File No.16




ఓం ఓం ఓం

ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్‌ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే
ఓం తత్‌ సత్‌

ఓం సహనావవతు సహనౌభునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మావిద్విషావహై
ఓం శాంతిఃశాంతిఃశాంతిః

బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం
ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం
ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం
భావాతీతం త్రిగుణ రహితం సద్గురుం తం నమామి.

ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సాంప్రదాయ కర్తృభ్యో
వంశ ఋషిభ్యో మహద్భ్యో నమోగురుభ్యః

సర్వోపప్లవ రహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్థో
బ్రహ్మైవాహమస్మి అహం పదార్థ రహితః

అస్మాద్గురు సమారంభాం కృష్ణసాందీప మధ్యమాం
ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరాం.

సాయిరాం.

(అహంకారరూప మూలమును విచారించక ...)
అంతకుముందు ప్రశ్నలో ఏమన్నాడు? అంతకుముందు ప్రశ్నచదవండి. (నేను అనే విచారించుట ఎట్లా?) ఎట్లా?
            ఇప్పుడు ఒక్కొక్క ప్రశ్నకి, ఒక్కొక్క ప్రశ్నకి అక్కడ వరుస వున్నదన్నమాట. క్రమం వున్నది. మొదట ఏం చెప్పాడు? ముక్తి ఎట్లాగ? అని అడిగాడు. దాని విషయం చెప్పాడు. తరువాత ఏం చేశారు? యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవడం ఎట్లా ? అన్నారు. నాయనా! నువ్వు యథార్థ స్వరూపం తెలుసుకుంటే ముక్తి వస్తుంది. యథార్థస్వరూపం తెలుసుకోవడం ఎట్లా? సరే బాబూ! నువ్వు అన్ని పనులు చేస్తుంటావు కదా! ఆ చేసేటప్పుడు వచ్చేటప్పుడు పోయేటప్పుడు తిన్నాను, చేశాను అంటున్నావు కదా! దాని వెనుక నేనుఅని వుంటుంది. ఆ నేనుని పట్టుకో! ఆ నేనుని పట్టుకుంటే, నీకు తెలుస్తుంది. ఆ నేనుని పట్టుకోవడం ఎట్లా? అన్నారు. మూడవ ప్రశ్న ఏమిటి? ‘నేను ఎవడనుఅని ఎట్లా విచారించాలి? నాకు తెలియడం లేదు కదా! వచ్చితిని, పోతిని, తింటిని, చేసితిని అని తెలుస్తుంది కాని, నేను ఎవడనో తెలియడం లేదు కదా! ఎందుకు తెలియడం లేదు నాయనా! నీకు అంటే, నువ్వు పనిలో మునిగిపోతున్నావు. ఆలోచనలో... ఆలోచనకూడా పనే. అవి వచ్చినప్పుడు అందులో, వాటిల్లో మునిగిపోతున్నావు. మూడవదాంట్లో ఏం చెబుతున్నాడు అంటే, నాయనా! నీవు ఎంతో కాలంగా, దేహాభిమానంతో జీవించడం అలవాటు చేసుకున్నావు. ఈ శరీరంలోకి వచ్చావు. శరీరంలోకి ఎట్లా వచ్చావు? వస్త్రాన్ని ఎట్లా ధరించావో, అట్లా ఈ శరీరాన్ని ధరించావు. కానీ, లోకవాసన చేత, శాస్త్రవాసన చేత, దేహ వాసన చేత, మూడు గుణాల చేత, నీవు కప్పబడి, ఆ పంచకోశాల చేత కప్పబడి, నీవు దేహాభిమానాన్ని పొందావు. నీ దేహం ఎట్లా తయారైంది? వీటి ద్వారా తయారైంది. కాబట్టి వాటితో జీవించేటప్పుడు, అది నీ చేతిలో పనిముట్టు అనే జ్ఞానాన్ని మరచిపోయావు. ప్రతి ఆలోచన వెనుకాకూడా నేను అనే స్ఫురణ వుంటేనే, నేను అనే ఉనికి వుంటేనే, నీకు ఆలోచన వస్తోంది. లేకపోతే ఆలోచన వస్తుందా? శవానికి ఆలోచన వుందా? లేదు కదా! శరీరం జడపదార్థం కదా! దానికి ఆలోచన వుందా? లేదు కదా! మరి అట్టి జడపదార్థం వెనుక వున్న చైతన్యం నువ్వు కదా! ఆ నేను ఎవరు? చైతన్యస్ఫురణ. అదే అహం యొక్క స్ఫురణ. అయితే ఏమైంది? ఈ అహానికి ఆకార భ్రాంతి వచ్చిచేరింది. చేరడం వల్ల ఏమయ్యావు? ఆ నేను అనే స్ఫురణని మరచిపోయావు. మరిచిపోయి, అహంకారం పద్ధతిలో కలుగుతున్నటువంటి, ఏ ఆలోచనలు వున్నాయో, ఏ పనులు వున్నాయో, అవి నువ్వు అనుకోవడం మొదలు పెట్టావు. అసలు నేను పోయి, మిథ్యానేను వచ్చేసింది అన్నమాట. అంటే లేని నేను వచ్చేసింది. ఎట్లాగ? నేను స్త్రీని, నేను ఫలానా వారి భార్యను, నేను ఫలానా వారికి అమ్మను, నేను ఫలానా వారికి అమ్మమ్మను... ఇవన్నీ ఏమిటి? మిథ్యా నేనులు. నీ మీద కల్పించబడ్డాయి. నీ మీద కల్పించబడ్డాయి. ఆయా సంఘటనల ఆధారంగా, ఆయా పరిస్థితుల ఆధారంగా, శరీర భావంతో కల్పించబడినటువంటివే కానీ, నీవు యథార్థంగా వున్నదానికి కల్పించడబడ్డాయా? యథార్థంగా వున్నదానికి కల్పించడానికి వీలుకాదు కదా!
            ఎలాగంటే, ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఈ భూమండలం మీదు వున్నటువంటి అనేక మంది, ఆ సూర్యుడిని ఉపయోగించుకుని, అనేక పనులు చేస్తున్నారు. ఏదైనా సూర్యుడికి చెందినాయా? చెందలేదు కదా! మరి సాక్షి స్వరూపము కదా! అట్లాగే, నీలో వున్న నేనుకూడా స్వరూప స్థితిలో, స్వప్రకాశ స్థితిలో, జ్ఞాన స్థితిలో సాక్షిగా వున్నది. కానీ, ఆ సాక్షి మరుపుకు వచ్చేసింది. ఎంతగా మరుపుకు వచ్చేసింది అంటే, ఇక అది తిరిగి గుర్తుకు రానంతగా మరుపుకు వచ్చేసింది. కారణం ఏమిటి? నీవు రోజువారీ అభ్యాసం చేసేటప్పుడు, ఏముండాలి నీకు? విచారణ వుండాలి, సాధనా వుండాలి. అంటే ఏమిటి? దానిని (సాక్షిని) గుర్తు తెచ్చుకునే సాధన వుండాలి. దానిని గుర్తు చేసే విచారణ కూడా వుండాలి. కానీ ఈ రెండూ వున్నాయా? మన దగ్గర ఇప్పుడు? రెండూ లేవు. రెండూ లేకపోవడం వల్ల ఏమైంది? శరీరమే వుంది. శరీర భావంతో జీవించడమే సత్యమైంది. కాబట్టి ఏం చేయాలట? ముందు సాక్షికి సంబంధించిన విచారణను అభ్యాసము చేయి. తరువాత ఏం చేయాలి? దానికి తగ్గ సాధన చేయి. అయితే విచారణ, సాధన ఏం చేయాలండీ? ఏం  చేస్తే ఇది సాధ్యం అవుతుంది? అంటే, బాబూ! నువ్వు మొట్టమొదట ఏం చేయ్యాలి? అన్నీ వచ్చిపోతున్నాయి కదా! నీవు రోడ్డుమీద బాటసారులు అందరూ వచ్చిపోతున్నారు కదా! వాళ్ళ వివరము, వాళ్ళు ఎవరని ఎప్పుడైనా కనుక్కున్నావా? కనుక్కోలేదు కదా! మరి నీ మనస్సులో తొంగిచూసిన ప్రతి ఆలోచనని ఎందుకు పట్టించుకుంటున్నావు? నువ్వు అది ఏం చేస్తున్నావు? ఆలోచన రాగానే దాని వెంబడే పోతుంటువి. నీవు ఏం చేయాలట ఇప్పుడు? ఓహో! బాటసారిగారు వచ్చారు. ఆలోచన కలగగానే నువ్వు ఏం చేయాలి? దానిని ఎట్లా చూడాలట? ఓహో! రోడ్డు మీద బాటసారిగారు వచ్చారండీ! ఇప్పుడు వీడు ఎవడో నాకు ఎందుకు? నేను ఎవరిని? సాక్షిని, నేను ఎవరిని? ఆత్మస్వరూపాన్ని. నీ ఆలోచనకంటే ముందున్న వాడను. ఆలోచన తరువాత వున్నవాడను కాదు నేను. నేను ఆలోచన కంటే ముందు వున్న వాడను. ఇప్పుడు ఈ ఆలోచనని గమనిస్తున్నాను. ఎవరు వచ్చారు ఇప్పుడు ఆలోచన గారు? ఓహో! బాటసారి గారు వచ్చారు. పోనీ. ఎంత సేపు వుంటారు? ఆలోచనలో బలం ఎంత సేపు వుంటుంది? నిన్ను అడుగుతుంది అది. అట్లా చూచినప్పుడు ఏమౌతుంది? నిన్ను అనుమతించమని అడుగుతుందండి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నన్ను ఏం చేయమంటావు? అంటూ వుంటుందది. ఏమిటి నువ్వు చేసేది? ఊరుకో కాసేపు అట్లాగు. ఏం చేయమన్నాడట దానికి? దానికి ఉపమానం చెప్పాడు. చిత్రముల వలె చూడు. ఇవన్నీ చిత్రాలు కదా! ఆ చిత్రములని ఎట్లా చూస్తున్నావో, దానిని కూడా అట్లా చూడు. ఊరక వుండు. ఇది చేయలట. ఆ సాక్షి తెలియాలి, నేను తెలియాలి అని అంటే, నువ్వు.. నేను ఏంచెయ్యాలయ్యా? చిత్రాన్ని ఎట్లా చూస్తున్నావో, గోడమీద చిత్రాన్ని ఎట్లా చూస్తున్నావో, దృశ్యాన్ని ఎట్లా చూస్తున్నావో, ఆ దృశ్యంలోకి చేరమాకు. ఊరక వుండు. స్పందించమాకు. ఊరక వుండు. గమనిస్తూ వుండు. గమనిస్తూ వుండు. ఊరక వుండు. అవన్నీ ఎవరి లక్షణాలు? నీ హృదయంలో వున్న పరమాత్మ లక్షణాలు. ఆ లక్షణాలతోటి జీవించడం మొదలుపెట్టు. ఇప్పటి వరకూ శరీరంతో కూడిన లక్షణాలతోనే జీవిస్తున్నావు. ఇప్పుడు పరమాత్మ లక్షణాలనే నిత్యం స్మరిస్తూ, పరమాత్మ లక్షణాలు అంటే విష్ణుసహస్రనామం చదవడం కాదు, అర్థమైందీ? నీ హృదయంలో పరమాత్ముడు ఈ లక్షణాలతో వున్నాడు. ఎలా వున్నాడు? ఏం కదలకుండా వున్నాడు. శాశ్వతంగా వున్నాడు. ఎలా? స్పందించకుండా వున్నాడు. గమనిస్తూ వున్నాడు. ఊరక వున్నాడు. ఇవన్నీ పరమాత్మ లక్షణాలు. ఈ పరమాత్మ లక్షణాలు ఎక్కడ వున్నాయి? నీలోనే వున్నాయి. నీ హృదయస్థానంలోనే వున్నాయి. అక్కడ ఎవరున్నారు? నువ్వే వున్నావు. వేరేవాడు ఎవడూ లేడు. ఆ నేను అనే పరమాత్ముడు వున్నాడు. ఆ నేను అనే పరమాత్ముడు ఈ లక్షణాలతో వున్నాడు కాబట్టే, ఈ శరీరం నిలబడి వుంది. ఇది తప్పుకుంటే, ఏదీ నీ శరీరానికి విలువ? అందరూ ఇంత గొప్పగా, నిన్ను రోజువారీ పొద్దున లేచింది మొదలు, నువ్వు ఇంద్రుడివి, నువ్వు చంద్రుడివి, నువ్వు లేకపోతే ఈ కుటుంబము లేదు, నువ్వు లేకపోతే అది లేదు, ఇది లేదు అన్నవాళ్ళు, ఈ నేను తప్పుకోగానే దీనిని ఏం చేశారు? (బయిట పారేశారు) ఎందుకని? దీనికి ఏం విలువ లేదు. దీనికి విలువ లేదు. విలువ ఎట్లా వచ్చింది? ‘నేనువల్ల వచ్చింది. అర్థమైందా అండీ? కాబట్టి దీంట్లో వున్నప్పుడు నేనును పట్టించుకోవయ్యా! అంటే ఏమిటి? సశరీరుడవై అశరీరిగా జీవించు. శరీరంలో వుండగానే, దీంట్లో వున్న అశరీరి ఒకడు వున్నాడు. శరీరంతో సంబంధం లేకుండా ఒకడు వున్నాడు ఇందులో. వాడిని ఆశ్రయించు, వాడిని గుర్తించు, ఆ లక్షణాలతో జీవించు. ఏమౌతావు అప్పుడు? శరీరంలో వుండి ముక్తుడవు అవుతావు. అంటే అర్థం ఏమిటి? జీవన్ముక్తుడవు అవుతావు. బ్రతికి వుండి కూడా, జీవుడు కాని వాడవు అవుతావు. బ్రతికి వుండేది ఏమిటి? శరీరం. నా ఆధారంతో శరీరం వస్తోంది. నా ఆధారంతోనే ఈ శరీరం కూడా పోతోంది. కాబట్టి పుడుతున్నది శరీరమే, పోతున్నది శరీరమే. ఇప్పుడు జాతా శౌచం, మృతా శౌచం శరీరానికా? నాకా? నాకేమి వున్నాయి? నేను ఎల్లప్పుడూ పతిత పావనుడను. ఎటువంటి పాపాత్ములనైనా కూడా పవిత్రీకరింప చేయగలిగే సామర్థ్యము వున్నటువంటి వాడను. నేను సాక్షిని. నాకు అపవిత్రత, పవిత్రత ఎక్కడ వుంటుంది? లేదు కదా! ఏ ద్వంద్వాలు లేవు కదా నాకు. అటువంటి వాడను నేను. కాబట్టి ఆ నేనుఅనేటువంటి, హృదయస్థానంలో వున్నటువంటి పరమాత్మను ఆశ్రయించు. ఏమౌతావు అప్పుడు? నువ్వు ఆ పరమాత్మ లక్షణాలతో జీవిస్తే, పరమాత్మవే అవుతావు. శరీర లక్షణాలతో జీవించావు కాబట్టి ఏమయ్యావు? శరీరం అయ్యావు. కాబట్టి నీలో వున్న పరమాత్మ లక్షణాలను గుర్తించి, అట్టి పరమాత్మ లక్షణాలతో జీవించడం ప్రయత్నం చేయి. అని చెప్పారు. చెబితే ఈయన ఏమంటాడు మళ్ళా? నాల్గవ ప్రశ్నలో?
            (అహంకార రూప ... మూలమును విచారింపగా, అక్కడ ఏవేవో ... జరుగుతున్నది గానీ, ....) నువ్వు ఏం చెబుతున్నావు? నేనుఅనే తలంపును పట్టుకోవయ్యా! అది పట్టుకుంటే, ఆ లక్షణాన్ని పట్టుకుంటే అంతా సమస్య పరిష్కారం అవుతుంది అంటున్నావు. కానీ, నేను లోపలికి తొంగి చూస్తే, బయటికి కాదు, లోపలికి తొంగి చూస్తే, ఏం కనబడుతున్నాయట? ఎంత సేపూ అహంకారానికి సంబంధించినవే కనబడుతున్నాయి కానీ, ఈ నేను అనే తలంపు ఎక్కడా కనబడడం లేదయ్యా బాబు! ఏదో దాని సంగతులే ఇదంతా! చిలవలు, పలువలుగా, కథలు, కథలుగా, ఆ అహంకారానికి సంబంధించిన ఆలోచనలు కనపడుతున్నవే గానీ, నేను అనే తలంపు కనబడడం లేదయ్యా బాబు. (ప్రతీ ఆలోచనా అహంకారమేనా?) ఆఁ.. అందులో, ఆ ఆలోచనలో వున్నటువంటి అహంకారాన్ని గుర్తించాలి నువ్వు ఇప్పుడు. గుర్తిస్తే తప్ప నిరసించలేవు. సమస్య ఏమిటంటే, ఇప్పుడు ఒక ఆలోచన వచ్చిందండి. దాంట్లో అహంకారం ఎట్లా వుందో ముందు గుర్తించాలి. గుర్తించి అహంకారాన్ని నిరసించాలి. నిరసిస్తే కానీ, దాని వెనకున్న నేనుకనపడదు. ఎందుకనిట? ఈ ముందు దట్టమైనటువంటి అడ్డుగోడగా ఇది వుందండి. దీనిని నిరసిస్తే కానీ, దీని వెనుక వున్నది కనపడదు. అర్థమైందా అండీ?
            గర్భగుడి తలుపులు మూసేసి వున్నాయండీ! దైవం ఎట్లా కనపడుతుంది? తలుపులు తెరిస్తే కదా! ఆ మందిరంలో తలుపు, అందుకే, గర్భగుడి ఎందుకు పెట్టారంటే, ఇదే విషయం. ఆ లోపలికి తొంగి చూస్తే, ఏం కనబడుతున్నాయట ఇప్పుడు? అంతా అహంకారానికి సంబంధించినవే కనబడుతున్నాయట. ఎందుకని? అట్లాగే వున్నాయి కాబట్టి అవి. ఇప్పటివరకూ అభ్యాసం ఎలా చేశావు? అలాగే చేశావు. ఆ మనసుని ఏ దారిలో పెట్టావు? అహంకారం అనే దారిలోనే పెట్టావు. బుద్ధిని ఏ దారిలో పెట్టావు? దానిని అహంకారం అనే దారిలోనే పెట్టావు. పెట్టి ప్రాణాన్ని కూడా దేనివైపు ఉపయోగించావు? అటే శరీరం పద్ధతిలోనే ఉపయోగించావు. మరి వచ్చిన పనిముట్లు అన్నింటినీ అహంకార పద్ధతిగా వుపయోగించి, ఇప్పుడు అర్జెంటుగా నేనును చూడాలంటే, అంటే ఏం చెయ్యాలంట? తీసి పారేయడానికి వీలౌతుందా? అట్లా కుదరదు. దానిని ఏం చేయాలట? గమనించు. మొట్టమొదట ఏం గమనించాలట? చెబుతున్నాడు సమాధానం. ఎట్లా దానిని తెలుసుకోవాలి. ఈ అహంకారపు ఆలోచనల వెనుక వున్న నేనును తెలుసుకోవడం ఎట్లా? అదే ప్రశ్న. (అదే తలంపు రావడం లేదే అని.. ) అంటే కనబడడం లేదుగా. నీవు ఎంత లోపలికి తిరిగి చూసినా, నీ అహంకార సదృశమైనటువంటివే వున్నాయి గానీ, ‘నేనుతలంపు అక్కడ కనబడడం లేదు. ఎట్లా చేయాలి మరి? అంటున్నాడు. సమాధానం చూడండి భగవానులు ఏం చెబుతున్నారో.
(కర్త ... పాత్రలన్నియూ ప్రథమావిభక్తిని ఆశ్రయించియే... అన్నియూ దేహరూపమును... బుద్ధి రూప నేను అను మొదటి వృత్తియు అగు, అహంకారమును ఆశ్రయించియే ... చేతను, అహంకారం లేకుండుటయే... ఇతర తలంపులన్నియూ లేకుండు నప్పుడు కారణముగను, మూల స్థానము గనూ, సంసారము అను మాయా వృక్షము యొక్క వేరు అగు, అహంకార .... ఇతర తలంపు లన్నియూ.... మూలము తెగిన వృక్షము వలె, ... పడిపోవును. తన నిష్టకు ప్రతిబంధకముగా ఎన్ని తలంపులు తోచిననూ మనస్సును ఆ దారిన పోనీయక, ఆత్మ స్వరూపమైన తన యందే నిలిపి తన యెదుట వేరే .... తెలుసుకున్నచో, జరుగగలవో, జరుగని చూతము అని సాక్షివలె విలక్షణముగా ... అభ్యాసము రూప మనో నాశములకు అను అహంకార నాశనము చేయు ఈ మార్గమునే భక్తి అనియు, ధ్యానమనియు, యోగమనియు, జ్ఞానమనియు అనేక పేర్లతోటి ....) ఆగు ఆగు పెద్దగా చదివేశావు.
చూడండి. ఏం చెబుతున్నాడో ఆయన, ఎంత చక్కగా చెబుతున్నాడో!
            నాయనా! నువ్వు లోపలికి తొంగి చూస్తే, ప్రథమా విభక్తితోటి అంటే, నేను ప్రథమావిభక్తి. ద్వితీయా, తృతీయా నీవు కాక ఇంకా మిగిలినవి. అంటే అర్థం ఏమిటి? నా భార్య. నా భార్య అనంగానే ఏమైంది? రెండవ వాడు వచ్చేశాడు కదా! అర్థమైందా అండీ! ఇట్లాగ నేను అనే ప్రథమస్థానం నుంచే మిగిలినవి అన్నీ వున్నాయి. అసలు వుండడమే ఇలా వుంది. ఈ సత్యం నీవు జీవితం మొత్తం మీదా ప్రతీ ఆలోచనలోనూ వుంది. ప్రతి పాత్రలోనూ వుంది. ప్రతి సంబంధం లోనూ వుంది. ప్రతి వాక్కులోనూ వుంది. ప్రతి ఆలోచనలోనూ వున్నది. కాబట్టి ఏమిటి చేయాలట ఇప్పుడు? నువ్వు ఆలోచన చేయడాన్ని, పనులు చేయడాన్ని, మాట్లాడడాన్ని, (మాట్లాడడం కూడా పనే!) ఇప్పుడు ఎక్కడ పెట్టాలట దీనిని? అసలు. ఈ మాట్లాడడం ఆలోచన దగ్గర పెట్టాలట అసలు దీనిని మొట్టమొదట. పెట్టి ఏం చేయమంటున్నాడు? నువ్వు ఏం చేసినా ఇది పోదు నాయనా! ఒక్కటే చేయాలి. ఏమిటట? దానికి ఒక స్థానంలో వేరు, మూలంగా వేరు వుంది. ఆ వేరుని తెంచే ప్రయత్నం చేయాలి. నువ్వు ఏదన్నా చెయ్యి. నువ్వు ఇంతమటుకూ ఏం చేశావు? పైపైన చూసుకొచ్చావు. ఆకులు చూశావు, కొమ్మలు చూశావు, రెమ్మలు చూశావు, దాన్నేదో పళ్ళు చూశావు, పూలు చూశావు, దాన్ని కాసేపు ఈ ఫలం అన్నావు, కాసేపు ఆ కొమ్మ అన్నావు. ఏదో చేస్తూ వచ్చావు గానీ, ఎక్కడ వేరు తొలగిస్తే, ఈ వృక్షం పడిపోతుందో, ఆ వేరుని పట్టుకో! పట్టుకోవాలంటే ఏం చెయ్యాలట? ముందు ప్రథమా విభక్తిని పట్టుకోవాలట. అంటే అర్థం ఏమిటి? ఏదైనా ఒక పనిని తీసుకోండి.
            ఉదాహరణకు తీసుకుందాం. ఈ వెడ పిన్నిగారు అన్నాను అనుకోండి. ఎవరికి పిన్నిగారు? ఎవరికో ఒక శరీరానికి పిన్నిగారు. కూతురు అనుకోకూడదు, కూతురు అనుకుంటే మళ్ళా ఏమైంది అక్కడ? మళ్ళా అహంకారం వచ్చేసింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఒక శరీరానికి ఈవెడ పిన్నిగారండి. అంతేకదా! ఈ పిన్నిగారు అనేది, శరీర గత సంబంధమా? నేనుతో వచ్చిన సంబంధమా? (శరీరానికే) శరీర గత సంబంధం. అంతే కదా! ఈ పిన్ని గారికి నేను డజను మామిడిపళ్ళు ఇస్తే బావుండు. ఆలోచనేగా. అంతేనా? ఈవెడ పిన్ని గారు కాకపోతే నేను ఇస్తానా? వ్యతిరేకం ఆలోచించాలండి. ఈవెడ పిన్నిగారు కాకపోతే నేను ఇస్తానా? అంటే శరీర గత సంబంధానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడే నేను ఇది ఇద్దామని అనుకుంటున్నాను. ఇవ్వడానికి పిన్నిగారే కావాలా? ఇప్పుడు ఎట్లా రావాలి ఆలోచన? ఇవ్వడానికి పిన్ని గారే అయ్యుండాలా? అక్కర్లేదు. ఏ జీవి ఏ జీవికి అయినా ఇవ్వచ్చు. ఇచ్చే నీకు మనసు వుండాలే కానీ, పుచ్చుకునేవాడు ఎవడైనా పుచ్చుకోవచ్చు. ఇచ్చే నేను అని మళ్ళా నేను అనుకోవాలా? నేను ఎవరిని ఇవ్వడానికి? పరమాత్మ కదా సృజించింది! సృష్టి యందు పరమాత్మ సృజించింది, ఎవరిని ఆశ్రయించాలో, వారిని ఆశ్రయిస్తోంది కదా! మధ్యలో నేను ఎవరిని? కాబట్టి  ఇవ్వడం సమంజసమా? ఇవ్వకపోవడం సమంజసమా? ఇవ్వడమే సమంజసము. పరమాత్మ పద్ధతిగా ఇవ్వడం అత్యంత సమంజసము. అప్పుడు ఏమైంది? ఇచ్చిన వాడూ లేడు. పుచ్చుకున్న పిన్నీ లేదు. అర్థమైందా? పరమాత్మ ఇచ్చాడు. పరమాత్మ పుచ్చుకున్నాడు. ఇద్దరికీ నష్టం లేదు. ఎవరికి అహంకారం ఏర్పడలేదు. అదే పిన్నిగారికే ఇచ్చానండి. ఏమైంది అప్పుడు? పుచ్చుకున్న వాడు ఏమైయ్యాడు? (జీవుడు అయిపోయాడు) అదీ సంగతి! అర్థమైందా!
            ఇప్పుడు ఏమైంది? ఇట్లా అహంకారం యొక్క వేరుని నువ్వు మొట్టమొదట పట్టుకో! ప్రతి ఆలోచనలో ఈ వేరు వుంటుందండి. దీనికి వ్యతిరేకంగా ఆలోచించాలన్నమాట మనం ఇప్పుడు. ఇప్పటి వరకూ ఏం చేశావు? అనుకూలంగా ఆలోచించావు. అనుకూలంగా ఆలోచించడం వల్ల ఏమైంది? అదే బలపడిపోయింది. ఇప్పుడు మీ ఇంటికి (పెళ్ళిచేసామండి) అల్లడు గారు వచ్చారండీ! అల్లుడు గారు వస్తే, who is అల్లుడు? అల్లుడు ఎవడవయ్యా? నువ్వు పో అవతలికి? బాహ్యంలో ప్రవర్తించడం కాదు, ముందు నువ్వు అంతరంలో ప్రశ్నించుకో? వచ్చిన వాడు ఎవడు? పరమాత్మ. మన పెద్దల సాంప్రదాయంలో ఏం చెప్పారు? ఇన్ని సంబంధాలు అక్కడ లేవు. ఎవడైనా సరే, నీ ఇంటికి వచ్చిన ప్రతివాడూ అతిథి దేవో భవ’. వచ్చిన వాళ్ళు అంతా అతిథులే. నాయనా! వాడికి ఇన్ని పేర్లు, ఇన్ని సంబంధాలు, ఇన్ని బాంధవ్యాలు లేవు అక్కడ. అర్థమైందా అండి? వాళ్ళు ఏం చెప్పారు అందుకని? నాలుగే బాంధవ్యాలు. ఈ సృష్టి మొత్తం మీద మానవులకు నాలుగే బాంధవ్యాలు. ఏమిటి? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవో భవ. ఈ నాలుగే. నువ్వు జీవితం మొత్తం మీదా ఈ నాలుగు సంబంధాలను మాత్రమే పెట్టుకుంటే, నువ్వు దీనిని తెలుసుకోగలుగుతావు. ఈ అహంకారం వృక్షం యొక్క కూకటి వేళ్ళు తెలియాలి అంటే, ఇక్కడికి పరిమితం పెట్టుకోవాలి నువ్వు. ఇక్కడికి పరిమితం పెట్టుకుని ఈ నాలుగు సంబంధాలలోకే విచారణ చేసి, అహంకార సంబంధాన్ని లేకుండా చేస్తే, ఏమైంది అప్పుడు నీకు? ‘నేనుఅనే స్ఫురణ తెలుస్తుంది. ఇప్పుడు మనం ఈ నాల్గింటి వరకే వున్నామా? నాలుగు నాలుగు వేలు అయ్యింది. ఇదీ అని దాని లెక్కేముంది? అది ఎంత అవుతుందో, నలభై వేలు అవుతుందో కూడా మనకు తెలియదు. అందుకని, ఆత్మీయతాబంధం ఒక్కటే వుండాలి. నేను మీరు ఎవరండీ? మీరు ఆత్మీయులండీ! ఆత్మీయులు అంటే దానికి ఏమీ సంబంధం లేదుగా. ఎందుకని? ఆత్మసంబంధీకుడు. నా యొక్క నేనుని స్ఫురణ చేసేవాడు. నాలో వున్న పరమాత్మను స్ఫురణకు తెచ్చేవాడు. ఏమయ్యాడు అప్పుడు వాడు? వాడు ఆత్మీయుడు. కాబట్టి ఆత్మీయుడు కంటే దగ్గరవాడు ఉన్నాడా? లేడు. అర్థమైందా అండీ! కాబట్టి ఎవడితో అయినా కూడా నీ గొప్ప సంబంధం ఏమిటి? దగ్గర సంబంధం ఏమిటి? ఆత్మీయుడే అత్యంత దగ్గర సంబంధం. చూడండి. పూర్వం పెద్దలు అనేవారండి, ఇప్పుడు ఎవరూ అనడం లేదండి. పూర్వం పెద్దలు చక్కగా వారు ఇదే మాట అనేవారు. వీరంతా మా ఆత్మీయులండి. అంటే ఏమిటి? వారికీ మాకు అరమరికలు లేవు. అందుకని నాకు అత్యంత దగ్గర వాడు. నేనే వాడు. అప్పుడు నాకు ఆత్మీయుడు. వాడికీ నాకు భేదం లేదు. ఎందుకని? ‘నేనుగా చూసినప్పుడు ఎక్కడుంది? అర్థమైందా అండీ? నేను నేనుగా చూశాను. వాడిని నేనుగా చూస్తున్నాను. నేను పరమాత్మను. వాడూ పరమాత్మే. నేను ఆత్మస్వరూపుడను, వాడూ ఆత్మస్వరూపుడే. అంటే దేహసంబంధంగా చూడడం లేదు నేను. దేహసంబంధంగా ప్రవర్తించడం లేదు. అప్పుడు కదా నీకు అసలు నిజమైన సంబంధం అంటే ఏమిటో తెలిసేది? అప్పుడు కదా ఎవరూ ఎవరికీ ఏం చెప్పాల్సిన అవసరం లేదు. వాడు చూస్తేనే నువ్వు అవగాహన చేసుకోగలవు ఏం చెయ్యాలో? నిన్ను చూస్తేనే వాడు అవగాహన చేసుకోగలడు ఏం చెయ్యాలో! ఇప్పుడు భార్యా భర్తలు ఆత్మీయులా? లేకపోతే? శరీర సంబంధీకులా? (ఆత్మీయులు) వుండాలి. కానీ ఎలా వున్నారు? దేహసంబంధీకులుగా వున్నాము. ఏమైంది అందువల్ల? చెబితే అర్థం కాదు. చెప్పకపోయినా అసలు అర్థం కాదు. అర్థమైందా అండీ! ఇప్పుడు ఏమయ్యారు? అందువల్ల ఒక దగ్గర వుంటున్నారే తప్ప ప్రయోజన శూన్యం. ఎందుకని? ఒకరి సమస్యను ఒకరు అర్థం చేసుకోరు. అర్థం చేసుకోవాలి అంటే ఏముండాలి? ఇదిగో అహంకార నిరసనతో కూడినటువంటి ఆత్మీయతా బంధం వుండాలి. ఆత్మీయతా బంధం అనేది బంధమా ఇప్పుడు? అది బంధము కాదు. ఎందువల్ల? అది పెద్దముల్లు. మిగిలిన వంటినన్నింటినీ తొలగించేటటువంటి పెద్ద ముల్లు. చిక్కుపడిపోయింది నీ వస్త్రం వెళ్ళి ముల్ల మీద పడిందండి. ఆ ముల్లు అన్నీ ఈ వస్త్రంలో చేరినాయి. ఇప్పుడు ఆ చిన్న చిన్న ముల్లు అన్నీ తీసేయాలి. తీసేయాలంటే ఏం చేయాలి? ఒక పెద్ద ముల్లు కావాలి. తరువాత ఈ పెద్ద ముల్లును కూడా పారేస్తాము. దాన్ని ఉపయోగించుకుని. కాబట్టి నేను ఆత్మస్వరూపుడు అనే భావనతో నీవు గనుక, అన్ని అహంకార మూలాలని కనుక విచారణ చేసినట్లయితే, నీలో కలుగుతున్న ఆలోచనలన్నింటినీ, అవి దృశ్యరూపమని, చిత్రరూపమని, ఆ దృశ్యములు, చిత్రములు నేను కాదని, వాటిలో చేరకుండా, ఆ దారిన పోకుండా, ఆ దృశ్యంలో పోకుండా, ఆ చిత్రాన్ని ఎట్లా చూస్తున్నావో, గోడమీద చిత్రం వుందండి, ఎట్లా చూస్తున్నావు? ఏమన్నా చేరిపోతున్నావా? అందులోకి? ఆ చిత్రంలో పెద్ద తుఫాను వచ్చినట్లు ఒక చిత్రం గీసారండీ! ఆ తుఫానులో నువ్వు కొట్టుకు పోతున్నట్లు భావన చేశావా? చేయలేదుగా. ఆ చిత్రాన్నే ఎట్లా చూస్తున్నావు? విడిగా వుండడం లేదా? సాక్షిగా చూడడం లేదా? అలాగ నీ ఆలోచనలని చూడవయ్యా!
            (ఆత్మస్వరూపుడిని అనే స్థితిలోనుంచి చూచి...) గమనించు. ఊరక వుండు. సాక్షివలె చూస్తూ వుంటే, ఈ ఒక్క సాధనే చేయాలట, ఇంకెన్ని చేసినా, సాధ్యం కాదు. అందుకే ఇంతమంది ఇన్ని రకాలుగా చెబుతున్నారు కదండీ! మరీ! ఏం చేయమంటారండీ? అన్నీ ఇదేనయ్యా బాబు. ఇదే భక్తి. ఇదే ధ్యానం. ఇదే యోగం. ఇదే జ్ఞానం. ఈ పని చేయకపోతే, నువ్వు ఎన్ని చేసినా ఆపేరు మీద, అది సాధ్యమేనా? ఉదాహరణ చెబుతా చూడండి. ఇప్పుడు నేను భక్తిలో చాలా చేశానండి. ఎక్కడ చేశావు? ఆ అహంకారం అనే వృక్షం కొమ్మల మీద, ఇటూ అటూ ఊగిసలాడావు. ఒక సారి విష్ణు సహస్రనామం అన్నావు, ఒక సారి లలితా సహస్రనామం అన్నావు, ఒక సారి శివ సహస్రనామం అన్నావు. ఒకసారి సంధ్యావందనం అన్నావు, ఒక సారి ఇంకోటి అన్నావు, ఒకసారి ఇంకోటి.... ఇప్పుడు ఏంటట? ఆ కొమ్మల మీద ఎగురుతున్నావు, ఈ కొమ్మ ఆ కొమ్మ. అసలు ఆ అహంకార వృక్షానికి మూలం ఎక్కడుంది? ఆ మూలమైన వేరును తెంచే ప్రయత్నం చేస్తే, వృక్షం అదే కూలిపోయింది. కాబట్టి వృక్షాన్ని పైన కొట్టేస్తే ప్రయోజనం లేదు బాబు. ఆ మూలమైన వేరుని తెంచే సాధన చేయి. ఆ సాధనలోనే భక్తి, ధ్యానం, యోగం, జ్ఞానం అన్నీ అందులోనే వున్నాయి. ఎందుకని? అన్ని సాధనలకి అంత్యసాధన, చివరి సాధన ఏమిటయ్యా అంటే ఇదే. నువ్వు ఎన్ని అన్నా చేసిరా, అవన్నీ నవవిధ భక్తి మార్గాలలోవి. చివరిదైన ఆత్మ నివేదన చెయ్యాలి అంటే, నీకు అసలు అది తెలియాలి. ఆ నవవిధభక్తి మార్గాలలో ఆఖరిది ఏమిటి? ఆత్మనివేదన. అర్చనం, వందనం, విష్ణోః స్మరణం, పాద సేవనం అని వరుసగా చెప్పే తొమ్మిది మార్గాలలో, నవవిధ మార్గాలలో ఆఖరిది ఏమిటి? ఆత్మనివేదన. మరి ఆత్మస్వరూపం తెలిస్తే కదా! నివేదన చేసేది. నువ్వు రోజూ నైవేద్యం పెడుతున్నది నైవేద్యం కాదది. ఆత్మనివేదన అనే స్థితి కోసం పెడుతున్నావు అది. కానీ ఏమైపోయింది? పూర్ణం బూరెలు సత్యం, గారెలు సత్యం, పిండి వంటలు సత్యం అయిపోయింది నైవేద్యంలో. దానికోసం భగవంతుడు అక్కడ లేడు. వాటి వల్ల ప్రయోజనం లేదు. ఆ నివేదన అనేది చివరకు ఎందుకు పెట్టారు? అంతకు ముందు తొమ్మిది, నవవిధ భక్తి మార్గాలు చేస్తూ వచ్చావు, అర్చనం, వందనం, విష్ణోఃస్మరణం, పాదసేవనం అన్నీవరుసగా తీసుకొచ్చి చివరికి నివేదన పెట్టాడు. నివేదన అంటే ఏమిటి? అర్పించేశావు. ఇక తిరిగి రాదు. నిన్ను నువ్వు అర్పించేశావు. నేను అనే ఆత్మ స్వరూపాన్ని పరమాత్మకు అర్పించేశావు. ఏమైంది అప్పుడు? ఆత్మనివేదన అయ్యింది. ఇలా పెట్టారు బాబు. దీనిని అర్థం చేసుకో! ప్రతీదాంట్లో పెట్టే విధానం అదే! కానీ ఆచరణలో ఏమైంది? ఈ అహంకార వృక్షాన్ని ఆశ్రయించడం చేత అంతా పోయింది. తూర్పు తిరిగే ఎందుకు చేయాలి? (రాత్రి కూడా చెప్పా అదే!) తూర్పున సూర్యుడనే సాక్షి వున్నాడు. సాక్షి స్మరణతో. ఆ సాక్షిని నేనని, ఆ సాక్షివలె వుంటానని, ఆయన ఎదురుగుండా కూర్చొని, ఆయన్ని ఆశ్రయించి ఆ స్థితిలో వుండి, నేను ఈ పని చేస్తున్నాను అని. అందుకు తూర్పు తిరిగి కూర్చొని చేయవయ్యా అన్నారు, ప్రతిదానికి కూడా. అసలు ఎందుకు తూర్పు అంటే వాడికి తెలియదు. చెప్పేవాడికి తెలియదు, చేసేవాడికి అంతకంటే తెలియదు. అదేంటి అంటే పెద్దలు చెప్పారు అంటాడు. కానీ పెద్దలు ఎందుకు చెబుతారు? నీ ఉన్నతి కోసమే చెప్తారు. నీ ఔన్నత్యం, నీలో వున్నటువంటి స్థితిని తెలుసుకోవడం కోసమే చెప్పారు. కానీ విచారణ చేయకపోవడం వల్ల ఏమైంది? బాహ్యమే సత్యమై, అహంకార వృక్షాన్ని ఆశ్రయించావు. దేనిని ఆశ్రయించాలి నువ్వు? ఆత్మని ఆశ్రయించాలి. నేనుని ఆశ్రయించాలి. కానిని దేనిని ఆశ్రయించావు? అహంకార వృక్షాన్ని ఆశ్రయించావు.
             ఇదే బైబిల్‌ కూడా చెప్పేది. ఎవరు చెప్పినా ఇదే. నాయనా! యెహోవాని, ప్రభువుని ఆశ్రయించు. సాతానుని ఆశ్రయించమాకు. ఆ ఆపిల్‌ చెట్టును ఆశ్రయించమాకు. ఆ ఆపిల్‌ పండు తినమాకు. అది తింటే నీకు దేహ భ్రాంతి కలిగింది. అహంకారం కలిగింది. నువ్వు పాపాత్ముడివి అయినావు. చూడండి స్పష్టంగా బైబిల్‌ కూడా అదే చెప్తున్నది. వేరే ఏం లేదు.
            ఇక్కడా అదే చెబుతున్నాడు. అహంకార వృక్షము దాని ఫలాన్ని స్వీకరించమాకు. దాని ఫలాన్ని స్వీకరిస్తే పాపాత్ముడివి అయినావు. ప్రభువుని ఆశ్రయించు. ఆత్మను ఆశ్రయించు. పరమాత్మను ఆశ్రయించు. అప్పుడు ఏమైంది? పుణ్యాత్ముడవు. కాబట్టి పాప, పుణ్యాలకు ఇప్పుడు అర్థమేమిటి? అహంకారాన్ని ఆశ్రయిస్తే అంతా పాపమే. దేహాభిమానమంతా పాపమే. పుణ్యం అంటే ఏమిటి? ‘నేనుని ఆశ్రయించడమే పుణ్యము. నీ యొక్క స్వరూపస్థితి. ఆ స్వరూప జ్ఞానము. స్వప్రకాశ జ్ఞానాన్ని పొందడమే పుణ్యము. ఇంతకు మించిన పుణ్యము ఏదీ లేదు నాయనా! ఎందుకని? అన్ని పుణ్యాల ఫలితమే అది. ఆ భక్తి యోగం ధ్యానం జ్ఞానం నువ్వు ఎన్నైతే చెబుతున్నావో, ఆ పుణ్యాల ఫలితమనే సాధనంతా ఏమిటి? ఆ అహంకార వృక్షం కూలిపోవడమే. కానీ, ఇప్పటి వరకూ ఏం చేశావు? వీటిని కూడా పట్టుకుని పోయి అహంకార వృక్షాన్ని బలపరిచావు. ఏం చేస్తే ఆ అహంకార వృక్షం కూలిపోవాలో, ఆ సాధన తప్ప, ఏం చేస్తే ఇది బలపడుతుందో, అట్లా చేశావు. కాబట్టి ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? తద్ వ్యతిరేకంగా ఆలోచించు. ఆ ఆలోచన వచ్చినప్పుడు, ఆలోచనకి వ్యతిరేకం, అందులో వున్న అహంకారాన్ని పట్టుకోవాలి నువ్వు. అర్థమైందా అండీ!
            ఒకటి చెబుతాను విను. ఇప్పుడు వెళ్తావు. ఇంటికి వెళ్ళంగానే ఏం చేసి వచ్చావమ్మా? అంటారు అనుకోండి మీ కుటుంబ సభ్యులు. ఇప్పుడు నిన్ను వాళ్ళు దేనిని అన్నారు? (శరీరాన్ని) నిన్ను ఏ మన్నా అన్నారా? ఆత్మ స్వరూపంలో నువ్వు వాడు ఒక్కటే కదా!
ఆ స్వరూప స్థితి గురించి తెలుసుకుని వచ్చానండి. బాగా తెలిసింది స్వరూపస్థితి గురించి అన్నారనుకోండి. అప్పుడు మీకు సమాధానం ఏం చెబుతారు? అంటే అర్థం ఏమిటి? ఎలా సాధ్యం అవుతుందయ్యా ఇది అంటే, ఎప్పుడు సాధ్యమౌతుందటా? నీవు నిజజీవితంలో కూడా, మాటలు మాట్లాడేవి, ఈ వేదాంత వాక్యలతో మాట్లాడడం అలవాటు చేసుకో! ఇప్పటి వరకూ మాట్లాడావా? మాట్లాడ లేదు కదా! ఏమైంది అప్పుడు? ఎప్పుడైతే ఈ వేదాంత వాక్య స్ఫురణతో నువ్వు ఎప్పుడైతే మాట్లాడుతున్నావో, అప్పుడు నీకు return ఏం చెప్పాలి? మళ్ళా ఇప్పటి వరకూ ఏమిటి? ప్రశ్నకు ప్రశ్న కదా! నీవు ఒకటి చెబితే, వాళ్ళు రెండు అంటారు కదా! ఎప్పుడు అన్నారు? అహంకారం వృక్షాన్ని నువ్వు ఆశ్రయించి చెప్పినప్పుడు, ఒకటికి రెండు అయ్యింది అది. అదే ఇప్పుడు మరి నువ్వు ఎలా మాట్లాడాలట? వేదాంత వాక్యాలతో మాట్లాడు. ఇప్పుడు మాట్లాడమను. మాట్లాడితే ఏమౌతుంది ఇప్పుడు? నీకు దుఃఖం కలుగలేదు. అదే నీవు అహంకార వృక్షాన్ని కనుక ఆశ్రయించి మాట్లాడినప్పుడు, దుఃఖం కలిగింది. ఎప్పుడైతే నువ్వు వేదాంత వాక్యాన్ని ఆశ్రయించి, ఈ వేదాంత వాక్యాలనే సమాధానాలుగా చెప్పావో, అప్పుడు ఏమైంది? దుఃఖం వుండదు. అవును అన్నాడు, ఓహో! అజ్ఞానంతో అన్నాడు. మంచిదే! ఇప్పుడు మనకేమి పోయింది? నేను అట్లాగే అన్నానుగా నిన్నటి దాకా నేను ఇట్లా అన్నవాడినే కదా! తెలిసినప్పుడు వాడు కూడా అనకుండా పోతాడు. అంతే కదా! కాబట్టి ఎప్పటికైనా ఈ అహంకార వృక్షం కూలిపోవలసిందే. ఎంతకాలం దీనిని కాపాడుతావు? ఎందుకని? ఈ శరీరం ఎందుకు తెచ్చుకున్నావు నువ్వు అసలు? ఈ అహంకార వృక్షం కూల్చడం కోసమే, ఈ శరీరం తెచ్చుకున్నావు. కానీ శరీరంలోకి రాగానే మర్చిపోయావు ఆ సంగతి. మరచి పోయి, అహంకార వృక్షాన్ని బాగా నారు పోసి, నీరు పోసి బాగా పెంచి పోషించావు. ఏమిటా నారు పోసి, నీరు పోసి? విషయాలు అనే నారు, నీరు. ఫలితాలు అనే నారు, నీరు. అపేక్ష. ఫలితం మీద అపేక్ష. అది నువ్వైపోవడం. అందుకనే ఏమంటున్నాడు అక్కడ? దృశ్యమయము కాకుండా. ఆ దృశ్యమయము. ఆ దృశ్యము నువ్వైపోతున్నావు. ఆ ఆలోచన కూడా దృశ్యమే. బుద్ధిలో వున్న జ్ఞాపకము కూడా దృశ్యమే. (అందులో లీనమైపోతున్నాము కదా!) ఆఁ... అది రాగానే, అది నువ్వైపోయావు. (అలా లీనమైపోయి, బాహ్యకూడా పట్టించుకోనంత స్థితిలోకి వెళ్ళిపోతున్నాము, నేను చెయ్యాలి, ఆ తలంపు లేకుండా చెయ్యాలి)

            అందుకని చాలా స్పష్టంగా, ఎందుకని స్వరూపము తనయందే నిలపాలి అంటే ఇప్పుడు ఏం చేయాలట?

            అందుకని చాలా స్పష్టంగా, ఎందుకని స్వరూపము తనయందే నిలపాలి అంటే ఇప్పుడు ఏం చేయాలట? ఇలాంటి వేదాంత వాక్యాలని స్ఫురణలో మననం చేయాలి. ఆఁ.. ఈ వేదాంత వాక్యాలని మననం చేయాలి. ఆ బోధించేటటువంటి స్థితిని మననం చేయాలి. చేస్తే ఏమైందట? అప్పుడు తద్ వ్యతిరేకం ఆ అహంకారానికి వ్యతిరేకం ఏమిటో బోధపడింది. ఆ నేను అంటే స్ఫురణ అంటే ఏమిటో, సాక్షి అంటే ఏమిటో బోధపడింది. ఈ సాధన తప్ప వేరే ఏ సాధన చేసినా, నీకు ఇది సాధ్యం కాదు. అని స్పష్టంగా చెబుతున్నారు, భగవాన్‌ రమణులు.

            అసలు బంధం ఏమిటయ్యా? సంకల్పమే బంధము, నిస్సంకల్పమే ముక్తి. ఇది నాయనా దీనికి ఆధారము. వేదాంతంలో వున్నటు వంటి వాక్యం, ఆ వేదంలో  చెప్పినటువంటి శృతి వాక్యం ఏమిటంటే, సంకల్పమే బంధము, నిస్సంకల్పమే ముక్తి. మరి నీప్పుడు నిస్సంకల్పంగా వున్నావా? ఎప్పుడైనా అసలు. లేవుగా. అసలు నిరంతరాయంగా సంకల్పాలు, అది ఊరుకున్నా నువ్వు ఊరుకోవడం లేదు. నేను ఊరుకుంటే సంకల్పాలు పోతాయండి. ఎందుకనంటే, అన్నింటికీ మూలం అదే. ఆ నేను అనే చోటనుంచే, అన్ని సంకల్పాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేను అనే చోటనే అన్ని సంకల్పాలు అణిగిపోతున్నాయి. అర్థమైందా అండీ! కాబట్టి మనసును ఆశ్రయించి గాని, ప్రాణాన్ని ఆశ్రయించి గాని, నీవు నీ హృదయ స్థానాన్ని గనుక చేరినట్లయితే, నీవు ఆ హృదయస్థానంలో వున్న నేనును తెలుసుకోగలుగుతావు. తెలుసుకుంటే ఉపయోగం ఏమిటి? అంటే ఇదే. సంకల్పమే బంధము, నిస్సంకల్పమే ముక్తి. అని తెలుస్తుంది. ఆ నేనును ఆశ్రయిస్తే ఇది తెలుస్తుందన్నమాట. ఎట్లాగో చెబుతున్నారు.

            శృతులు మొర పెడుతున్నాయట!  ఏమని? సంకల్పమే బంధము అని. తలంపే బంధము అని. వేరే ఇంకేమీ లేదు నాయనా! అసలు నీకు బంధము అంటూ ఒకటి వుందంటే, నువ్వు ఎన్నో పేర్లు చెబుతున్నావు, నన్ను నా కొడుకు ఇబ్బంది పెట్టాడండి, నా భార్య ఇబ్బంది పెట్టిందండి. భర్త ఇబ్బంది పెట్టాడండి. వాడు ఇబ్బంది పెట్టాడండి, పక్కవాడు పెట్టాడండి, కూరగాయల వాడు పెట్టాడండి... మనం రోజూ ఏకరువు పెట్టే దుఃఖాలలో ఎవడో ఒకడు వున్నాడు కదా! వీళ్ళందరూ ఎక్కడున్నారయ్యా? నీ తలంపులోనే కదా వుంది. కాబట్టి తలంపు బంధమని తెలుసుకో! తలంపును త్యజిస్తే, బంధమే లేదు. ఆ తలంపుకు మూలమైన అహంకారాన్ని త్యజించు. తలంపు అదే పోతుంది. ఇప్పుడు మనమేమి చేస్తున్నాము? తలంపులను ఆపే ప్రయత్నము చేస్తున్నాము. తలంపులను ఆపే ప్రయత్నం చేస్తే అది మరింత అయిపోతుంది. తలంపులను ఆపే ప్రయత్నం చేయకూడదు. ఆ తలంపులని, రోడ్డు మీద వెళ్తున్న బాటసారులను గమనించినట్లు గమనించు. నీ ఇంటిముందు రోడ్డు మీద వెళ్తున్నారు కదా! ఎంతమందిని ఆపి వారి వివరం కనుక్కున్నావు? ఎవ్వరినీ ఆపలేదు. వాడి పని మీద వాడు వస్తున్నాడు పోతున్నాడు. నీ తలంపులు కూడా అంతే! అలా గమనిస్తూ వుండు, చిత్రం వలె గమనిస్తూ వుండు, దృశ్యం వలె గమనిస్తూ వుండు. గమనించి దాంట్లో వున్న అహంకారాన్ని పట్టుకో! ఆ మూలం ఎట్లా వుందో పట్టుకో! నీలో వున్నటువంటి అహంకారాన్ని ఆ తలంపు ఎలా పోషింప జేస్తుందో పట్టుకో! ఏమైంది? ప్రతి పనిలో, ప్రతి చేతలో, ప్రతి మాటలో, ప్రతి ఆలోచనలో కూడా నీ అహం ప్రతిపాద్యమే వున్నది అక్కడ. ఆ అహం ప్రతిపాద్యాన్ని నిరసించాలి. అది నిరసిస్తే తప్ప, నీకు నేనుఅనే స్ఫురణ కలుగదు. నేనుఅనే స్ఫురణ కలిగితేనే కానీ బంధము తొలగదు. ఆ నేనుఅనే స్ఫురణను పట్టుకోవడం చాలా అవసరం. అందుకని అహంకార నిరసన చేయమంటున్నాడు. దానిని తొలగించాలంటే, తీసివేయడానికి పదార్థం కాదు అది. నువ్వు దాంట్లో ఏం చేయాలి? నేను రామ లక్ష్మిని కాదు. అని బలంగా వినపడాలి. ఇప్పటి వరకూ ఏం చేశావు? ‘నేను రామ లక్ష్మీనే అంటూ చేశావు. నేను రామ లక్ష్మీనే అంటూ చేస్తే ఏమైంది? బలపడి పోలేదా? పూజలు చేసినా, జపాలు చేసినా, తపాలు చేసినా, నీవు ఎట్లా చేశావు? నీ శరీరాన్ని దృష్టిలో పెట్టుకునే చేశావు. అన్నీ ఇంట్లో చేసే అన్నీ. నిత్య నైమిత్తిక కార్యక్రమాలు అన్నీ కూడా ఆ నేను అనేది బలపడుతూనే చేశావు. ఆ నేను అనేది ఎట్లా బలపడుతూ చేశావు? అహంకార పద్ధతిగా బలపడుతూ చేశావు. కాబట్టి తద్ వ్యతిరేకంగా చేయి. చేస్తే గానీ నిరసించడానికి వీలుకాదు.
            (నేను అను తలంపు, చూపు...... అతని యందే నిలిపి, )
ఇది. అన్ని ఉపనిషత్తులూ కలిసి, 108 ఉపనిషత్తులూ కలిసి చెబుతున్న ఆఖరి సాధన ఏమిటయ్యా? కడపటి సిద్ధాంతము. ఏమండీ! నేను అది విన్నానండీ, ఇది విన్నానండీ! త్రిపురా రహస్యము విన్నానండీ! లేకపోతే యోగవాశిష్టము విన్నానండి. లేకపోతే ఇంకోటి విన్నానండి. నీ ఇష్టం ఎన్నైనా ఏకరువు పెట్టు. రామాయణం విన్నానండీ, భాగవతం విన్నానండి, అది విన్నానండి, ఉపనిషత్తులు విన్నానండి, బృహదారణ్యకోపనిషత్తు విన్నానండి, కేనోపనిషత్తు విన్నానండి, కఠోపనిషత్తు విన్నానండి, నువ్వు ఎన్నన్నా చెప్పవయ్యా బాబు. అవన్నీ కలిసి ఆఖరి సిద్ధాంతము ఒక్కదానిని చెబుతున్నాయి. ఇవన్నీ కట్టకట్టి ఒక్కదాంటో పోస్తే, సారమంతా వడగడితే, నాయనా! ఇదంతా ఒకే ఒక సిద్ధాంతము. ఏమిటి? అహంకార నిరసన చేయమంటున్నాయి. తలంపే బంధమని తెలుసుకోమంటున్నాయి. నీకు తలంపు వచ్చినప్పుడల్లా, ఆలోచనే బంధము తో మొదలుపెట్టు. ఆ మననం అంటే అర్థం ఏమిటంటేనండి, ఒక దగ్గర కూర్చొని చెవులో పెట్టుకుని వినడం కాదు. నువ్వు నిత్యజీవితంలో చేసేటప్పుడు, ఆ మాటలతో, ఆ వాక్యాలతో జీవించాలి. ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి, వెంటనే తలంపే బంధము కదా!అన్నారనుకోండి, ఏమైంది అప్పుడు? ఇంకేముంది? ఇక సమస్య లేదుగా. తలంపే బంధము కదా! అన్నారనుకోండి, ఎదుటి వాడు విని, అర్థం చేసుకుంటే, వాడికీ ఉపయోగమే. వాడు వినలేదు, అర్థం చేసుకోలేదు, నీకు వుపయోగమేగా! నీవైనా నేనుఅనే స్ఫురణలో వుంటావుగా. అహంకార నిరసన జరిగిపోతుంది కదా! అది నీకు ఉపయోగమే కదా! నువ్వు ముందు జ్ఞానంలో వుండు. వాడి సంగతి తర్వాత చూద్దాము. నువ్వు బంధ విముక్తిడివికా. నీవు స్తంభానికి కట్టివేయబడి వుండి, వాడు నన్ను కొడుతున్నాడు అని అంటే? నిన్ను ఎవడు కట్టివేయబడమన్నాడు? నువ్వు స్వేచ్ఛను పొందితే వాడు కొట్టే అవకాశం వుందా? లేదు కదా! మరి ఏమంటావు ఎంతసేపూ కూడా? నన్ను వాడు వుండనివ్వడం లేదండీ! నన్ను అసలు పోనివ్వడం లేదండి. అర్థం వుందా? ఏమైనా? నువ్వు వేదాంత వాక్యాలను ఆశ్రయించు. వేదాంత వాక్యాలతో జీవించు. నిన్ను ఎవరు ఆపగలరో చూద్దాము. నీ శరీరాన్ని ఏదైనా చేయగలరు గాని, దాని లోపలదాన్ని ఏం చేస్తావు? ఎవ్వడూ ఏమీ చేయలేడు బాబు. ఎందుకని? ఏదైనా చెయ్యగలిగితే పోయేరోజున ఏం చేశారు? ఏం చేశాడేమిటి? ఆ పోయేదానిని ఎవడైనా పట్టుకోగలిగాడా? ఏమీ లేదు. వట్టిదే. ఈ సత్యం తెలుసుకో! వాడు నన్ను నియమించేశాడండీ! నన్ను కదలనివ్వడం లేదండీ! దేని కదలనివ్వడం లేదు? శరీరాన్ని. అర్థముందా? నువ్వు మనసుతో చేసేపనిని ఎవడు ఆపగలడు? అసాధ్యం. ఎవ్వడూ ఆపలేడు కదా! కాబట్టి పరమాత్మను ఎట్లా ఆశ్రయించాలి? శరీరంతో ఎట్లా ఆశ్రయిస్తావు? మనసుతో ఆశ్రయించు. నువ్వు ఆపు దీనిని చూద్దాము. ఆపలేవు కదా! ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడు శిక్షించ పూనుకున్నాడండి. దేనిని శిక్షించాడు? శరీరాన్ని శిక్షించాడు. ఏమి ఆపగలిగాడు? కాబట్టి నీవు నిరంతరాయంగా, నా చుట్టుపక్కల వున్న ప్రపంచం నిర్భందించేస్తుందండి. ఈ ప్రపంచం అటు నన్ను తొయ్యనివ్వడం లేదండి. నాకు అడ్డంగా వుందండి. ఇదే కదా! మనం చెప్పే వన్నీ! దేనికి ఇవన్నీ? నీ శరీర సంబంధీకులు ఇదంతా కూడా. ఆత్మ సంబంధీకులు కావు ఇవి. (మనం కూడా దానిలోనే వున్నాం కదా!) ఆఁ.. నువ్వు ముందు మారాలి. నువ్వు ఆత్మానుసార పద్ధతిలోకి మనసుని మారిస్తే తప్ప, ఇందాక ఏం చెబుతున్నాడు? దాని వెంబడి పోక... ఆ దేహ సంబంధీకమైన విధానంలో, ఆ సిద్ధాంతం వెంబడి మనసు పోతోంది, పోనివ్వక ఆ చిత్రాన్ని ఎట్లా గమనిస్తూ వున్నావో, ఆ బాటసారులను ఎట్లా గమనిస్తూ వున్నావో, దృశ్యాన్ని ఎట్లా గమనిస్తూ వున్నావో, అట్లా నీవు వుండు. అప్పుడే అది సాధ్యమౌతుంది.

            (ఆకారము స్థూల శరీరము నందు మాత్రమే.......... అభిమానము.... సాధ్యమా)
ఈ విచారణ చేస్తే, కేవలము స్థూల దేహానికి సంబంధించినవి వున్న ఆత్మ విచారణే అవుతుందా? లేదంటే సూక్ష్మం, కారణం వగైరాలు ఇంకా వున్నాయి కదా! ఈ ఆత్మవిచారణ అక్కడ కూడా ఉపయోగపడుతుందా?

            (సూక్ష్మ కారణ దేహాదుల యందలి ఆత్మ భావము కూడా.... నివర్తింప సాధ్యమా?)
అక్కడ కూడా ఇది ఉపయోగపడుతుందా? ఎందుకని? మనం ఒప్పుకుంటున్నాము కదా! స్థూలం ఎదురుగుండా వున్నటువంటి జడపదార్థమైన శరీరం. దీని లోపల పనిచేస్తున్న ప్రాణ మనో బుద్ధులు సూక్ష్మం. వేరే ఏమీ లేదు. ఆ ప్రాణ మనో బుద్ధులే సూక్ష్మం. దానికంటే అవతల వున్న స్థితి కారణం. ఆ నిద్రాస్థితే కారణం. ఆనందమయ కోశమే కారణం. మరి ఈ మూడు చోట్లా వుపయోగపడుతుందా ఈ ఆత్మ విచారణ? లేకపోతే వట్టి జడపదార్థమైన స్థూలదేహం వరకే ఉపయోగపడుతుందా? ఇది ఒక్కటే నివర్తింప జేస్తుందా? ఈ మందు వేసుకుంటే జ్వరం ఒక్కటే తగ్గుతుందా? ఇంకా మిగిలినవి కూడా ఏమన్నా తగ్గుతాయా? అని అడుగుతున్నావు కదా! అట్లాగే నాయనా! ఈ సాధనని ఇదే కడపటి సాధన అని అంటున్నావు కదా! మరి కడపటి సాధన చేస్తే మరి అన్నిటికీ ఉపయోగపడాలి కదా! దీన్ని మించిన మందు లేదండి అన్నాడండి డాక్టరు. దీన్ని మించిన మందు లేదండి అంటే అర్థం ఏమిటి? నువ్వు చెప్పిన అన్ని లక్షణాలకి మందు ఇదేరా బాబు. అంతేగాని లక్షణానికి ఒక మందు కాదు. కాబట్టి నువ్వు స్థూల దేహం వల్ల అహంకారం కలిగిందన్నా అదే మందు. సూక్ష్మ దేహం వల్ల కలిగిందన్నా ఇదే మందు. ఇదే సాధన. కారణ దేహం వల్ల కలిగిందన్నా ఇదే సాధన. అట్లా ఇది వుపయోగపడుతుందా? అని అడుగుతున్నాడు.
            (స్థూల దేహమును బట్టియే ఇతర దేహములు జీవించి యుండుట చేతను, దేహము నేను అనుటలో పంచకోశ రూప శరీరత్రయ మడగి వుండుట చేతను, స్థూలదేహము నందుగల ఆత్మభావ నాశమే, ఇతర దేహములయందుగల ఆత్మభావనాశమును, మూడు శరీరములయందు గల ఆత్మభావమునాశమును .... బోధించుచున్నది. )

ఈ స్థూల దేహాన్ని ఆశ్రయించే మిగిలిన రెండూ పనిచేస్తున్నాయి. అసలు ఈ స్థూల దేహం ఆ రెండింటి నుంచి ఏర్పడింది. ముందు ఏమి ఏర్పడింది? కారణ దేహం. దానినుంచి సూక్ష్మం. దానినుంచి స్థూలం ఏర్పడింది. స్థూలం ఏర్పడ్డాక ఆ రెండూ ఇందులో కూర్చున్నాయి. నువ్వు సరాసరి సూక్ష్మాన్ని, కారణాన్ని పట్టుకోవడానికి వీలౌతుందా? అది వీలు కాదు. ఈ స్థూల దేహం దగ్గరే మొదలు పెట్టి ఆ రెండింటిని పట్టుకోవాలి. మూడింటినీ నివర్తింపజేయాలి. కాబట్టి దీనిని ఆ రెండూ వున్నాయి. వాటిని ఆశ్రయించి ఇది వున్నది కాబట్టి ఈ వరుసలో మూడింటికీ ఉపయోగపడుతుంది. ఒక్కొక్క దానిని నిరసిస్తూ పోతే, స్థూల దేహం నేను కాదు, సూక్ష్మదేహం నేను కాదు, కారణ దేహం కూడా నేను కాదు, శరీర త్రయ సాక్షిని. ఆ శరీరత్రయ సాక్షిని నేను అనే దానితో మొదలుపెట్టు. ఏమంటున్నాడు? అయితేగానీ, నువ్వు సాక్షివైతే ఇవి వదిలిపెడుతాను అంటే, నువ్వు ఎప్పటికీ అవ్వవూ, ఇవి ఎప్పటికీ విడువవు. నువ్వు ఏం చెయ్యాలంట ఇప్పుడు? నేను ఎవరిని? శరీర త్రయ సాక్షిని. నువ్వు ఏదైనా ఒక అంశాన్ని ప్రతిపాదించావనుకో, అయితే స్థూలదేహంలోదో, లేకపోతే సూక్ష్మదేహం లోదో, లేకపోతే కారణదేహం లోదో అయ్యి వుంటుంది. నేను అవుతుందా? అవ్వదు. ఎందుకని? ఒక్కసారి విచారణ చేసుకో, ఏ సంఘటనైనా సరే, ఏ పనైనా సరే, ఏ ఆలోచనైనా సరే, అయితే స్థూల దేహానికి సంబంధించినది లేకపోతే ప్రాణ మనో బుద్ధులకు సంబంధించినది. లేదంటే ఆనందమయ కోశానికి సంబంధించినది. ఇంతకు మించి ఏదైనా కానిది వుందా? మరి అది నేను కాదు కదా! అని మొదలు పెట్టాలి.
ఈ స్థూల దేహమూ నేను కాదుసూక్ష్మదేహము నేను కాదు, కారణ దేహము నేను కాదు. “నేను ఎవరిని? నేను ఆత్మస్వరూపుడను”. అనే ఈ వేదాంత వాక్య విచారణతో, ఆ ఆలోచనని విమర్శించాలి. అప్పుడేమైంది? అందులో వున్న అహంకారం నిరసించబడింది. అలా చేయమంటున్నాడు. అలా చేస్తే అవి మూడిటికి ఉపయోగమే.
            (స్థితి బేధములతో మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అని పలు విధములుగా అనగా మనోనాశ్‌ అగుటయే ముక్తియనుట.....)
           

చాలా పై విషయము.