతి ఒక్కరూ చెబుతున్నారా? లేదా? ఏదో లేండి. ఈ జీవితం ఇట్లా సుఖంగా జరిగిపోయి, సుఖంగా వెళ్ళిపోతే చాలు. పేరాశ అన్నమాట. ఎప్పటికీ తీరదు ఇది. ఎందుకనిట? చిక్కుకున్నావు వలలో. దుఃఖజాలము అనే వలలో చిక్కుకున్నావు. ఎందువల్ల? మానావమానములు అనే సంతృప్తి కొరకు. నీవు పొగడ బడటం, ఇతరులను తెగడటం రెండు సమస్యలు వున్నాయి. నువ్వు పొంగాలి అంటే ఎదుటివాడు కుంగాలి, నువ్వు ఆయన్ని అంటావు ఏదన్నా. వాడిని విమర్శిస్తావు. విమర్శిస్తే, ఏమిటయ్యా ఉపయోగం? నీకు ఆనందం. ఎందుకని? వాడు కుంగిపోతూ చూస్తూ వుంటే నీ మానం అవమానం రెండూ నువ్వే. అక్కడ కుంగిపోతోంది నువ్వే. ఇక్కడ పొంగిపోతోంది నువ్వే. ఈ పొంగక, కుంగక వుండేటటువంటి జీవితం రావాలన్నమాట. అప్పుడే “లేని, పోని” అనే స్పష్టమైన అర్థం తెలుస్తుందన్నమాట. పుట్టింది మొదలు, పోయేదాక పోవడం లేదు. అనుభవంలో వుంటోంది. కానీ ఇది లేనిది అని తెలుసుకుని జీవిస్తే అదిపోతుంది. ఇది వున్నది అని గుర్తించినంతకాలం, ఎప్పటికీ పోదు. గుర్తుపెట్టుకోండి.

            శరీరం గాని, విషయాలు కానీ, పంచకోశాలు కానీ వున్నవి అని నీకు తోస్తూ వున్నంత వరకూ  వాటి వల్ల నీకు దుఃఖం తప్పదు. ఎక్కడికీ పోదు నాయన అది. కాబట్టి ముందు ఏమి నిర్ణయం చేయాలట? ఇవి లేనివి అని నిర్ణయం చెయ్యి. ఇవి లేనివి. ఆత్మ స్వరూపభావనలో ఇవి లేనివి. అని నిర్ణయం చేసి ఆ దృష్టితో చూడవయ్యా! అది పరిష్కారం దానికి. ఇది పోవాలి అంటే ఎట్లా? నేను ఆత్మస్వరూపుడను అనే భావంలో స్థిరపడి వుండి, ఆ అభ్యాసబలంతో, ఆ అలవాటుని వృద్ధి చేసుకుని, ఆ దృష్టితోటి ఎప్పుడెప్పుడైతే ఇవి కలుగుతూ వున్నాయో, ఇది లేనిది కదా! మళ్ళా తోస్తోందే, నన్ను మళ్ళా లాక్కుపోతోందే వలలోకి. నా స్వేచ్ఛను హరిస్తోందే. నా ఆనందాన్ని హరిస్తోందే, అది మళ్ళా వచ్చిందిరా బాబు. దీనికి జాగ్రత్తగా వుండాలి నేను. దీనికి జాగ్రత్తగా వుండాలి. దీనికి జాగ్రత్తగా వుండాలి. అని ఎప్పటికప్పుడు చూసుకుంటూ వుండాలి. ఒక రెప్పపాటు చాలు నిన్ను మానావమానాల్లోకి పట్టుకుపోవడానికి. ఒక రెప్పపాటులో లాక్కె్ళ్ళిపోతుందండి, అంతే ఏమీ వుండదు అక్కడ. (అటు పోంగానే ఇది మర్చిపోతున్నాము) పోయే! ఇంక ఏముంది? అర్థమైందా అండీ!

            నిరంతరాయంగా, అందుకే చెప్పేది, నీకు మరణం ఎంతకాలంలో వస్తుంది? రెప్పపాటులోనే వస్తుంది. ఆ రెప్పపాటులోనే నీకు ఆత్మస్వరూపభావన నిలబడి వుండాలి నాయనా! అంతగా అభ్యాసము చేయి. సహజమైతే తప్ప ఇది సాధ్యం కాదు. అప్పటికప్పుడు ఏ నేను ఏదో బోల్డు సార్లు ప్రయత్నం చేశానండీ, లక్షకోట్లు జపం చేశానండీ ఏం ప్రయోజనం లేదు. నీ జపమాల ఎక్కడో దానితోపాటే అదీ పోయింది. నీ జపం దేనితో పోయింది? దేనిమీద ఆధారపడి చేశావు? జపమాల మీద ఆధారపడి చేశావు. పోయే. ఆ జపమాల పక్కన పెడితే నీ జపము పోయే, నీ జపమాల పోయే. ఎందుకని? దానివల్ల ఏ అనుభవము లేదుగా. యాంత్రికం కదా! ఏం చెయ్యాలట? జపమాల విసిరేయ్‌. హంస జపం చేయి. నీ హంసతో సమంగా జపం చేయి. నీ ప్రాణంతో సమంగా జపం చేయి. కొంతవరకూ ప్రయోజనం వుంది. తరువాత ఆ ప్రాణం ఆగిపోతే ఏం చేస్తుంది? జపం ఆగిపోదా? అప్పుడేమి చెయ్యాలట? ప్రాణంతో పని లేకుండా జపం జరగాలట. గాలి విడిచిపెట్టేది లేదు, తీసుకునేది లేదు. కానీ మనసు మాత్రం జపం చేస్తూ వుండాలట. అది పరిస్థితి ఇంక. క్రమంగా చెబుతున్నా అందుకోసం పైకి. అర్థమైందా అండీ! ఇంకా పై స్థితి, మనసుతో కూడా పనిలేదు, ఏ ఆలోచనతో కూడా పనిలేదు. మౌనంగా జపం చేస్తావట ఇప్పుడు. అప్పుడు కూడా జపమే జరుగుతుంది. మౌనంగా జరుగుతుంది కాకపోతే. (జపం అంటే ఎలాగు, నామాన్నా లేకపోతే..) నీ ఇష్టం ఏదైనా సరే, ఏదైనా ఒకటే. సప్త కోటి మహామంత్రములున్నాయండీ, ఏడు కోట్ల మహామంత్రాలు వున్నాయి. అన్నిటి ఫలితం ఒక్కటే. అన్నీ మంత్రాల యొక్క ఫలితం ఒక్కటే. మనసుని ఒక స్థాయిలో నిలబెట్టడం వరకే. ఒక స్థితిలో మనసుని స్థిరంగా నిలబెడుతుంది. (మనసు లేని స్థితిలో వుండాలా? మనుసు...) అది తరువాత విషయం. అది తర్వాత విషయం. పై విషయాలు మాట్లాడుకుంటే ప్రయోజనం లేదు. ముందు సాధన అక్కడ దాకా రావాలి. వచ్చినాక అప్పుడు పై స్థితి.
            తర్వాత. చూడండి. పైన ఏం చెప్పాడు. లేనిపోని దుఃఖజాలం చెప్పి, అది గబ్బిలం అన్నమాట. వెంటనే కింద ఏం చెబుతున్నాడో చూడండి. నిజగురుండగు సూర్యుడిప్పుడు నిజముగా వుదయించే చూడుము. ఆ మానావమానాలు విడిచి పెడితే గానీ నీకు గురువు కనపడడయ్యా! ఎప్పటికైనా సరే. నాకు గురువు కనపడలేదండి. నాకు గురువు కనపడలేదండి. నువ్వు ఎంత మొర పెట్టుకున్నా ప్రయోజనం లేదు. విడిచి పెట్టు మానావమానాలు వెంటనే గురువు కనబడుతాడు. నిజగురుండగు సూర్యుడిపుడు నిజముగా ఉదయించె చూడుము. త్రిజగముల వారంతా మేల్కొని తెలివి గన్నారు. జీవా మేలుకొనవే. అలాగ ఎప్పుడైనా కూడా ఏమిటి చేయాలట దానిని? ఆ మానావమానములలోనుంచి బయటకు రా. అది లేని పోని దుఃఖజాలమని తెలుసుకో. బయటకు వచ్చి చూస్తే, నిజగురుండగు సూర్యుడిప్పుడు నిజముగా ఉదయించెను. చూడుము. ఎందుకనిసృష్టంతా గురువుగానే కనపడుతాడు. ఆ రెండింటి వల్లనే ఈ సృష్టి గురువుగా కనపడడం లేదు. పరమాత్మ ఈ సృష్టి అంతా తనయొక్క స్వరూపంగా ఎక్కడ చూచినా పరమాత్మయే ఈ సృష్టి అంతా కనపడేటట్లుగా సృజించాడు. కానీ నీకు మానావమానములు వుండడం చేత, వాటికంటే నేను అధికుడిని అనేటటువంటి అహంకారం వుండడం చేత, ఆ సృష్టిబోధించేటటువంటి బోధను స్వీకరించలేక పోతున్నావు నాయనా! అర్థమైందా అండీ!

అందుకనే ఏం చెబుతున్నారు? పరోపకారం కోసమే పుట్టాలి, పరోపకారం కోసమే ఈ శరీరాన్ని ఉపయోగించాలి అంటున్నారు. ఎందుకనిట? ఆ పశువులు, పక్ష్యాదులు లేకపోతే ఈ చెట్లు, చేమలు నదులు అన్నీ ఉపమానాలు చెబుతూ వచ్చారు. అవి అన్నీ దేనికోసం పారుతున్నాయి? దేని కోసం పుష్పిస్తున్నాయి? దేని కోసం ఫలిస్తు్న్నాయి? వాటికి ఏమైనా ఉపయోగం వుందా? ఏమీ లేదు కదా! అవన్నీ పరోపకారమే బోధిస్తున్నాయి కదా! నీకు. మరి నువ్వు ఎందుకు చేయవయ్యా పరోపకారము? ఈ అనంత సృష్టి ఏం బోధిస్తున్నది? రోజు ఎవరికో ఒకరికి ఉపయోగపడవయ్యా! ఎవరికో ఒకరికి ఉపయోగపడవయ్యా! అంటే ఏం చేస్తివి? (ఇంట్లోవాళ్ళకి ఉపయోగపడుతున్నాడు) అదీసంగతి! ఎక్కడైతే నీ అహంకారం సంతృప్తి చెందుతుందో, వాటికి ఉపయోగపడే ప్రయత్నం చేస్తున్నావే, నిన్ను గుర్తించని వాడికి చెయ్యి. నువ్వు ఎవరో తెలియనివాడికి చెయ్యి. నువ్వు ఎవరో తెలియచెప్పకుండా చెయ్యి. అది పరోపకారం అంటే. అర్థమైందా అండి? నేను ఫలానా అని వాడికి తెలియకూడదు. కానీ వాడికి ఉపకారం జరగాలి. నీకు అప్పుడు కర్తృత్వం వుండదు అక్కడ. నేను చేశాను అనే భావన వుండదు అక్కడ. అప్పుడు అహం పోతుంది. అదీ పరోపకారం, ఆ సేవ వల్ల ఉపయోగం. నేనును త్యాగం చేయాలి. ఆ నేనును త్యాగం చేయనంత వరకూ ఎప్పటికీ కూడా, నీవు గురువును గుర్తించలేవు. గురువుని గుర్తించాలి అంటే, ఎవ్వరైనా సరే, ఆ మానావమానములని విడిచి పెట్టాలి. నేను అనే కర్తను త్యజించాల్సిందే. అప్పటి వరకూ నీ గురువు వల్ల ఏం ప్రయోజనం లేదు.
            తరువాత, “బట్టబయలును గురుడు జూపిన, నట్టు లేకను పుడమి అంచున, పట్టు విడువక గుట్టు మరువక, దిట్టమై పోవెజీవా మేలుకొనవే!” - పరమాత్మ రహస్యం, రహస్యం, రహస్యమని అంటుంటారు కదా! కానీ పరమాత్మ ఎలా వున్నాడట? బట్టబయలుగా వున్నాడట. ఏ రహస్యం లేకుండా అంతటా, సర్వవ్యాపకమై, అణువు మహత్‌ అనే తేడా లేకుండా, అనంత సృష్టియందు విశ్వమంతా వ్యాపించి వున్నవాడు పరమాత్మ. బట్టబయలుగా వున్నాడట. మనం ఎందుకు చూడలేకపోతున్నాము మరి? (మన కళ్ళకే కనబడడం లేదు) అదీ సంగతి! సమస్య నీ దృష్టిలో వుంది కానీ, సృష్టిలో లేదయ్యా! ఆ సృష్టిని పరమాత్మభావంతో చూడవయ్యా! అప్పుడు పరమాత్మయే కనపడుతాడు. చూడకపోవడం చేత, బట్టబయలును గురుడు చూపిన, ఆ గురువు ఏం చేశాడయ్యా? ఇదిగో పరమాత్మ ఎలా వున్నాడో చూడు, అదిగో ఆ మల్లెచెట్టు పూస్తోంది కదా! ఆ పువ్వులు పూస్తున్నాయంటే, దాని వెనుక ఎవరి శక్తి కారణం? ఆ కారణం ఎవరయ్యా? పరమాత్మే. ఆ చైతన్యమే దాంట్లో పనిచేయకపోతే అది ఎట్లా పూస్తుంది? జడ పదార్థం కదా అది. నీవు ఇంత అందంగా మాట్లాడుతున్నావు. ఎవరి వల్ల ఏ ప్రభావం వల్ల? ఒకాయన అందంగా పాడుతున్నాడండీ, శ్రావ్యంగా పాడుతున్నాడండీ, ఎవరి ప్రభావం వల్ల? బాలమురళీ కృష్ణగారు పాడుతున్నారు కాదు. బాలమురళీకృష్ణ యందున్న సత్తా ప్రభావం చేత ఆ ఉపాధి అలా ఉపయోగపడుతుంది. అర్థమౌతుందా అండీ!
            నేను చిరంజీవి favorite ని అండి. చిరంజీవి అలా నటించడానికి కారణం ఎవరు? అతనిలో పనిచేసే పరమాత్మ సత్తా. ఆ చైతన్యం, అలా ప్రవర్తిస్తూ వుంది. ఆ ఆ ప్రాథమికతతో పనిచేస్తుంది. నేను అద్భుతంగా వంట చేస్తాను. జయపిన్ని అద్భుతంగా వంటచేసే అవకాశం లేదు. అందులో వున్న పరమాత్మ సత్తా, ఆ చైతన్యం, ఆ రూపంలో, ఆ గేట్‌లోనుంచి పనిచేస్తోంది. (మరి ఒక్కొక్కళ్ళు ఒక్కోరకం వుంటున్నారు కదా!) ఆఁ... ప్రాణ మనో బుద్ధులలో వుంది అది. ఆ సూక్ష్మంలో వుంది అది. దీనిని బాగు చేయాలంటే ఎక్కడ బాగు చేయాలంట ఇప్పుడు? సూక్ష్మాన్ని బాగు చేయాలి అసలు. మనం దేనిని బాగుచేయాలయ్యా అంటే సూక్ష్మాన్ని శుద్ధి చేయాలి. నవవిధ భక్తి మార్గాల ద్వారా, ప్రాణ మనో బుద్ధులు శుద్ధి చెందాలి. కానీ, ఏవి శుద్ధి చెందుతున్నాయి? బాహ్య శుద్ధి. పదిసార్లు నీళ్ళు పోసుకున్నావు కదా! పైనుంచి కిందకి? అంతేనా కాదా! 10 సార్లు స్నానం చేసేస్తే ఏమైందట? శరీరం శుద్ధి అయ్యిందని నీ అభిప్రాయం. అసలు ఆ భక్తి వలన ఏమి శుద్ధి అవ్వాలి? ప్రాణ మనో బుద్ధులు. వాటిలో వున్న వాసనాబలం పోవాలి. వాటిలో వున్న సంస్కార బలం పోవాలి. వాటిలో వున్న గుణబలం పోవాలి. (మనస్సు అప్పుడు ఈ మూడే చెబుతున్నారుగా... మనస్సుని) ఒక్కటే గుర్తు పెట్టుకోండి. మనసే బుద్ధి, బుద్ధే చిత్తం, చిత్తమే అహంకారం, అన్నీ మనసే!           అయితే దాని యొక్క స్థితిని బట్టి, పనిచేసే పరిస్థితిని బట్టి, చెబుతున్నాడు. అలా విడగొట్టి చెప్పకపోతే ఏమౌతోంది? దానిని పట్టలేకపోతున్నావు కదా! నువ్వు పట్టడం కోసమని విడగొట్టి చెబుతున్నాడు. అర్థమైందా? అందుకని, ప్రాణ మనో బుద్ధులు అని తేల్చేస్తు్న్నాడు. ఎందుకని? స్పష్టంగా విడిపోయి వున్నాయి అవి. ఈ మనసూ బుద్ధే ఇంకా కొంచెం సూక్ష్మం అయితే, లోపలికి వెళ్ళి తిరిగి చూస్తే చిత్తము, అహంకారము అగుతున్నది. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము. అది అక్కడి దాకా వెళ్ళాలి అంటే నువ్వు ముందు దీనిని బాగుచేయి. ప్రాథమిక వ్యవసాయం చేయి. ఇప్పుడు ఎలా వుందట? కొండలు, గుట్టలు, తుప్పలు, రాళ్ళతోటి వుంది. మన క్షేత్రం అంతా కూడా. దీనిని ఏం చేయాలి ముందు? బాగుచేయి ముందు. అప్పుడే విత్తనాలు వేస్తే ప్రయోజనం ఏముంది? కాబట్టి నీవు ఆ బట్టబయలు ఎట్లా అయితే వున్నాడో, వుందో అలా పరమాత్మ వున్నాడయ్యా!
            ఏ రహస్యమూ లేదు నాయనా! కనపడకపోవడం అనే ప్రసక్తే లేదు నాయనా! నువ్వు అన్వేషించవలసిన అవసరమే లేదు. ఎందుకని? నీ లోపల, నీ బయట, అంతటా సర్వత్రా వ్యాపించివున్నవాడిని ఎక్కడని వెతుకుతావు? మనం పుట్టింది మొదలు ఏం చేశామండీ? ఇప్పటి వరకూ! కాశీలో వున్నాడా? రామేశ్వరంలో వున్నాడా? కేదార్‌నాథ్‌లోవున్నాడా? ఇంకా ఇప్పటికీ కూడా మనలో ఆలోచన కదులుతూనే వుంది కదా! గంగోత్రిలో వున్నాడా? యమునోత్రిలో వున్నాడా? వుందా ఎక్కడైనా? అక్కడెక్కడ వున్నాడు? అక్కడ వుంటే ఇక్కడ లేడా? అక్కడే వుండి, ఇక్కడ లేకపోతే పరమాత్మ ఎలా అయ్యాడు? ఒకసారి ఆలోచించండి? అతను దైవమే కనుక అయితే, దైవం సర్వవ్యాపకుడు కదా! కేదార్‌నాథ్‌లో మాత్రమే వుండి ఇక్కడ లేడా? ఎలా సాధ్యం? అలా అయితే దైవం ఎలా అయ్యాడు? అంటే ఏ భ్రాంతి వున్నది ఇప్పుడు నీకు? క్షేత్రభ్రాంతి వున్నదన్నమాట. అంటే ఏమిటట? ఆ క్షేత్రానికి వెళితే పుణ్యం వస్తుందిగా. ఏం చేసుకుంటావు నీ పుణ్యాన్ని? (మళ్ళా జన్మవస్తే..) మళ్ళా సుఖమేగా. (మళ్ళా సుఖం ఎందుకని అనే ఆలోచన కూడా వుండదు.) అంటే అర్థం ఏమిటి? పుణ్యం వస్తే చాలని ఎందుకు? పుణ్యం వలన సుఖం వస్తుంది. నీకు పుణ్యాన్ని ఎందుకు కోరుతున్నావయ్యా? సుఖాపేక్ష. సుఖం మీద అపేక్ష (ఆశ) వున్నదన్నమాట. ఆ సుఖం ఏమిటి? శరీర సుఖమే కదా! ఇంద్రియ సుఖమే కదా! ఈ ఇంద్రియసుఖం కోసమని, మోకాటి పర్వతం ఎక్కి, మోకాలి చిప్పలు పగులగొట్టుకొని, ఆ తిరుపతి అల్లా వెళ్ళి, ఆ తిరుపతి దేవుడు ఇక్కడ లేడా? ఏడు కొండల మీదే వున్నాడా? ప్రతి దాంట్లో, ప్రతి క్షేత్రంలో కూడా వాళ్ళు స్పష్టంగా, ఆత్మజ్ఞాన నిరూపణ కోసమే అవన్నీ అలా పెట్టారు. అన్నీ కష్టాలు పడి నువ్వు ఎందుకు వెళ్ళాలయ్యా? అంత కష్టపడి వెళ్ళిన తరువాత అయినా కానీ నీకు తెలుస్తుందని. ఒరేయ్‌! అక్కడ వుంది, ఇక్కడ వుంది ఒక్కడేరా దేవుడు అని. ఎందుకని? ఎప్పుడూ ఏడుకొండల మీదే వుండు. సాధ్యమవుతుందా? వీలుకాదు కదా! కాబట్టి, దైవం అంటే, పరమాత్మ అంటే, సర్వవ్యాపకమై, బట్టబయలు వలె వున్నాడయ్యా! ఈ సత్యం తెలుసుకో.
            ‘గురుడు జూపిన, నట్టు లేకను పుడమిపుడమి అంటే సృష్టి, ఈ సృష్టిని అట్లా చూడవయ్యా! పరమాత్మ భావంతో చూడు. అందునను పట్టు విడువక, గుట్టు మరువకఈ పరమాత్మ సర్వవ్యాపకుడై వున్నాడనే గుట్టును మరువద్దు. అది మరచిపోతుంటావు, మాటిమాటికి శరీరభావంలోకి వస్తుంటావు కాబట్టి. మరువక పట్టువిడువక - పంతం నీకు ఏమన్నా పంతం వుంటే, ఇందులో పట్టు. ఆ, నీకు ఇప్పటి వరకూ, అన్నింటిలో, బోల్లెడు విషయాలల్లో పంతం వున్నది కదా! ఆ పంతం ఏదో ఇందులో పట్టు చూద్దాం. నీ సత్తా ఏమిటో తెలుస్తుంది. అంతటా వున్న పరమాత్మను దర్శించడంలో పట్టు పట్టు ఆ పంతమేదో. నాకు ఏమైనా సరే, అంతటా వున్న పరమాత్మ నాకు ఎందుకు కనపడడు? ఆ పరమాత్మ భావంతో చూడు, అంతేకానీ, అహంతో చూస్తే కనపడడు మళ్ళా. అక్కడ ఎవరైనా ఆత్మజ్ఞానం వున్న మహానుభావుడు దొరికితే, నీకు ఏమైనా ఇలాంటి వాక్యం చెబుతాడనే వుద్దేశ్యంతో పెట్టారు అవి (తీర్థయాత్రలు). పైగా దానికి ఒక నియమము వుందండి. ఈ క్షేత్ర సందర్శన సన్యాసికి లేదు, అర్థమైందా అండీ! బ్రహ్మచారికి లేదు. ఎవరికి వుందంట మధ్యలో. గృహస్థుకి ఒక్కడికే వుంది. వానప్రస్థుడికి అస్సలు లేదు. ఎందుకని వనాల్లో వుంటాడు కాబట్టి. ఏకాంతంలో వుంటాడు కాబట్టి. సన్యాసికి అవసరం లేదు. బ్రహ్మచారికి ఆ వికాసం లేదు. కేవలం గృహస్థుకి మాత్రమే ఈ క్షేత్ర ఆరామ సందర్శన, తీర్థయాత్రలు అన్నీ కూడా. ఎందుకు పెట్టాడయ్యా అంటే, నీవు ఈ తీర్థయాత్రా ఫలితం వల్ల ఎవడైనా ఒక మహానుభావుడిని గుర్తిస్తే, వాడిని ఆశ్రయించి నీ మిగిలిన జీవితం వెల్లబోయడం కోసం. అంతేకాని అక్కడికి వెళ్ళి తిరుపతి ప్రసాదం తిని రమ్మని కాదు. గుండుకొట్టించుకోవడం, లడ్డూ తినడం, వచ్చేయడం. ఇంతేకదా! తిరుపతిలో వెళ్ళేది, మనం చేసేది ఇంకేమన్నా వుందా? ఎప్పుడైనా కానీ, ఎక్కడైనా ఆలయానికి వెళ్ళినప్పుడు, ఏదైనా, ఎక్కడైనా ఎవరైనా మహానుభావుడు వున్నాడా? ఆత్మజ్ఞానాన్ని బోధించే వ్యక్తి ఇక్కడ ఎవరైనా వున్నారా? అని అన్వేషించావా? ఎప్పుడైనా? (ఎదరుగుండా వున్నా గుర్తించే స్థితి లేదు) అవునమ్మా! అంటే ఏమిటి నువ్వు అసలు ఇక్కడ బయలు దేరే ముందే నేను ఎందుకు వెళ్తున్నాను? నేను ఎందుకు వెళ్తున్నాను అసలు అక్కడికి? ఆ మహానుభావుడిని వెతకడం కోసం వెళ్తున్నాను. నా జీవిన గమ్యాన్ని కడతేర్చే మహానుభావుడు ఎక్కడైనా ఇప్పటి వరకూ లభించలేదు, నాకు గురువు అక్కడెక్కడైనా లభిస్తాడా? అని అన్వేషణతోటి నువ్వు ఇక్కడ జీవిస్తే, ఆ దృష్టి వస్తుంది. అంతేగాని, ఇక్కడనుంచి అన్నీ సరాసరి, recommendation తోటి చివరాఖరి ద్వారా book చేస్తివి అన్నీ. ప్రశాంతంగా ఎక్కి పడుకుంటివి. అక్కడ లేస్తివి. వెళ్తివి. చూస్తివి. గుండుకొట్టించుకొనుకొంటివి. తిరుపతి లడ్డూ ప్రసాదం కూడా recommendation తోనే వెళ్ళి తీసుకొంటివి. వచ్చేస్తివి. ఏమిటయ్యా అంటే? మా అల్లుడండీ! సరాసరి బంగారు వాకిలా దాకా తీసుకుపోయాడండీ! 10 నిమిషాల్లో దర్శనం అయిపోయిందండి. ఆహా! అద్భుతంగా AC లాడ్జిలో పడుకున్నామండి, వచ్చేశామండి. ఏమైందట ఇప్పుడు? ఏమిటి ప్రయోజనం? ఇదే కదా మనం చెప్పుకునేది. ఎన్ని తీర్థయాత్రలు చూసుకోండి మీరు. (దేవుడి దర్శనం కంటే బాగా కూడా, తీసుకెళ్ళే వాళ్ళు బాగా తీసుకెళ్ళారండీ! చూపిచ్చారండీ! ఇదే ఎక్కువౌతుంది.) ఆఁ.. అర్థమైందా అండీ!        ఏమైంది ఇప్పుడూ? అర్థమైందా?
            ఇలా ప్రతీ దాని వెనుకా గూడా ఇలా మోసపోతున్నావయ్యా! అందుకే ఇది మొదలుపెట్టినప్పుడే చెప్పాము. కటకట మోసమాయెను ఇలా మోసపోతున్నావు తెలుసుకో! ప్రతి పద్యంలోనూ అందుకే చెప్పేది, అందుకే ఈ శీర్షక మొట్టమొదట అలా పెట్టింది, ఈ ప్రతి అంశంలో కూడా, నువ్వు మోసపోతున్నావయ్యా! ఏంటి మోసపోతున్నావు? ఆత్మజ్ఞానాన్ని కోల్పోతున్నావయ్యా! దేనికోసమైతే మానవ ఉపాధి వచ్చిందో, ఆ లక్ష్యం పోయిందయ్యా! ఆ గమ్యం పోయిందయ్యా! ఆ విధానం పోయిందయ్యా! ఇది తెలుసుకో!
            ‘మాయ తనువై, మాయ తానై, మాయపనులను చేయుచును మరి, మాయ తన మర్మంబు గనినే మాయమైపోవున్‌ జీవా మేలుకొనవే’ - మాయ మాయా అంటున్నావు అసలు మాయ వున్నదా? మాయ అంటేనే అర్థము లేనిదని. మాయంటే అర్థం ఏమిటి? లేనిదని. (మాయ చేశాడమ్మా అంటాం) లేనిది magic. అక్కడ వాడు ఏం చేశాడట? ఇంద్రజాలికుడు? గాల్లో చేతులు ఊపాడు. లేని వస్తువుని సృష్టించాడు. నీ చేతిలో పెట్టగానే మాయమైపోయింది. ఎలాగట? మాయ అంటే లేనిదయ్యా బాబూ! వున్నది కాదు అది. కానీ నువ్వు దేనిని ఆశ్రయించావట? వున్న పరమాత్మను ఆశ్రయించవయ్యా అని అంటే, నీ మానావమానాల యొక్క పోషణ కోసం, ఈ మాయను ఆశ్రయించావు. ఆశ్రయించి పైగా ఏం చెబుతున్నావు? చివరకు వచ్చేప్పటికి ఫలితం దుఃఖం అయినాక, ఏం చేస్తావు నాయనా! అంతా మాయ. అయ్యో! మోసపోయావు కదా! లేని మాయను ఆశ్రయించడం వల్ల మోసపోతున్నావు నాయనా! ఆ మాయకు ఒక రహస్యం వున్నదంటా. ఏమిటట అది? మాయ తనువై - నీ తనువు మాయే నాయన! అంటే లేనిది. మాయ తానై - నువ్వు ఎన్నింటినైతే నేను నేను అనుకుంటున్నావో, ఆ నేను లేనిదిరా బాబు. మాయ తనువై, మాయ తానై రెండూ స్పష్టంగా చెబుతున్నాడు, అందుకోసమే! నువ్వు తనువే అంటావా? అది అసలే లేనిది. తనువు కాదన్నావు. ప్రాణం. అది కూడా లేనిదయ్యా! మనస్సు. అదికూడా లేనిదయ్యా! బుద్ధి. అది కూడా లేనిదయ్యా! దానికి అవతల చిత్తం. అదికూడా లేనిదయ్యా! దాని అవతల అహంకారం. అదికూడా లేనిదయ్యా. తెలుసుకునేవాడు - వాడు కూడా లేడయ్యా బాబు. ఎన్నింటికైతే ఈ నేనును ముడేస్తున్నావో, లోపలికి వెళ్ళే కొద్దీ, అవికూడా లేనివే. మాయ తానై అంటే అదన్నమాట అర్థం. ఎక్కడిదాకా అంటే, పరమాత్మ దాకా. చివరకు అదికూడా లేనిదే. అది తర్వాత విషయం. అర్థమైందా అండీ! ఈ నేనును ఏఏ స్థితికైతే ముడేస్తూ వెళ్తున్నావో, అవన్నీ లేనివే నయ్యా! ఎందుకు కిందకి చెప్పడం లేదు. కిందవన్నీ పైన చెప్పేశాడు. మాయ తనువై, శరీరము, శరీర గత సంబంధాలన్నీ మాయేనయ్యా బాబు. ఒక దెబ్బకు తీసి అవతల పడేశాడు. మిగిలినవి ఏం మాట్లాడుతున్నాడు? సాధనలో ప్రయాణం చేసేటప్పుడు, నేను శరీరం కాదు, నేను ప్రాణమును అనుకున్నావు కదా! నేను ప్రాణమును అనుకోగానే పోయింది మళ్ళా అదికూడా మాయే నాయన. మాయ తానై, ఈ నేనును ఎక్కడెక్కడైతే ముడేస్తున్నావో, అదికూడా లేనిదే నయ్యా! బాబూ! మాయతనువై, మాయతానై, మాయ పనులను చేయుచు - ఎందుకు చేస్తున్నావట? ఈ నేనును అలా మాయకు ముడేశావు. ఈ శరీరమే మాయ. అది తెలుసుకోలేకపోతున్నావు. అర్థమైందా అండీ! మీరందరూ తెలియకుండానే ఆ మాట అంటూ వుంటారు. తల్లిగర్భంలో ఎక్కడ పెరిగిందండీ శిశువు? ఎక్కడ పెరిగింది? నీ శరీరం ఎక్కడ పెరిగింది? దేని ద్వారా తయారైంది? దాంట్లో నుంచే తయారైంది. దాంట్లో నుంచే తయారైన దానికి దాని లక్షణం కాకపోతే వేరే ఏమి వుంటుంది? (మాయ లక్షణం). అంతే కదా! ఎందులో తయారైంది ఇది? (మాయలో) అక్కడే ఆ స్థానంలోనే తయారైంది. ఆ స్థానంలో, ఆ ఆహారంతో, ఆ లక్షణంతో, ఆ గుణంతో తయారైనటువంటి శరీరానికి, ఏమి వస్తుందయ్యా? లేని లక్షణమే వస్తుందయ్యా! ఎందుకని? తల్లికి దానితో తరువాత ఏమైనా పని వుందా? ఏం పని లేదు. గెంటి అవతల పడేసింది. శిశువుతో సహా! చూసుకోండి ఒకసారి. శిశువుతో సహా తల్లి శరీరం ఏం చేసింది? నీతో నాకు ఏం పనిలేదు పొమ్మంది అంతే! మాయను గెంటి అవతల పడేసింది. పడకపోతే అప్పుడు తల్లికి ప్రమాదం. అర్థమౌతుందా అండీ! సృష్టికి సహజలక్షణం ఎలా వుంది? ఏ జీవితోనైనా సరే, అలా గెంటి అవతల పడేస్తుంది. అంటే ఏమిటి మాయను ఆశ్రయించే అవకాశం లేదయ్యా! సృష్టిలో ధర్మం ఎంత చక్కగా బోధిస్తుందో చూడండి. కానీ మనం ఈ పాఠం నేర్చుకున్నామా? ఐదుగురు పిల్లల్ని, ఆరుగురు పిల్లల్ని, డజను మందిని కంటివి. పొరపాటునైనా కూడా ఇలా విచారణ చేశావా? చెయ్యలేదు కదా! ఎంతోమంది మన కళ్ళముందు పిల్లలు పుడుతున్నారు.  వాళ్ళను చూస్తున్నావు. వాళ్ళకు సేవలు చేస్తున్నావు. కానీ, అయ్యో! ఈ శరీరం ఎక్కడ జన్మించింది. ఇందులో కదా జన్మించింది. మరి ఇది గెంటేస్తున్నాను కదా ! తరువాత. ఇది  పనికి రాకుండా పోతోంది కదా! అంటే పనికి రాని దాంట్లో పుడుతున్నది కదా ఇది. మరి దీనికి ఏ లక్షణం వుంటుంది? ఆ లక్షణమే కదా వుండేది దీనికి? మరి నేను దీనిని ఆశ్రయించానేమిటి? ఏమి అవివేకమిది? ఏమి అజ్ఞానమిది? ఈ శరీరమే నేను అనుకుంటున్నానేమిటి? కనపడుతున్న ఆ శరీరమే నా మనుమరాలు అనుకుంటున్నానేమిటి? వుందా? లేదు కదా! అర్థమైందా? కాబట్టి మీరు ఇలా విచారణ చేయాలి. అప్పుడేమైపోయారు? మనవరాలు లేదు. అమ్మమ్మ లేదు. ఎవరు? ఇద్దరు ఇద్దరు జీవులవి. వారి వారి జీవ ప్రయాణం కోసం, పరిణామ పాఠం కోసం, ఆ శరీరాన్ని తీసుకున్నారు. ఆ పరిణామ పాఠం ప్రకారమే అక్కడ జరిగిపోతుంటుంది అక్కడ అన్నీ. నీ ప్రభావం దాని మీద, దాని ప్రభావం నీ మీద. అంతా కూడా గుణ ప్రభావమే. తాత్కాలికం. నీ రజోగుణం, నీ తమోగుణం, నీ సత్వగుణం. ఆ జీవిలో వున్న రజోగుణం, తమోగుణం, సత్వగుణం. అందులో వున్న ప్రాణ మనో బుద్ధులు, ఇందులో వున్న ప్రాణ మనో బుద్ధులు. అందులో వున్న సూక్ష్మం, ఇందులో వున్న సూక్ష్మం. ఆ స్థూలాన్ని వుపయోగిస్తున్నాయి, పరిణామపాఠం అందులో స్థిరపడుతోంది. అంతకు మించి వేరే ఏముంది? జీవితం అంతా ఒకే ఒక వాక్యం వున్నది. ఏమిటయ్యా? ఆ ప్రాణ మనో బుద్ధులు అనే జీవుడు, గుణాలని ఆశ్రయించి, ఈ శరీరాన్ని పనిముట్టుగా వుపయోగించి, పరిణామపాఠం నేర్చుకున్నాడు. అంతే! మొత్తం జీవితమంతా, వేరే ఇంకా ఏం లేదు నాయనా!
            మరి మిగిలినవన్నీ, అవన్నీ మాయతనువై, మాయతానై మాయపనులను జేయుచును మరి మాయతన మర్మంబు గననే ఇలా తెలుసుకోవయ్యా దాని మర్మం. తెలుసుకున్నావు. మాయమై పోవున్‌ - ఎక్కడుందో చూపెట్టు ఇప్పుడిక. మాయ ఎప్పుడైతే అంతరించిపోయిందో, అప్పుడు పరమాత్మ ఎదురుగుండా కనపడుతాడు. ఈ మాయను ఆశ్రయించినంతవరకూ పరమాత్మ కనబడడు. అర్థమైందా అండీ! కాబట్టి, ఈ మాయ యొక్క మర్మం విప్పి చెప్పేస్తున్నాడు, ఇలా తెలుసుకో దీనిని. ఈ రెండూ పోగొట్టుకున్నావా? ఆ మాయ అంతరించిపోతుంది. అంతరించి పోతే, పరమాత్మ సాక్షాత్కారం కళ్ళ ఎదురుగుండానే వుంటుంది. ఎక్కడో వెతుక్కోనక్కరలేదయ్యా నువ్వు. అర్థమైందా అండీ! నీవు మాయను ఆశ్రయించావు. ఎవరు ఆశ్రయించమన్నారు? లేని దానిని ఎవరు ఆశ్రయించమన్నారు? ఉన్న పరమాత్మను వదిలేసి, లేని మాయను ఎవరు ఆశ్రయించమన్నారు? అర్థమైందా? (మాయ అంటే లేనిది) అది. అంతేకదా! మాయ అంటే అర్థం లేనిది.
            ‘ద్వాదశీ షోడశులనే జలధార కర్ణములందు సోకిన బాధలన్నియు తొలగి నీవిక భ్రాంతి వదలెదవూ జీవా మేలుకొనవే’ - ‘ఈ ఉత్తబట్టబయలు ఏమీ లేదుఅనేది ద్వాదశి. ఈ ఉత్త బట్టబయలు ఏమీ లేదు. ఇందాక ఏం చెప్పుకున్నాము? బట్టబయలు అంటే పరమాత్మయే కదా ! ఈ ఉత్త బట్టబయలు ఏమీ లేదు. పైన ఏమి చెప్పాడు? మాయ విడువ మన్నాడు. విడిస్తే ఏం మిగిలింది? పరమాత్మే వున్నది. అంతేకదా! అదేమిటి? బట్టబయలు వలే వున్నది. ఈ ఉత్తబట్టబయలు ఏమీ లేదు. ఎప్పుడూ గుర్తుపెట్టుకో ఇదే వాక్యం. అక్కడ ఏమైనా వున్నట్టు తోచిందా వెంటనే నీకీ వాక్యం గుర్తుకురావాలి. ఈ ఉత్తబట్టబయలు ఏమీ లేదు, అది తోస్తోందయ్యా, ఇదిగో ఇక్కడ ఈ తులసి చెట్టుంది, తులసి చెట్టుకు రోజూ నీళ్ళు పోస్తే నాకు మోక్షం వస్తుంది. ఏమైంది? సాధ్యమేనా? ఎలా సాధ్యం? తులసి చెట్టు మోక్షాన్ని ఇచ్చేట్టయితే, ఆ మల్లె చెట్టు ఎందుకు ఇవ్వదు? అనే విచారణ రావాలి. ప్రశ్న రావాలన్నమాట. ఈ తులసి చెట్టు మోక్షాన్ని ఇచ్చేట్టయితే, ఆ మల్లెచెట్టు ఎందుకివ్వదు? (దీనికేదో ప్రత్యేకత) ఆఁ... నీకు వున్న అహమే దీనికీ తగిలించావు. (అంతేనా). ఈ తులసి చెట్టు విష్ణుస్వరూపం అండీ! మల్లె చెట్టుకాదా? సర్వ స్థితి కారకుడు విష్ణువు అయినప్పుడు, (అందులో వున్నది ఆ చెతన్యమే) ఇందులో వున్నదీ ఆ చైతన్యమే కదా! అందులో వున్న దైవం ఇందులో లేడా? (దాన్ని ఎండబెట్టి, దీనికి నీళ్ళు పోసి) ఏమైంది? అయ్యయ్యో! చూడండి ఒక్కసారి. ఎంతటి అజ్ఞానమో! ఇంతటి అజ్ఞానంలో కూరుకుపోయి, నేను పరమాత్మను వెతుకుతున్నానండీ! అంటే, అర్థముందా ఏమైనా? ఒక్కసారి మన ఆచరణ ఎక్కడున్నది? లక్ష్యం ఎక్కడున్నది? నేను రోజూ చూస్తావుంటా అందరినీ, ఈ పనిచేసేవాళ్ళను అందరినీ, అయ్యో! ఎంతటి అజ్ఞానంలో పడిపోతున్నాడు? తులసి చెట్టు దగ్గరకు వచ్చి దీపం పెడుతాడు. ఆ దీపం పెట్టేస్తే, పుణ్యం వచ్చేసినట్టే, మోక్షం వచ్చేసినట్టే. ఎందుకు పెడుతున్నావయ్యా దీపం? (భగవంతుడు) అయ్యో! అదేమరి చెప్పేది, ఎప్పుడు పెట్టాలట అదికూడా? సూర్యోదయం కాకముందు పెట్టాలట. అంతే కదండీ! ఎందుకు పెట్టాలండీ? సంధ్యాసమయం. కరెక్టుగా ఉదయ సంధ్య అన్నమాట. ఉదయ సంధ్యాకాలంలో, ఆ సూర్యోదయ కాలంలో అటు చంద్రుడు, ఇటు సూర్యుడు ఏక కాలంలో వున్నప్పుడు, ఆ దీపం వెలిగించావు. ఏం తెలిసిందట ఇప్పుడు? ఆ సూర్య చంద్రుల సాక్షిగా నాలో ఆత్మజ్ఞానం వున్నది, ఆ ఆత్మజ్ఞాన జ్యోతి అలా ప్రకాశిస్తూ వున్నది అని తెలియడం కోసం. అది సంధ్యాసమయంలో నీకు సుషుమ్నానాడిలో ఒక క్షణం పాటు కొట్టుకుంటుంది. హంస. నీకు తెలియకపోవచ్చు. ప్రతిజీవికి కొట్టుకుంటుంది. అందుకని నాయనా! సంధ్యాసమయంలో నిద్రపోమాకండి. మేలుకొని వుండండి నాయనా! సహజంగానే పరమాత్మ నీకొక వరం ఇచ్చాడు. ఏమిటయ్యా అంటే, ఆ సంధ్యాకాలంలో నీవు కనుక మేలుకొని నీ హంసను గమనిస్తూ వుంటే, నీ ప్రాణాన్ని గమనిస్తూ వుంటే, ఇందులో ఇడా పింగళ, మధ్యలో సుషుమ్న నాడి వుంటుందన్నమాట. ఆ సుషమ్నా నాడిలో ఒక్క క్షణం పాటు హంస కొట్టుకుంటుంది. ఎప్పుడూ అందులో కొట్టుకోదు. ఇడాపింగళలో కొట్టుకుంటుందన్నమాట. ఈ సుషుమ్నానాడిలో ఆ క్షణం పాటు ఎప్పుడైతే కొట్టుకుంటుందో, ఆ కొట్టుకునే క్షణంలోనే నువ్వు తెలుసుకోగలుగుతావట. ఆత్మజ్ఞానాన్ని. ఆత్మసాక్షాత్కారం అప్పుడు జరుగుతుంది. ఒక్క క్షణంలో, ఒక్క రెప్పపాటులో జరిగిపోతుంది అది. అది ప్రతిరోజూ వుంది నీకు ఆ అవకాశం. ఆఁ.. అదండీ! సంగతి. ఎవరు చెప్పినా అదే. 6 గంటలకు చేయండి, 5.30కు చేయండి. బ్రహ్మముహూర్తంలో లేవండి, ఏమిటి? లేచి ఏం చేయాలి? ఇందాక పొద్దున రాగానే చెబుతోంది అదే. లేవగానే ఏం చేయాలి? ఇది చేయాల్సిన పని. ఐదు గంటలకు లేచి ఏంచేయాలి? లేచానండి, మళ్ళా అటూ ఇటూ దొర్లానండి. అది కాదండీ అక్కడ విషయం. లేచిన తరువాత ఏం చెయ్యాలయ్యా? నీ ప్రాణాన్ని గమనించవయ్యా! ఇడ, పింగళ, సుషుమ్న. పైకి క్రిందకి ఎలా కొట్టుకొంటోంది? కుడిలోంచి వెళ్ళింది. ఎడమకు తిరిగి వచ్చింది. మళ్ళా ఎడమలోంచి వెళ్ళింది, కుడికి తిరిగి రావాలి. కానీ అలా రావడం లేదు. ప్రయత్నం చేసి త్రిప్పుకో. తిప్పుకుంటే మధ్యలో సుషుమ్నా నాడి అలా తగుల్తుందన్నమాట. తగిలినప్పుడు నీకు ఆ స్పర్శయొక్క భేదం తెలుస్తుంది. ఇడా పింగళలో హంస పనిచేస్తే ఎలా వుంది? సుషుమ్నలో వుంటే ఎలా పని చేయాలి? (నాకు ఎందుకు ఉదయం కూర్చొంటే అస్సలు ధ్యానం కుదరదూ?) అదే చెబుతా వినండి. ఇవన్నీ అసలు ధ్యానం వగైరాల జోలికి వెళ్ళొద్దు. ఇక్కడి వరకే. ముందు ప్రాథమిక ప్రయత్నం. మీ అందరికీ ఏమిటంటే, అక్షరాభ్యాసం లేదు. పై క్లాసువుంది. ఈ అక్షరాభ్యాసం లేకుండా ఆ పై క్లాసు రాదు. ముందు ఇవన్నీ set right అవ్వాలి. నీ నిజజీవితంలో వున్న సమస్యలు అన్నీ పరిష్కరించ బడితే ధ్యానం కుదురుతుంది కానీ, ధ్యానం కుదిరితే ఇవన్నీ పరిష్కరించబడుతాయంటే ఎప్పటికీ పరిష్కరించబడవు అన్నమాట. నువ్వు ఆత్మ విచారణ తోటి జీవిస్తే, ఉన్నత తరగతి. తరగతులు మారుతూ పాఠం మారే కొద్దీ, ఉన్నతమైన జీవనం వచ్చే కొద్దీ, ధ్యానం వుపయోగపడుతుంది. అంతేగాని, ఆ ధ్యాన అభ్యాసం ఎప్పటికో అప్పటికి ఉపయోగపడుతుంది. ఇప్పుడది ఉపయోగపడకపోవచ్చు.
            షోడశి అంటే అర్థం ఏమిటంటే, ‘మూలాన్ని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు’. అక్కడ రెండు చెబుతున్నాడు కదండీ! ద్వాదశీ, షోడశీ అనే జలధార కర్ణములందు శోకిన భ్రాంతి వదలెదవు. బాధలన్నీ తొలగిపోయినాయి. ఎందుకు భ్రాంతి వదిలిందట? బాధలన్నీ తొలిగిపోయినాయి కాబట్టి. ఎందుకనయ్యా? అంటే, ఈ రెండూ గుర్తుపెట్టుకోవాలి. ఏమిటి? ‘ఈ ఉత్తబట్టబయలు ఏమీ లేదు’, ‘మూలము లేని యీ గుర్తెరిగే శరీరం ఏమీలేదు’. అది 16 అక్షరాలు, ఇది 12 అక్షరాలు. వీటి యొక్క వివరం చాలా దూరం వుంటుంది. తరువాత నిదానంగా తెలుసుకోవచ్చు.
            ‘భాగవత శ్రీ కృష్ణదేశిక ప్రభువరుండిటు, రానె వచ్చెను, వేగగని తనుమన ధనంబులు వీడి శరణనవే జీవా మేలుకొనవే’ - ఏమి విడిచిపెట్టాలటండీ? మన దగ్గర ఏమున్నాయి? (తనుమన ధనంబులు). అది. నువ్వు ఏం విడిచిపెడితే గురువును గుర్తించగలుగుతావు? ‘నేను తనువుని, నేను మనసుని, నాకున్న ధనము’ - ఈ మూడు నీలో పనిచేస్తూ వుంటాయట. ఏమిటి నీ ధనం? ప్రాణమే నీ ధనం. గుర్తు పెట్టుకోండి. ఇల్లు వాకిళ్ళు చూసి గురువు రాడు. నీకున్న ఏడంతస్తుల మేడ చూసి అస్సలు రాడు. నీకు ఏడుకోట్లు వున్నా, డెబ్భై కోట్లు వున్నా, గురువుకి ఏమీ అవసరం లేదు. నీ తనువుతో అసలు అంతకంటే పనిలేదు. ఆయన తనువే అవసరం లేదని విసిరేసినటువంటి వాడు. నీ మనసుతోటి అసలు అంతకంటే పనిలేదు. ఎందుకని? మనసే జడమైనటువంటింది. మనసు అసలు జడ స్వరూపం. ఇది ఎట్లా అయితే స్వయంగా కదలలేదో, ఆ తనువు, మనస్సు, ధనము. ఈ ధనము అంటే ఏమిటి? ప్రాణము. తనుధనమనంబులు అంటే అవి. ఆ మూడు నువ్వు అనుకుంటున్నావు. నువ్వు అది కాదనే, నిర్ణయంతోటి రా. గురువు దగ్గరకి. అవి శరణాగతి అంటే. నువ్వు, గురువు నీకు ఎప్పుడు ఉపయోగపడుతాడయ్యా అంటే, ఆ తను మన ధనములు విడిచి వస్తే, అప్పుడు ఏ స్థితిలో వస్తావు? ఆత్మ స్వరూపుడు అనే స్థితిలో వస్తావు. నువ్వు ఆత్మస్వరూపుడు అనే లక్ష్యంలో నువ్వు వస్తే, అప్పుడు గురువు ఉపయోగపడుతాడేకానీ, తను మన ధనములు అనే లక్ష్యంతో వస్తావా? ఏమీ ఉపయోగపడడు నాయనా! చిల్లికాసుకి ఉపయోగపడడు నాయనా! గురువుని ఆశ్రయించాలి అంటే, అవన్నీ విడిచి రావాలి.
            ‘పీలుఖాన శంకరుండని పిలిచి ప్రభువరుండేలినారట మూలమూ లేనట్టి యెఱుకను ముంచి వేసిరటా జీవా మేలుకొనవే !’ - అప్పుడు ఏం చేశాడట గురువు? శిష్యుడిని పిలిచాడట. ఆయన పేరు ఫీల్‌ఖాన్‌. ఆయన్ను ఏమని పిలిచాడట? శంకరా ఇలా రావయ్యా అన్నాడట. ఇప్పుడు ఏ భావంలో వచ్చాడు ఆయన? ఆయన తనువు పేరు కదా! ఫీలుఖాన్‌ వదిలేశాడు అది. తనుభావన వదిలేశాడు కదా! ఆత్మభావనలో వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమని పిలిచాడు. శంకరా అని పిలిచాడు. ఆయన పేరు అప్పటినుంచి శంకర్‌. ఫీలుఖానా శంకరుండని పిలచి ప్రభువరుండు ఏలినాడట - ఇప్పుడు శంకరుడు ఎక్కడున్నాడు? వేరే ఎవరు లేరు నాయనా! నువ్వే శంకరుడవు. నువ్వే దైవం. గురు శిష్య సాంప్రదాయంలో ఉపదేశం పొందగానే, నీకు తెలియవలసినటువంటి మొట్టమొదటి స్థితి ఇదే. నేనే పరమాత్మను. నేనే భగవంతుడను. నాకూ దైవానికి ఏ భేదం లేదు. అని ఎప్పుడైతే తెలుసుకుంటావో, అప్పుడు ఏమైందట? మూలము లేనట్టి ఎఱుక లేకుండా పోయింది. ఎఱుకకు మూలం లేదు. ఆ ఎఱుకతోనే కదా వీటన్నింటినీ గుర్తిస్తున్నావు! నేను శరీరాన్ని, నేను అమ్మను, నేను తల్లిని, నేను అమ్మమ్మని, నువ్వు ఎన్ని గుర్తులు పెడితే, ఆ గుర్తులు అన్నీ ఎందులోవి? ఎఱుకలోవయ్యా బాబు. ఆ ఎఱుకకు మూలం లేదయ్యా బాబు. ఆ ఎఱుకయే మాయ. ఆ ఎఱుకకు మూలం లేదు. ముంచి వేసిరటా - అది ఎప్పటికైనా మునిగిపోక తప్పదు. దానిని ఆశ్రయించావు కాబట్టి నువ్వు కూడా ఎప్పటికైనా మునిగిపోతున్నావు. దానిని ఆశ్రయించమాకు. దానిని ఆశ్రయించకుండా వుంటే, నువ్వు మునిగిపోయే పరిస్థితి రాదు.
            ‘శ్రీ మద్రాజాధిరాజ మహరాజా యోగీంద్ర చంద్ర భాగవత కృష్ణ దేశిక ప్రభు మహరాజుకీ  జై జై జై’ -  (స ఏక ఏవ కల్పతే ముక్తైః అటు వంటి ముక్తి వస్తుందట.  అట్టి వానికి మాత్రమే ముక్తికి అర్హత కలదు.) ఎట్టి వాడు? అని పైన చెప్పాడు అదంతా. ఆ సూత్రమంతా, దానికి ఆధారమైనదంతా పైన చెప్పాడు. ఎట్లా వుంటే ముక్తి లభిస్తుందో, అది చివరి వాక్యం. స ఏవ కల్పతే పైన చెప్పినది అంతా కనుక నువ్వు వుంటే, ముక్తి లభిస్తుంది. (అంతేనా) అది. (ఏదైనా ప్రత్యేకత ఏమో) అది చివరి వాక్యం. పైన చెప్పినదానికి చివరి వాక్యం ముక్తాయింపుగా చివరికి చెప్తున్నాడు. పైనంతా చెప్పినట్టుగా నువ్వు వున్నట్లయితే, నీకు ముక్తి లభిస్తుంది. అది సంస్కృత భాషలో అలాగ ఆ మాట అంటున్నాడు. (నిన్న చదివాను, పంచప్రాణాలు, పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, స్థూల శరీరం అదే నిన్న చెప్పినదంతా దాని గురించే, స్థూల శరీరం గురించి) ఈ వివరణ బాగా తెలుస్తుందండి వివేకచూడామణి బాగా చదివితే మీకు. (ఒకటికి నాలుగు సార్లు చదివితే) స్థిరపడిపోవాలండి. వివేక చూడామణి సహజమైపోవాలి. అర్థమైందా అండి? భగవద్గీత కంటే కూడా వివేక చూడామణి బాగా పనిచేస్తుంది. ఎందుకంటే భగవద్గీత అంతా కూడా telephone directory లాంటిది అది. అన్నీ వుంటాయి అందులో. ఒకటి వుంది, ఒకటి లేదు అని చెప్పడానికి వీలుకాదు. భగవద్గీతలో అన్నీ వుంటాయి. కానీ అన్నీ సూచన ప్రాయంగా వుంటాయన్నమాట. వివరణ వుండదు పూర్తిగా. (దీంట్లో వివరణ వుంది). ఆఁ... నువ్వు ఒక ప్రశ్న వేశావనుకో, ఆ ప్రశ్నకి ఒక ప్రశ్న ఒక సమాధానమే వుంటుంది అంతే. మళ్ళా ప్రశ్న మీద ప్రశ్న వేస్తే అక్కడ సమాధానం వుండదు. అది ఎవరన్నా వివరించి చెప్పాల్సిందే. భగవద్గీత గ్రంథాన్ని వివరించి చెప్తే కానీ వీలుకాదు. అదే ఇప్పుడు మీరు చిన్మయా మిషన్‌ వాళ్ళ వివేకచూడామణి చదివారనుకోండి, ఎవ్వరూ అవసరం లేదు. (ప్రశ్న సమాధానం కూడా వుంది అందులో) ఇది మామూలుగా చదువకున్నా అర్థమయ్యేట్లు సామాన్యమైన భాషలో వ్రాసింది ఆవెడ. మహానుభావురాలు ఆవెడ అన్నపూర్ణగారు. ఆవెడకి ఆత్మానుభవంతోటి స్పష్టంగా రాసేసిందన్నమాట. ఆ చిన్మయానందుల యొక్క ప్రభావం అంతా ఆవెడలో వుందన్నమాట. అన్నపూర్ణగారు చేసినటువంటి సేవ అంతా ఇంతా కాదు. ఎందుకంటే ఆయన ఇంగ్లీషులో వ్రాశారు. (చిన్మయానందులు). మహానుభావులందరూ సంస్కృతంలో వ్రాస్తే, చిన్మయానందులు విదేశీయుల కోసమని, సంస్కృతాన్ని ఇంగ్లీషులో వ్రాశారు ఆయన. ఆ ఇంగ్లీషులో వ్రాశిన దానిని ఆవెడ తెలుగుసేత చేసింది. ఆవెడకు రెండు భాషలు వచ్చు. సంస్కృతము వచ్చు, ఇంగ్లీషుకూడా వచ్చు. తెలుగు. అందుకని ఆ రెండింటినీ దృష్టిలో పెట్టుకుని తెలుగు సేత చేసిందండి. ఆదిశంకరులేమో సంస్కృతంలో రచించారు. అది ఈయన ఇంగ్లీషులో రచించారు. కాబట్టి ఎంతో మహత్‌ గ్రంథం అన్నమాట వివేక చూడామణి. దాని పేరులోనే వుంది చూడండి. వివేక చూడామణి. అది. (వివేకం) ఆఁ.. అద్భుతమైనటువంటి వివేకం కలుగుతుందండి. ఎటువంటి వివేకం అంటే నేను తనువు కాదని స్పష్టంగా తేలిపోతుంది. అది పూర్తయ్యేటప్పటికి నేను శరీరం కాదని స్పష్టంగా తేలిపోతుందన్నమాట. ఎట్లా కాదో నిరూపిస్తుంది అది. నీవేమిటో, నీ గురించి ఏమిటో స్పష్టంగా చెప్పేస్తుంది. అది అనంత మానవకోట్లకి అది సమానమే. అర్థమైందా అండీ! కాబట్టి నిత్యోపాసన అంటే, రోజూ చేసేది అని అర్థం. నిత్యము అంటే ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి. 24గంటలు. ఏ పనినైనా నువ్వు 24 గంటలు చేస్తే అది నిత్యం అవుతుంది. (అంతేగానీ రోజూ చేసేదికాదు) రోజూ అంటే ఉదయం ఆరు గంటలకు లేచి ఆరు గంటలనుంచి  ఆరున్నర గంటల దాకా చేస్తే అది నిత్యోపాసన అవ్వదు, నీత్య పూజ అవ్వదు అది. నిత్యము అంటే అర్థం ఏమిటంటే, ఏ పనినైతే నీవు, అన్ని నియమాలని, అన్ని ధర్మాలని, అతిక్రమించి, 24 గంటలు, ప్రాణంతో సమానంగా చేయగలుగతావో, 24 గంటలు నీలో జరిగేది ఏమిటి? ప్రాణం ఒక్కటే. మిగిలినది ఏదీ జరుగదు. మనసుకూడా కాసేపు పడుకుంటుంది. బుద్ధిగా కాసేపు పడుకుంటుంది. మిగిలినవన్నీ పడుకుంటాయి. ఒక్క ప్రాణం మాత్రమే మేల్కొని వుంటుంది. అర్థమైందా అండీ ! ఆ ప్రాణంతో సమానమైనంగా నువ్వు ఏదైతే చేయగలుగుతావో, అది నిత్యోపాసన అవుతుంది. ఇంకా... ఊర్థ్వరేతస్కుడు అంటే అది? అప్పుడే కాదు అది. (దానికి ఇంకా టైం వుందా?) దానికి ఇంకా టైంవుంది. (అర్థం కాలేదు మొన్న ఎక్కడో వచ్చింది). అప్పుడే ఎలాగ? (సరే!)

ఓం పూర్ణ మదః పూర్ణ మిదం పూర్ణాత్‌ పూర్ణ ముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే
ఓం పూర్ణ మదః పూర్ణ మిదం పూర్ణాత్‌ పూర్ణ ముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే
ఓం పూర్ణ మదః పూర్ణ మిదం పూర్ణాత్‌ పూర్ణ ముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే

ఓం తత్‌ సత్‌

ఓం సహనాభవవతు సహనౌభునక్తు సహవీర్యం కరవావహై  తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై

ఓం శాంతిఃశాంతిఃశాంతిః