File No.13



శరీరం ఎక్కడెక్కడైతే వుందో, ఒక శరీరమే వుందనుకుంటున్నావు కదా! రకరకాల శరీరాలు వున్నాయి. దుఃఖము వుంటుంది. శరీర భావన వుంటే దుఃఖము వుండక తప్పదండి.
అయ్యా! దుఃఖం కలుగుతోంది కదా! దుఃఖం కలగడానికి కారణం ఏమిటి? ఎక్కడ శరీర భావన వుంటే, శరీరం కాదు, శరీర భావన. నేను శరీరం అనే భావన గనుక వుంటే, దుఃఖం తప్పడం లేదు. మరి ఏం చెయ్యాలయ్యా? దుఃఖం వుండకూడదు నాకు. వుండకూడదు అంటే ఏం చెయ్యాలి? శరీర భావన లేకుండా వుండాలి. అది ఎలాగ? అది ప్రశ్న. అందరికి అదే కదా కావల్సింది. జీవులందరికీ ఏముంది? దుఃఖానుభవం వుంది. అది లేకుండా వుండాలి. వేరే ఇంకేమీ లేదు. అసలు ఈ వేదాంతము అంతా ఎక్కడి నుంచి పుట్టింది? ఇదుగో ఈ ప్రశ్న దగ్గర నుంచే పుట్టింది. నీకు అసలు శరీరం ఎందుకు కావలసి వచ్చింది? సుఖపేక్ష వల్లనే శరీరం కావలసి వచ్చింది. దుఃఖ నివృత్తి, సుఖ అపేక్ష. దుఃఖ లేకుండా పోవాలి, సుఖం రావాలి. అనేటటువంటి ఆశ చేత, శరీరం కలిగింది. కలిగినాక ఏమైంది? శరీరం పనిముట్టుగా వుండకుండా, శరీరమే నువ్వు అయిపోయావు. కాబట్టి శరీరమే నేను అనే భావన ఎక్కడుంటే అక్కడ దుఃఖం తప్పదు. మరి ఏం చెయ్యాలయ్యా? శరీరం లేని స్థితి ఏమైనా ఒకటి వుందా? అదేదో చెప్పమంటున్నారు. ఏం చెబుతున్నారు?

            నువ్వు ఏం తెలుసుకోవాలయ్యా? నువ్వు ఏదైతే అయివున్నావో, యథార్థం - యత్‌ అర్థం. ఏదైతే అయివున్నావో స్వరూపం. నీ రూపం ఏదైతే అయివున్నదో, ఆ రెండూ నీ స్థితి ఏదైతే వున్నదో, అది నువ్వు తెలిసి, అలా వుండటమే, విదేహము. అంటే దేహము లేనటువంటిది. కాబట్టి నువ్వు ఇప్పుడు ఎందుకు దుఃఖపడుతున్నావయ్యా? శరీరం నేనుగా వున్నావు కాబట్టి దుఃఖపడుతున్నావు. శరీరం నువ్వు కాదని తెలుసుకుని, ఆ స్థితిలో గనుక వున్నట్లయితే, నీకు దుఃఖం లేదు. అర్థమైందా అండీ? శరీరం నువ్వు కాదు అని గనుక తెలుసుకుని వున్నట్లయితే, నీకు దుఃఖము లేదు. కాబట్టి దుఃఖం కలిగినప్పుడల్లా ఏం విచారణ చేయాలట ముందు? నేను శరీరం కాదు, మరి నేను ఎవరిని? నేను ఆత్మస్వరూపమును. అని వెంటనే సమాధానం రావాలి అక్కడ. రాకపోతే ఊరుకోదు. అది. ఈ answer వచ్చిందనుకోండి, అప్పుడది బలహీనపడిపోతుంది. నేను ఆత్మస్వరూపుడను అనే ఆశ్రయం స్వీకరించినప్పుడు దేహానికి సంబంధించినటువంటి విషయాలన్నీ, క్షీణించి పోతాయి. అలా క్షీణించి, క్షీణించి, క్షీణించి కొంతకాలం అయ్యేటప్పటికి నేను దేహం కాదు అనే దాంట్లో స్థిర పడి పోతావు. స్థిరపడిపోతావు. భావనే ఇది. లేకపోతే ఏమౌతుందంటే. ప్రతివిషయంలో కూడాను, నేను దేహంగా ప్రవర్తించడమే అలవాటు పడిపోయావు. నేను దేహము కాదు అనే పద్ధతిలో కొత్తగా జీవించాలి. ఏ పనైనా సరే, నిద్ర లేవడం దగ్గర నుంచి నిద్రపోవడం దాకా, పుట్టడం దగ్గరి నుంచి చనిపోవడం దాకా, భోజనం చేయడం దగ్గరి నుంచి మానేయడం దాకా. ఏదైనా కావచ్చు. ప్రాణం తీసుకోవడం, గాలి తీసుకోవడం, విడిచి పెట్టడంతో సహా! నేను శరీరం కాదు. నేను ఆత్మ స్వరూపుడను. నీవు ఆత్మ స్వరూపుడవు అని ఏది నిర్ణయిస్తున్నది అంటే, నీ ప్రాణమే నిర్ణయిస్తున్నది. ఎలా నిర్ణయిస్తున్నదయ్యా? అంటే, అది హంస కదా! కాబట్టి సోహం. గాలి తీసుకునేప్పుడు సో....విడిచి పెట్టేటప్పుడు హం’. ఆ రకంగా సోహం సోహం సోహం సోహం సోహం సోహం సోహం అని జరుగుతూ వుంది. జరుగుతూ వున్నప్పుడు నువ్వు వరుసగా చూస్తే ఏమైంది అప్పుడు? సోహం సోహం సోహం..... హంసో హంసో హంసో హంసోహం అని జరుగుతోంది. ఎందుకని గాలి తీసుకోవాలి అంటే మొట్టమొదట నీవు గాలి విడిచిపెట్టాలి కదా! కాబట్టి సోలో మొదలు పెడుతావా? ‘హంతో మొదలు పెడుతావా? ‘హంతోనే మొదలు పెడుతాం మనం. గాలి పూర్తిగా విడిచిపెట్టేస్తేనే కానీ గాలి పీల్చుకోలేవు. కాబట్టి హంసోహంఇదే నాయనా! మంత్రము. ఇంక ఏమీ మంత్రం లేదు. సర్వ జీవులను తరింప చేసే మంత్రం ఏమిటయ్యా అంటే, ఈ హంస మంత్రమే తరింప చేసే మంత్రం. ఈ సత్యం తెలియనటువంటి వాళ్ళు ఎవరైనా సరే, వారు శరీర భావనలోనే వుంటారు. కాబట్టి నీవు శరీరం కాదు అని నిర్ణయం తెలియాలి అంటే, నువ్వు ఎక్కడికో పోవక్కర్లేదు, ఏం చెయ్యక్కరలేదు. నీ యొక్క ప్రాణాన్నే నువ్వు అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకున్నా కూడా, హంసోహం హంసోహం హంసోహం హంసోహం హంసోహం అని జరుగుతోంది. కాబట్టి గాలి విడుస్తున్నప్పుడు హం’, గాలి తీసుకున్నప్పుడు సోఅని నిదానంగా మనస్సుతో ఈ జపం చేస్తూ, “సోహం భావేన పూజయేత్‌” - అంటారు. అంటే అర్థం ఏమిటి? ఈ సోహం భావనలో కనుక నిలకడ చెందిన వాడికి, బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. వేరే ఇంకేం ప్రయత్నం చేసినా లాభం లేదు.
మరి ఆత్మస్వరూపుడను అని ఎందుకు అనుకోవడం?
ఎందుకు అనుకోమంటున్నామంటే, నువ్వు సరాసరి ప్రాణాన్ని గుర్తుపట్టలేవుగా. నువ్వు ప్రాణం గుర్తుపట్టుకోమ్మా! అంటే, నువ్వు ప్రాణం గుర్తుపట్టలేని స్థితిలో వున్నావుగా. బుద్ధి సూక్ష్మత అంతదూరం పోలేదుగా. కాబట్టి ఇంకా విషయాలలోనే తిరగుతోందిగా. విషయాలలోనుంచి ఎవరికైతే, వెనక్కు వచ్చేసిందో, తనను తాను గుర్తించుకోగలిగే సాధన ఎవడైతే చేయగలుగుతున్నాడో, ఇప్పుడు అనుసరించే వాళ్ళు వేరు, సాధకులు వేరు అన్నమాట. అనుసరించే వాళ్ళ పద్ధతి ఏమిటంటే, ఇప్పుడు చెబుతున్న పద్ధతి. ఏదీ నేను ఆత్మ స్వరూపుడనుఅనుకోవడం. విషయసమత్వాన్ని సాధించి, విషయంలో నుంచి వెనక్కి రావడం. అక్కడిదాకా అది ఉపయోగపడుతుంది. ఈ ఆత్మ విచారణ చెయ్యి, అవగాహనతో జీవించు. విషయాల్లోనుంచి వెనక్కి రా ముందు. ఎందుకని విషయాలతో పాటు పోతూ వుంటే, నువ్వు ప్రాణాన్ని ఎట్లా గుర్తిస్తావు? ప్రాణాన్నే గుర్తించలేని వాడివి, మనసును ఎట్లా గుర్తిస్తావు? మనసునే గుర్తించ లేని వాడివి బుద్ధిని ఎట్లా గుర్తిస్తావు? కానీ మనం అందరము ఏమి చేస్తున్నాము? సరాసరి మనసునో, బుద్ధినో, ఏదో చేసేస్తాను అంటావు. ఏమిటి చేసేది? ఏమీ చేయలేవు దానిని. ఎందుకని? నువ్వు తయారు చేస్తే తయారు అవ్వలేదు. సృష్టిలో సహజంగా వచ్చినాయి అవి. అవి సృష్టి ఏర్పడినప్పుడు ఎట్లా ఏర్పడినాయో తెలిస్తే తప్ప, అసలు అది ఎట్లా ఏర్పడిందో తెలిస్తే తప్ప, నువ్వు దానిని అసలు అవగాహన చేసుకునేది ఎట్లా? దానిని ఉపయోగించేది ఎట్లా? అది నీ పనిముట్టు అయ్యేది ఎట్లాగ? ఎక్కడున్నావు నువ్వు? దాని అధీనంలో బానిసలవలె వున్నదానికి బానిసవై వున్నావు. మనసు అధీనంలో ఇంద్రియాలు వున్నాయి. ఇంద్రియాలకు విషయాలు కావాలి. విషయాలకు పనులు కావాలి. పనులకు ఫలితాలు కావాలి. ఎక్కడుంటివి ఇప్పుడు? ఫలితాల దగ్గర వున్నావు. మరి ఎక్కడున్నాయి అవి. మనసుకి ఇంద్రియాలు బానిసలు. ఇంద్రియాలకు విషయాలు బానిసలు. విషయాలకి పనులు బానిసలు. పనులకు ఫలితాలు బానిసలు. వాటికి స్వేచ్ఛ లేదు. పనికి ఫలితం రాకుండా చేయి చూద్దాము. అసాధ్యం. ఏ పని కైనా ఫలితం వచ్చేస్తుంది. ఫలితం దగ్గర వున్నావు. ఎక్కడున్నావు ఇప్పుడు? బానిసలుకు బానిసలకు బానిసలకు బానిస దగ్గర వున్నావు. ఇప్పడు నువ్వు దేనిని ఆశ్రయించావు? మనసును పట్టాలి అంటే, మనసుకంటే పైనున్న దానిని పట్టుకుంటే మనసు పనిముట్టు అవుతుంది. అంతే గాని, ఫలితాన్ని ఆశ్రయించి జీవిస్తూ, మనసును నేను సాధించాలి, మనసును control చెయ్యాలి, మనసును control చెయ్యాలి. ఎట్లా చేస్తావు? ఎట్లా సాధ్యం? ఎక్కడున్నావు అసలు? ఒకసారి విచారణ చేసుకో! అందుకని నాయనా! ఫలిత స్థానంలో ఆలోచిస్తున్నావు. ఫలితస్థానంలో దుఃఖమో, సుఖమో వచ్చినాక విచారణ చేస్తే ఏమిటి ప్రయోజనము? అంతా వచ్చేసినాక చేస్తే ఏమిటి ప్రయోజనము? మా అబ్బాయి నన్ను కొట్టాడండి, తిట్టాడండి. ఓహో! అలాగా? తరువాత ఏం చేశావు? దుఃఖించానండి. ఏమిటి ప్రయోజనము? దుఃఖించినాక విచారణ చేశానండి. అది దాని వలన ఇంకా ప్రయోజనం ఏమిటి? విచారణ చేస్తివి పో! పోనీ ఈ సారి ఏమైనా కానీ, ఇంకోసారి చేసేటప్పుడు ముందు చేశావా విచారణ? ముందు చేయలేదండి. అయిపోయినాకే చేశానండీ విచారణ. ఏమిటట ప్రయోజనం? ప్రయోజన శూన్యం కదా! ఎందువల్ల అంటే, నువ్వు ఫలితం చేత లాగ బడుతున్నావు. ఆకర్షించబడుతున్నావు. ఆ ఫలితం మీద అపేక్ష చాలా వుంది. ఎందువల్ల? నేను చేస్తున్నాను, ఫలితం బాగుండాలి. దానికి కారణం ఇది. శరీర భావనతో చేయడంలో, వున్నటువంటి పెద్ద దుర అలవాటు ఏమిటంటే, ఈ సృష్టి అంతా పరమాత్ముడే నియమించి, ఆధారంగా వుంటే, మధ్యలో నేను ఒకడిని వచ్చాను. నేను ఒకడిని వచ్చి, నేను చేశా కాబట్టి ఏమైనా సరే ఇది బాగుండాల్సిందే. అర్థం వుందా? నువ్వు చేయడం ఏమిటి మధ్యలో, రైలంతా బండిలో ప్రయాణం చేస్తున్నారండీ! ప్రయాణీకులంతా, రైలు ప్రయాణం వెళ్ళిపోతోంది. (నేను) ప్రతివాడు ఎవడికి వాడు ఏమనుకుంటున్నాడు? నేను ప్రయాణం చేస్తున్నానండి. వాడే రైలును నడుపుతున్నాడు అనుకుంటున్నాడు. అర్థం వుందటండీ! రైలు వెళ్ళి పోతోంది. వెళ్ళిపోయే రైలులో నువ్వు వున్నావు. ప్రవాహ వేగంతో పరిణామం చెందుతున్నటువంటి, సృష్టిలో నీవు వున్నావు. సృష్టి పరిణామం చెందుతూ వుంది. అందులో భాగంగా నువ్వు పరిణామం చెందుతూ వున్నావు. నేను జీవించాను అంటావేమిటి మధ్యలో? అర్థముందా ఏమైనా?

సృష్టిలో భాగంగా నీ శరీరం వచ్చింది. సృష్టితో సమానంగా అది పరిణామం చెందుతూ వుంది. మరి మధ్యలో నేను పుట్టాను. నేను అది చేశాను. నేను ఇది చేశాను. నేను పోయాను. అంటావేమిటి? అది అంతా ఎందులో భాగం? సృష్టిలో భాగం కదా! మరి సృష్టి దృష్ట్యానే కదా! చూడాల్సింది. ఎందులో వున్నావు ఇప్పుడు? సృష్టిలోనే కదా వున్నావు. మరి సృష్టి దృష్ట్యా ఒకసారి విచారణ చేసి చూడు. నేను ముప్ఫై యేళ్ళు ఉద్యోగం చేశాను, నేను ఏదో మూడు బిల్డింగులు కట్టాను. ఏదో ముప్ఫై బిల్డింగులు కూల్చాను. లేకపోతే మూడు పెళ్ళిళ్ళు చేశాను. లేదా ముప్ఫై పెళ్ళిళ్ళకు వెళ్ళాను. ఇదేగా నువ్వు చెప్పేది, ఎంతసేపు చెప్పినా? జీవితం అంతా చేసింది ఏమిటి? ఈ పనే కదా! ఏమిటట దాని వల్ల, దేహ భావంతోనే కదా చేశావు. చేసిన పని అంతా ఏ భావనతో చేశావు? దేహ భావనతోనే చేశావు. మరి అటువంటప్పుడు ఇంక సమస్యేమి వుంది? అదే పెద్ద సమస్య అసలు. కాబట్టి అన్నిటికీ మూలం, అన్ని పరిణామాలకి, అన్ని దుఃఖాలకి, అన్ని పాఠాలకి మూలమైనటువంటి సమస్యను పరిష్కరింప జేస్తేనే కానీ, ఇది ఈ సమస్య పరిష్కారం అవ్వదు నాయనా! నువ్వు ఏదో ఒక్కొక్కటి పట్టుకుని, ఒక్కొక్కటి పట్టుకుని, దీనికి కారణం ఏమిటి? దీనికి కారణం ఏమిటి? అని అడిగితే, ఇన్ని కారణాలు లేవు. అసలు ఏమి చేస్తున్నాము? పుట్టి బుద్ధి ఎరిగిన దగ్గరనుంచి, సొంత బుద్ధి వచ్చినప్పటినుంచి, ఇది ఎందుకు చెయ్యాలి? దీనికి కారణం ఏమిటి? అన్నిటికీ కారణం ఒకటే. నువ్వు శరీరం అనుకోవడమే పెద్దకారణం. అసలు ఆ కారణాన్ని పరిష్కరించు. అది పరిష్కరిస్తే అన్నీ పరిష్కారం అయిపోతాయి. కాబట్టి, నీలో జరుగుతున్నటువంటి ప్రాణం ఏదైతే వున్నదో, అదే అజపా గాయత్రి. ఆఁ.. ఈ సోహం జపమే, అజపా గాయత్రి. ఈ జపం చేయకుండా, జపమాలతో పని లేకుండా చేసేటటువంటి అజపాగాయత్రి ఏదైతే వున్నదో, ఈ అజపాగాయత్రి తెలిసినవాడే నిజమైన బ్రాహ్మణుడు. అర్థమైందా అండీ! ఈ అజపా గాయత్రిని తెలుసుకోవడం కోసమే, సంధ్యావందనం చేసేది. కారణం ఏమిటంటే, ఈ అజపా గాయత్రి ఇడా, పింగళ, సుషుమ్నా అనే నాడుల ద్వారా పనిచేస్తూ వుంటుంది. అది సంధ్యాకాలంలో అంటే, అటు ఉదయం, ఇటు రాత్రి మధ్యలో, సూర్యోదయం, సూర్యాస్తమయం. అపరాహ్నం, మధ్యలో. మళ్ళా  నిశి రాత్రి. అంటే 6 - 12, 6 -12 అన్నమాట. ఉజ్జాయింపుగా. ఒక పావుగంట అటు ఇటుగా. ఇది సంధ్యాకాలం. ఈ సంధ్యాకాలంలో, ఈ హంస సుషుమ్నానాడిలో ఒక క్షణం పాటు కొట్టుకుంటుంది. ఆ క్షణంలో, కరెక్టుగా ఉదయ సంధ్య సమయంలో, మధ్యాహ్నం సంధ్య, సాయంత్రం సంధ్య, నిశిరాత్రి సంధ్య. ఇట్లా నాలుగు వున్నాయి. ఈ నాలుగు కాలాలలో, ఒక రెప్పపాటు కాలంలో, ఈ హంస సుషుమ్నా నాడిలో కొట్టు్కుంటుంది. ఇది ప్రతి జీవికి కొట్టుకుంటుంది. నాలుగు సంధ్యలలో కొట్టుకుంటుంది. శ్వాసించే ప్రతి జీవికి కూడా, ఇది సుషుమ్నానాడిలో కొట్టుకుంటుంది. మనిషికి బుద్ధి వుంది కాబట్టి, దీనిని తెలుసుకోగలిగే అవకాశం వుంది. మిగిలిన జీవులకు ఆ అవకాశం లేదు. కాబట్టి, మనిషి గొప్పతనం ఏమిటయ్యా అని అంటే, శరీరం నేను కాదు అని జీవించగలిగే సామర్థ్యము మానవ ఉపాధికి వుంది. కానీ జంతువులకు ఆ శక్తి లేదు. జంతువుకి శరీరమే సత్యంగా జీవించ వలసిందే అది. మానవ ఉపాధికి ఒక్కదానికే, ఆ అర్హత వుంది. ఇది తెలుసుకుంటే ఏమిటయ్యా ఉపయోగం అంటే, సృష్టి రహస్యం తెలుస్తుంది నాయనా! నీకు. ఈ సృష్టి ఎట్లా ఏర్పడింది? అందులో భాగంగా నీ శరీరం ఎట్లా ఏర్పడింది? అందులో భాగంగా నీకు ఇంద్రియాలు ఎట్లా ఏర్పడ్డాయి? అందులో భాగంగా నీకు ప్రాణం ఎట్లా వచ్చింది? అందులో భాగంగా నీకు మనసు ఎట్లా వచ్చింది? అందులో భాగంగా నీకు బుద్ధి ఎట్లా వచ్చింది? అందులో భాగంగా నువ్వు ఎట్లా వచ్చావు? నువ్వు లేకుండా ఎట్లా పోతావు? ఆ శరీర భావం లేకుండా ఎట్లా పోతుంది? అంటే, శరీరంలో వుండి, శరీరం నేను కాదు అనే స్థితిలో ఎట్లా వుండాలో తెలుస్తుంది. ఇదే నాయనా! ముక్తి అంటే. ఇంతకు మించి వేరే ఏమీ లేదు. ఇక నువ్వు ఎన్ని వేదాలు తిరగేసినా, ఎన్ని ఉపనిషత్తులు తిరగేసినా... అందుకే ఆ ప్రశ్న దగ్గర మొదలు పెట్టింది. నాయనా! వేదములలో చెప్పబడినట్లుగా.. నువ్వు అన్నీ వేదములలో చెప్పబడినట్టే చేస్తున్నానంటున్నావుగా, మేం వైదికుల మండీ. ఏం చేసినా, ఏమిటి? షోడశకర్మలు చేశావు. నామకరణం నుంచి జాతాశౌచం నుంచి మృతా శౌచం దాకా. ఏమిటట ఇప్పుడంతా ఎవరిని పిలిచావు? ఆ వేదం చదువకున్నవాడిని, మంత్రాలు చదువుకున్నవాడినే కదా పిలిచావు. ఇవన్నీ చేసేవాళ్ళు అందరూ వేదాన్ని ఆశ్రయించే జీవిస్తున్నారు అంటున్నావు కదా! ఆ వేదం అంతా ఏమి చెబుతోంది? శరీరంలో వుండి, శరీరంలో వుంటూ నేను శరీరం కాదుఅనే స్థితిలో జీవించమని చెబుతోంది ఆ వేదం. కానీ నాకు ఏం చేతకావడం లేదు? శరీరం నేనుగానే వుండటం అలవాటు అయిపోయింది. అర్థమైందా అండీ! కాబట్టి ఏం చెప్పారు ఆయన ఇప్పుడు? నాయనా! ఇందులోనుంచి ముక్తి ఎట్లాగా? అంటే, నీ యథార్థ స్థితి ఏమిటో నీకు తెలియాలి. నీ స్వరూపం అంటే ఏమిటో నీకు తెలియాలి నాయనా! తెలిస్తే తప్ప... నీకు తెలిసిందేమిటి? నీకు శరీరం ఒకటే తెలుసు. నీ యథార్థ స్థితి తెలియదు. అది తెలిస్తే కానీ, ఇది వదలదు. ఇది వదిలితే గాని, అది తెలియదు అంటున్నావు. అంటే అర్థం ఏమిటి ఇప్పడు? ఆటలు మరిస్తే కానీ, చదువు రాదు. చదువు వస్తేనే గాని, ఆటలు మరువవు. మరి ఏం చెయ్యాలి ఇప్పుడు? ఏం చేశావు నీ పిల్లాడిని? (ముందు ఆటలు మరువాలి) ఆటలు ఎట్లా మరుస్తాడు, మరువడుగా. (చదువే అలవాటు చేయాలి) ఆఁ.. అంటే రోజంతా ఆటలు ఆడేటప్పుడు, ఒక గంట చదువు. మళ్ళా ఏం చేశావు? రెండు గంటలు చదువు. అట్లా చదువుని పెంచుతూ, ఆటలు తగ్గిస్తూ వచ్చావు. కొంతకాలం అయ్యేటప్పటికి స్కూల్‌ లో చదువుతూ వున్నాడు. ఆటలు కూడా ఆడాడు. కాలేజికి వెళ్ళాడు ఇప్పుడు. కాలేజీకి వెళ్ళాక ఏమైంది? ఆటలు పూర్తిగా తగ్గినాయి. పోలేదు. పూర్తిగా తగ్గినాయి. చదువు పూర్తిగా ధ్యాస నిలబడింది. యూనివర్సిటీకి వెళ్ళాడండి. అప్పుడేమయ్యింది? పూర్వం ఆటంతా పోయింది. పోయి ఏమి వచ్చింది ఇప్పుడు? చదువులానే ఆట వచ్చేసింది. చదువునే ఆటగా మలచుకోగలిగే సామర్థ్యం వచ్చేసింది.  Ph.D. చేశాడండి. ఇప్పుడేమయ్యింది? ఆ చదువులో వున్నా ఆట నైపుణ్యం అంతా కూడా, ప్రపంచానికి ఉపయోగపడే సామర్థ్యంలోకి మారాడు. అది కదా! Ph.D. అంటే అర్థం. మన విజ్ఞానాన్ని వెళ్ళడి చేసి, ప్రపంచానికి కూడా ఉపయోగపడే సామర్థ్యము. Ph.D. కూడా అయిపోయిందండి, scientist అయ్యాడండి. ఏం చేశాడు ఇప్పుడు? ఆ.. ఆఁ.. ఎంతసేపు పాతదేనా? ఈ సృష్టిలో ఇంకేమీ కొత్తది లేదా? అని కొత్తది కనుకున్నప్పుడు scientist అయ్యాడు. అయితే ఏమిటట ఉపయోగం? ఆ కొత్తదానిని కనుకున్న తరువాత అదిమానవాళి మొత్తానికి ఎట్లా ఉపయోగపడుతుంది? ఈ ప్రపంచం మొత్తానికి ఎట్లా వుపయోగపడుతుంది? సమస్త మానవాళికి ఉపయోగపడేది ఎట్లాగో, నూతనమైనదానిని ఆవిష్కరింపజేశాడు. ఆ సిద్ధాంతం ద్వారా. అప్పుడు ఏమైంది? మొత్తం మానవాళికి ఉపయోగపడింది. అయితే ఏమైందట? మరి ఇప్పుడిలా వెడుతున్నాడా లేదా? మరి ఇప్పుడు ఇలా వెళ్ళినవాడిని నువ్వు, గొప్పవాడు అని అంటున్నావుగా. నీకు తెలిసిన చదువుకున్న వాళ్ళందరిలోకెల్లా గొప్పవాడు ఎవడు? వీడు. Scientist. ఏదైతే, నూతనమైన ఆవిష్కరణలు చేసి, సమస్త మానవాళికి ఉపయోగపడే సామర్థ్యాన్ని పొందాడో, వాడయ్యా గొప్పవాడు అంటున్నావుగా. మరి ఇప్పుడు వాడు దేహ భావనతోనే చేశాడా ఆ పని అంతా? చెయ్యలేదుగా. దేహభావనతో చేస్తే చదువు వస్తోందా? రావడం లేదుగా. ఏం చేస్తున్నాడు? ఆటలు ఆడుతున్నాడు. (మరి దేహభావన లేకపోతే ఆత్మ భావన వున్నవా వాడికి) ఆత్మభావన సంగతి పక్కన పెట్టు. వాడు ముందు దేనిని మరిచాడు? ఆటలని మరిచాడు. కదా! ఆటలే కదా! మనం ఆడుతోంది, జీవితాంతం మనం ఏం ఆడాము? ఆటేగా. ఇప్పుడు ఏమి మరువమంటున్నాడు? ఈ ఆట మరుస్తూ, ఆ చదువు నేర్చుకో! వాడిని ఎట్లా చదువు నేర్చుకుని సైంటిస్ట్‌ అవ్వమంటున్నావో, నువ్వు ఏం చెయ్యాలి? “పిల్లలాటల పోలికాయెను” - ఇంద్రియాలతో, విషయాలతో ఆటలు ఆడడం మొదలు పెట్టావండి, మనో వికాసం, బుద్ధి వికాసం కోసం. కానీ, మనో వికాసం, బుద్ధి వికాసం రావడం మొదలవ్వగానే, ఏం చేశావు? ఆ ఆటలే సత్యంగా వున్నావు. ఆ ఇంద్రియాలు, విషయాలే సత్యంగా వున్నావు. ఆ సత్యంగా వున్నప్పుడు ఆ పనులే చేస్తూ వున్నావు. ఆ ఫలితాలే వస్తూ వున్నాయి. కొత్త ఫలితము ఏమీ లేదు. అయితే సుఖమో, లేకపోతే దుఃఖమో. ఆ ఫలితంలో రెండే వున్నాయి. అయితే సుఖం, లేకపోతే దుఃఖం. ఫలితం ఏమన్నా మారిందా? ఆట మారినా ఫలితం ఏమన్నా మారిందా? మారలేదు. ఆలోచన మారినా ఫలితం ఏమన్నా మారిందా? మారలేదు. ప్రయత్నం ఏమన్నా మారినా ఫలితం ఏమన్నా మారిందా? మారలేదు. కాబట్టి దీనిని బట్టి ఏం తేలింది? మూల కారణం మారడం లేదు. ఫలితం మారడం లేదు. ఎందుకని? మూలకారణంలో శరీరం నేనుగా వున్నాను. ఫలితంలో సుఖమో, దుఃఖమో వుంది. ఈ మధ్యలో వున్నదాంట్లోనే, ఆటలోనే, ప్రయత్నంలోనే తేడా వుంది. మరి ఇప్పుడు మనం అంతా ఏం చెయ్యాలి అసలు? ఎక్కడున్నాము మనం? ఫలితం దగ్గర వున్నాము. దేనిని ఆశ్రయించాలట ఇప్పుడు? మధ్యలో వున్నవాటిని ఎందుకు ఆశ్రయిస్తావు? ఇప్పటి వరకూ ఏం చేశావు? ఈ ఆట కాక పోతే, ఆ ఆట ఆడి చూద్దాము. ఈ ప్రయత్నము కాకపోతే, ఆ ప్రయత్నము చేసి చూద్దాము. ఇది కాకపోతే అది చేద్దాము. దుర్గమ్మ గుడికి కాకపోతే, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళివద్దాము. కొబ్బరి కాయ ఒక కొబ్బరి కాయ కాకపోతే 108 కొబ్బరి కాయలు కొడదాం. మెట్ల పూజ కాకపోతే, నవావరణ పూజ చేద్దాము. ఇవన్నీ ఏమిటి? మధ్యలో వున్నవి ఇవి. మూలకారణం కాదు. అవన్నీ చేసేటప్పుడు, మూలకారణ అయినటువంటి నువ్వు శరీరంగా వున్నావా? నువ్వు ఆత్మగా వున్నావా? అది చూసుకో మొట్టమొదట. చేసేటప్పటికి ఏమయ్యావు? మెట్ల పూజ. ఎందుకు చేశావు? మా అబ్బాయికి IIT వస్తే నేను మెట్ల పూజ చేస్తాను. IIT కి మొట్ల పూజకు ఏమన్నా సంబంధం వున్నదా? వాళ్ళు సరిగ్గా చదివితే, సరిగ్గా పరీక్షరాస్తే, వాడికి సరిగ్గా తెలివి వుంటే, వాడికి సరిగ్గా అజ్ఞానం లేకుండా వుంటే, వాడు చదువుకోవాల్సిన పరిస్థితే గనుక వుంటే, వాడికి అంత వికాసం వస్తే, (ఆ మెట్లపూజ మహిమ వీడి మైండ్‌లో చొరబడి) .... ఏమిటి చొరబడేది? ఇదంతా భ్రాంతేగా. నీ brainలోకి ఏం చొరబడిందేమిటి? ఇంత చేశాను అంటున్నావు కదా! నీలోకి ఏం చొరబడింది? నీలోకి చొరబడడం కుదరని విధానాన్ని, వాడిలోకి ఎట్లా చొరబడుతుంది? ఒకసారి ఆలోచించండి. అర్థం వుందా ఏమైనా? నువ్వు ఇంతకాలం చేశానంటున్నావే, నీలో ఏం చొరబడిందని నువ్వు గుర్తించగలిగావు? నీలోకి చొరబడిందా? ఏదీ చూపెట్టు? ఆ చొరబడడమే కనుక సత్యమే అయితే, నీకు ఎప్పుడో ఈ శరీర భావం పోవాలిగా. పోలేదుగా. (ఆ ఫలితం రావాలని చేశాము) అవునమ్మా! రాలేదు కదా! నువ్వు అన్నది అక్కడ ఎప్పుడూ రాలేదుగా. వచ్చిందని ఒక్కశాతంతోటే వచ్చిందని సంతృప్తి పడ్డావు. అది 100 శాతము ఎప్పుడూ రాలేదు. ఒక శాతం మాత్రమే వస్తుంది, ఎప్పుడు వచ్చినా. ఆ ఒక శాతం ఎట్లా వచ్చింది? ప్రకృతి ధర్మంగా సృష్టి పరిణామంలో ఎలా రావాలో, అలా వచ్చింది. (అట్లా అనుకోవడం లేదు, ఆ దైవమే వచ్చింది అనుకుంటున్నాము) ఏమయ్యావు అప్పుడు? భ్రాంతికి లోనైపోయావు. ఎందువల్ల? అసలు మూలకారణంలోనే భ్రాంతి వుందిరా బాబు. నువ్వు ఆ పని మొదలు పెట్టేటప్పుడే శరీర భావంతో మొదలు పెట్టావయ్యా బాబు. అర్థమైందా అండీ!

నా మనవడికి ఆరోగ్యం రావాలి అంటే, నేను ఇప్పుడు అమ్మవారికి అట్లుపోయాలి. అర్థం వుందా ఏమన్నా? అమ్మవారికి అట్లు పోయడానకినూ మనవడికి సంబంధం ఏమన్నా వుందా? ఇలా రకారకాల వాళ్ళున్నారు. రకరకాల అనేక అంశాలు వున్నాయి. ఇవన్నీ నువ్వు చేశావు, ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఏముంది? ఇదేగా, ఈ గోలే కదా! ఇంతకు మించి ఏమన్నా వుందా? కాబట్టి ఒక్కసారి విచారణ చెయ్యి. మూల కారణాన్ని విచారణ చెయ్యి. ఫలితం మీద అపేక్షను విడిచిపెట్టు. అంటే నువ్వు ఇప్పుడు రెండు పనులు చేయాలన్నమాట. ఏమిటి? “మూలకారణం ఏమిటి? శరీరమే నేను అనే భ్రాంతితో చేస్తున్నాను. అసలు అజ్ఞానానికి అంతటికీ మూల కారణం ఇది”. దుఃఖానికి కాని, సుఖానికి కానీ మూలకారణం ఇది. పోతే రెండూ పోతాయి. ఒకటి పోయి ఒకటి వుండదు. అంటే అర్థం ఏమిటి? దుఃఖం పోతే, దుఃఖంతో పాటు, సుఖం కూడా పోతుంది. ఏముంటుందయ్యా? కదలకుండా వుండే స్థితి వుంటుంది. ఆనందం వుంటుంది. మనం ఇప్పటి వరకూ ఆనందం అంటే, ఎగడపు, దిగడపు పడిపోయి నవ్వుకోవడమే ఆనందము అని అందరి అభిప్రాయము. అబ్బే! అసలు ఆనందం అంటే అది కాదు. కదలకుండా వుండడం. గాఢ నిద్రావస్థలో నువ్వు ఏ స్థితిలో వున్నావు? కదలకుండా వున్నావు. నీలో వున్నటువంటి నేను, ఏ స్థితిలో వున్నాడప్పుడు? ఆనందంగా వున్నాడు. కారణం ఏమిటి? ఆనందమయ కోశ పరిధిలో వున్నాడు కాబట్టి, ఆనందంగా వున్నాడు. అతన్ని ఏదైనా గానీ కదల్చగలదా అప్పుడు? ఏదీ కదల్చలేదు. మనసు గాని, బుద్ధిగాని, ఇంద్రియాలు గాని, విషయాలు గాని, నీ అప్పులు గాని, నీ పోలీసు కేసులుగాని, నీ అనారోగ్యం కానీ, నీ వికలాంగత్వం కూడా నిన్ను ఏమీ చేయజాలదు. (నిద్రలో ఏదో ఊరికే ఆనందమే కానీ, ఇంత వివరణ కూడా తెలియదు) అది వేరే విషయం. కానీ గాఢ నిద్రావస్థలో నువ్వు ఏ స్థితిలో వున్నావు? వీటి వలన ఏ రకమైనటువంటి చలనము లేకుండా వున్నావు. కాబట్టి ఆనందం అంటే నిర్ణయం ఏమిటంటే, సుఖ దుఃఖ చలనము లేని స్థితే ఆనందము. సుఖ దుఃఖములనే కదలిక లేకుండా వుండడమే ఆనందము. సుఖ దుఃఖములు అనే కదలిక వుందీ... (అప్పుడు ఆనంద స్థితి కాదు).
ఉదాహరణ చెప్తా. ఇప్పుడు గుడ్డివాడు వున్నాడండి. వాడికి కళ్ళు లేవు కదా! నిద్రపోతున్నాడు. గాఢ నిద్రవస్థలో వాడు కళ్ళు వున్నవాడా? కళ్ళు లేని వాడా? (నిద్రపోతున్నప్పుడు మనకు ఎంతో వాడికీ అంతే!) కాదు. నీకు వాడికీ కూడా కొంచెం తేడా వుంది. నువ్వు మామూలుగా మెలకువలో కళ్ళు ఉపయోగిస్తున్నావు. కళ్ళు మూసేసుకుని నిద్రపోయాను అనే స్థితిలో వున్నావు. వాడు కళ్ళు తెరచినా, తెరువకపోయినా, చూసినా, చూడక పోయినా మెలకువలో కూడా ఒకటే కదా! కానీ నిద్రావస్థలో... అసలు కళ్ళుగా పనిచేస్తన్నది ఏది? మనస్సు కదా! అంతేనా? ఇప్పుడు మనసు ఏం చేస్తోంది? మనసు నిద్రపోతోంది. నిద్రపోయే ముందు మరి కల కంటోంది కదా! ఆ కల కన్నప్పుడు, ఆ కళ్ళు వున్నవాడు ఎలా వుంటాడో, వాడు అలానే వుంటాడు. కాబట్టి మనసు స్థితిలో అన్ని ఇంద్రియాలు వున్నాయి. మనసు స్థితిలో అన్ని ఇంద్రియాలు వున్నాయి. స్థూలంలో, శరీరంలో కొన్ని ఇంద్రియాలు లేకపోయినా, మనస్సు స్థితిలో, అన్ని ఇంద్రియాలు వున్నాయి. మనస్సుకి వాడి కలలో.. కలలు కనపడుతాయా? (ఆ..). నువ్వు ఎలా కలగంటావో, వాడు అలాగే కలగంటాడు. ఏ భేదం లేదు అక్కడ. నువ్వు ఎలా చూస్తున్నావో, వాడు అలానే చూస్తాడు. నువ్వు ఎలా అనుభవిస్తావో వాడు అలానే అనుభవిస్తాడు. ఏ భేదమూ లేదు. నీకు ఎట్లా కల వస్తుందో, వాడికి అట్లాగే వస్తుంది. (బయటకు వచ్చిన తరువాత మళ్ళీ వాడికి కనబడదు) అంతే! అంతే తేడా. అట్లాగే, ఒక కాళ్ళు లేని వాడు వున్నాడండి. కల కనేటప్పుడు ఎలా వున్నాడు? పరుగెడుతూనే వుంటాడు మామూలుగానే. అయ్యో! నాకు కాళ్ళు లేవే, నేను పరుగెత్తలేనే అనే తెలివి వుండదు అక్కడ. ఇప్పుడు మనసులో అన్ని ఇంద్రియాలు వున్నాయా లేవా? అన్ని ఇంద్రియాలు వున్నాయి. అర్థమైందా అండీ ఇప్పుడు? కాబట్టి, అసలు నువ్వు ఈ శరీరాన్ని ఏమని పట్టుకున్నావు ఇప్పుడు? నీకు సుగర్‌ వ్యాధే వచ్చింది అనుకోండి, లేదూ బీపీ నే వుంది అనుకోండి. మనసు లోపలికి వెళ్ళేటప్పటికి ఏమైంది? మనసుకి, సుగర్‌ వ్యాధి, బీపీ వ్యాధి వుందా? లేదుగా. ఏం చేసింది? ఒక్క స్థితి అవతలకు దాటగానే, నీ వ్యాధులన్నీ ఇక్కడే వదిలేసింది. నీ వ్యాధులన్నీ ఎవరివి? ఇంద్రియాలవి. అక్కడే వదిలేసింది అంతే. ఎందుకని? నాకు నీ వ్యాధులతో పని ఏముంది? మనసే చెప్తోంది స్పష్టంగా. నీ వ్యాధులతో నాకు ఏమీ పని లేదు. నేను సహజంగా స్వేచ్ఛగా వున్నాను. నీకు కాళ్ళు నొప్పులు అయితే, దేహానికి కాళ్ళు నొప్పులు, మనసు కలలో పరుగెత్తడం లేదా? పరుగెడుతున్నావు. ఇలలో పరుగెట్టు... పరుగెత్తలేవు. అర్థమైందా అండీ!
            కలలో పరుగెత్తలేదా? పరుగెత్తకలుగుతోంది. ఎందుకు పరుగెత్తగలుగుతోంది? నీకు ఈ ఇలలో దేహంతో వున్న ఏ లక్షణాలు కూడా అక్కడ, మనసు స్థితిలోనే లేవు. మనసు స్థితిలోనే లేకపోతే, దాని అవతల వున్న స్థితిలో ఎక్కడ వున్నాయి? కాబట్టి ఇప్పటి వరకూ నువ్వు దేనిని ఆశ్రయించావు? మనసుని కూడా ఆశ్రయించలేదు. నువ్వు సరిగ్గా తెలుసుకోలేదు నాయనా! ఆ ప్రాణాన్ని సరిగ్గా తెలుసుకోలేదు. ఎందుకని? ప్రాణాన్ని తెలుసుకుంటే హంస స్వరూపం అన్నా తెలిసేది. సోహం భావేన పూజయేత్‌. ఆ సోహం సోహం అంటే ఏమిటో తెలిసేది. అదీ తెలియలేదు. పోనీ మనసు తెలిసిందా? అదీ తెలియలేదు. పూజలు చేశావు, తపాలు చేశావు, యజ్ఞాలు చేశావు, యాగాలు చేశావు, ధ్యానాలు చేశావు, అయిపోయింది ధ్యానం కూడా చేసేశావు. ఆఖరి ప్రయత్నం అదే ఇక. ఇక తరువాత ఏం లేదండి. ఎంతమంది మహానుభావులు చెప్పినా, ఆఖరి ప్రయత్నం ధ్యానమే. ధ్యానం కూడా చేసేశానండి. ఏం తెలిసింది ఇప్పుడు? ఆఁ... ఇది కరెక్టుగా చెప్పారు. అంటే మెలకువలో కూడా కొంచెం సేపు నిద్రపోయే అవకాశం వచ్చింది. అర్థమైందా అండీ! మామూలుగా నిద్ర ఎలాగూ పోతున్నాము. కానీ మెలకువలో కూడా, మళ్ళా కాసేపు కల్పిత నిద్ర, (అది నిద్రలాగా కూడా వుండదు కదా!) కల్పిత నిద్ర కదా మరి. మామూలు నిద్ర అయితే, మునిగిపోతావు. ఇది కల్పిత నిద్ర కదా! నీకు నువ్వే కల్పించుకున్నావు. కాబట్టి కల్పిత నిద్రగా వున్నావు. ఒక నూలుపోగె తెరంత మెలకువ వుంటుంది. మిగిలినవన్నీ మునిగిపోతాయి. (బానే తెలుస్తుంటాయి ధ్యానంలో) అది వేరే అంశం. ఇంకా సాంతం బయిటే వున్నప్పుడు. గాఢ ధ్యాన స్థితిలో వున్నప్పుడు, బయట సంగతి వినపడుతుంది గానీ, స్పందించవు. తెలుస్తుంది కానీ స్పందించవు. ఎందుకని? ఒక నూలు పోగు అంత తెలివే బయటకు వుంటుంది కాబట్టి. అది కూడా లేకపోతే, పూర్తిగా సమాధి నిష్ఠ. అయితే ఎన్ని పేర్లు పెట్టుకున్నా, ఏం అవుదామని ఇప్పుడు? నేను శరీరం కాదు అనే పద్ధతిలో చేయడం నేర్చుకో. ఈ పనులన్నింటిలో. ధ్యానం చేశావు, నేను శరీరం కాదు. శరీరం నేను కాదయ్యా బాబు. అప్పుడు నువ్వు ధ్యానంలోకి వెళ్ళే ముందు వస్తున్నటువంటి అన్ని ఆలోచనలకి, ఈ సమాధానం చెబుతూ వుండు. ప్రతీ ఆలోచనకి ఈ సమాధానం చెప్పుముందు. నేను శరీరం కాదు, అనంగానే ఏమడుగుతుంది? మరి నువ్వు ఎవరవు అని అడుగుతుంది వెంటనే. ఆ మనసు వూరుకోదండి. వెంటనే ఏమంటుంది? నేను శరీరం కాదు అని నువ్వు అనంగానే ప్రయత్నం చేసి, నువ్వు ఎవరివి? అని అడుగుతుందండి. నేను ఆత్మస్వరూపుడిని. అయితే ఇది Tally అవ్వడం లేదు పో అంటుంది. నువ్వు ఆత్మస్వరూపుడివి అయితే, నువ్వు చేసే, ఈ ఆలోచన, ఈ విధానం tally అవ్వడం లేదు, నువ్వు చేయడానికి వీలుకాదు పో అంటుంది బుద్ధి వెంటనే. (ఈ ఆత్మతో మాట్లాడినప్పుడు లోతుగా వుంది, మనసు పైపైనగా వుంది) అంతేగా మరి. ఇది విషయాలు కదా! నీకు ఇక్కడ ఏమున్నాయి? బుద్ధిలోనే అన్నీ, ఇవన్నీ! నీ బుద్ధి ఏం చెప్పింది వెంటనే? నేను ఆత్మస్వరూపుడు అని చెప్పగానే, ఏమంటుంది వెంటనే, నువ్వు చేయబోయే పని దానికి సరిపోవడం లేదు, చేసే విధానం భావన సరిపోలేదు అంటుంది. ఎందుకని? నీ దగ్గర వున్న జ్ఞాపకాలన్నీ, శరీర పద్ధతిగానే వున్నాయి జ్ఞాపకాలన్నీ. ఆత్మపద్ధతిగా ఏమైనా జ్ఞాపకాలు వున్నాయా? లేవు. ఇప్పుడేగా పోగేస్తున్నావు. కాబట్టి, ఆత్మానుసార జీవితం జీవించడం ప్రారంభించాలి. ఇట్లా జీవించడం మొదలుపెడితే ఏమైంది? అప్పుడు? దేనినైనా తోసిరాజు అనగలిగావు. దానికి అడ్డం ఏదీ లేదు. ఎందుకని? నేను ఈ శరీరంలోకి వచ్చిందే దాని కోసం. అర్థమైందా అండీ! నువ్వు ఆత్మజ్ఞానం తెలుసుకోవడానికి, వీలు లేదు. ఒక ఆన్సర్‌ వెతికించామండి. ఎవరినైనా ఆపు చూద్దాం. ఆపగలవా? అసాధ్యమే. అరచేతి అడ్డం పెట్టి సూర్యోదయాన్ని ఎట్లా ఆపుతావు? అది అసాధ్యం కదా! అది ఎంత అసాధ్యమో, ఇది అంత అసాధ్యం నాయనా! ఎందుకని? ఇప్పుడు అనుకుంటున్నావు, ఆత్మదృష్ట్యా చూస్తే, నువ్వు ఈ శరీరానివి, ఇప్పుడు జన్మించావు, ఇప్పుడు జీవించావు, ఇప్పుడు వదిలేశావు. ఆత్మ దృష్ట్యా అవి అన్నీ నామమాత్రం. ఎన్ని శరీరాలు తీసుకున్నా, ఎన్ని శరీరాలలో జీవించినా, ఎన్ని శరీరాలు విడిచిపెట్టినా, నీ గమ్యం ఎప్పటికైనా ఆత్మజ్ఞానమే. కుండబద్ధలు కొట్టినట్టు చెబుతోంది అందుకే. వేదాంతం. కాబట్టి నువ్వు నిజజీవితంలో జీవించేటప్పుడు, శరీరంలో జీవించేటప్పుడు, నేను శరీరం కాదని జీవించవయ్యా!

అప్పుడే ముక్తి సాధ్యం అవుతుంది. తరువాత చదవండి.
            “తన యథార్థ స్వరూపమును విచారించి... “ అది, ఆన్సర్‌లోనే ప్రశ్న వేశాడు మళ్ళా. ముందు ఏం చేశాడు? నాయనా! ముక్తి అంటే ఏమిటో నాకు తెలియాలి అన్నాడు. ముక్తి అంటే ఏమి చెప్పాడు? నువ్వు శరీరం అనుకుంటున్నావు నాయనా! నువ్వు శరీరంలో వుండి శరీరం కాకుండా, యథార్థ స్థితి అంటే ఏమిటి? నీ స్వరూప స్థితిలో వుంటే నువ్వు ముక్తుడవే. వెంటనే మళ్ళా ఆన్సర్‌లోనే ప్రశ్న వేశాడు. యథార్థ స్థితి అంటే ఏమిటి? స్వరూప స్థితిలో వుండడం అంటే ఏమిటి? దానిని తెలుసుకోవడం ఎట్లాగ? తెలిస్తే కదా! వుండడానికి. ఇప్పటి వరకూ మనకు ఏమి తెలియదు? అది ఎట్లా వుందో తెలియదు కాబట్టి, వుండలేక పోతున్నాను అండీ! తెలిస్తే వుంటాను. అన్నారు.
            “ఎల్లవారికి ఇత్యాది అనుభవముల నుండియే అయ్యనుభవములకు... తగిన క్రియలకు మూలమైన నేను అను ఒక.. అంటే తెలివి, ఆ తెలివి యొక్క నిజస్వరూపమును, నేను ఎవడను? విచారణ చేసి.... వుండటయే.... యథార్థ స్వరూపమును... “
            అదండీ సంగతి. మీ ఇంటినుంచి ఇక్కడికి వచ్చాడా లేదా? వచ్చారా? నేను వచ్చితిని. వచ్చితిని ఏమిటి? పని. ఎవరు చేశారు? ఇంద్రియాలు చేశాయి. దానికి ప్రేరణ ఏమిటి? ఏదో నేర్చకోవాలి. ఏదో తెలుసుకోవాలి. అది కూడా ఇంద్రియమే కదా! మరి దాని అవతల వుండే నేను? కాబట్టి వచ్చితిని, పోయితిని, చేసితిని, తింటిని అని నవ్వు ఎన్నైతే చెబుతున్నావో, వాటి అన్నింటి వెనుకాల వున్నది ఎవరు? నేను. కాబట్టి ఆ పనులు చేసేముందు ఏం ప్రశ్నించాలట ఇప్పుడు? నేను ఎవడను? ఈ చేసే వాడు ఎవడు? పోయేవాడు ఎవడు? వచ్చేవాడు ఎవడు? తినే వాడు ఎవడు? (అసలు ఈ ప్రశ్న వస్తుందా అని నా డౌటు, మేం ఏం పని చేసినా ఈ ప్రశ్నలు రావడం లేదు, మామూలుగా చేసుకుంటూ పోతున్నాము) ఆఁ... అంటే అందుకే కదా! మీకు ఏం చెప్పాను ఇందాక? శరీర పద్ధతిగా చెయ్యడమే నువ్వు అభ్యాసం చేశావు. అభ్యాసం చేయడం వల్ల ఈ ప్రశ్న రావడం లేదు. ఈ ప్రశ్న వస్తే గానీ, నువ్వు శరీరమా? ఆత్మ స్వరూపమా అని నిర్ణయం చేయలేవు. అర్థమైందా అండీ!
            ఇప్పుడు ఉదాహరణ చెబుతా చూడండి. మీరు బ్యాంకులో డబ్బులు తీసుకోవడానికి వెళ్ళారండి. ఏమడిగారు మిమ్మల్ని? మీరు ఎవరు? మీరు ఎవరు అని అడుగుతున్నాడా లేదా? మీరు ఎవరు అంటే మీరు ఏం చెప్పారు? మీ ఖాతాదారుడిని అండీ నేను. అంటున్నావా? వాళ్ళ ఖాతాదారుడు కాకపోతే నీకు డబ్బు ఇస్తాడా? నీ ఖాతా పుస్తకం, సంతకం, కాగితం అన్నీ వుండాలిగా. అన్నీ వుండాలా? కాబట్టి నువ్వు ఎవరివి అని తెలియాలి మొట్టమొదట? నా వాడివి అని తెలియాలి మొట్టమొదట. అంతేనా? కాబట్టి ప్రశ్న దేనితో మొదలు పెట్టాడు? నువ్వు ఎవరు? నువ్వు కూడా దేనితో మొదలు పెట్టాలి? నేను ఎవరు? ముందు దానితో మొదలు పెట్టు. ఏ పనైనా, ఏ మాటైనా సరే, నేను ఎవడను? నేను ఎవడను అని ప్రశ్నించంగానే నువ్వుదానికి సమాధానం చెప్పాలి. ముందు ఆ ప్రశ్న వేయడం నేర్చుకో! ప్రతినిత్యం నేను ఎవడను అనంగానే, నేను ఆత్మస్వరూపుడను అని సమాధానం చెప్పు. నేను ఆత్మ స్వరూపుడు అనే సమాధానం చెప్పగానే, (రెండూ మనమే చెప్పాలా?) ఆ.. రెండూ మనమే చెప్పాలి. చెప్పుకోగానే ఏమైంది? నిద్ర లేస్తున్నామండి. నిద్రలేస్తూనే నేను ఎవడను? నేను ఆత్మస్వరూపుడను. ఇంతకు ముందు నిద్రపోయింది ఎవరు? ఇంతకు ముందు చేసిన పని ఏమిటి? నిద్రపోవడం. ఎవరు నిద్రపోయారు? నిద్రపోతిని. ఏం చెప్పాడు అక్కడ? నిద్రపోతిని అన్నాడు కదా! నిద్రపోతిని. ఎవరు నిద్రపోయింది? నేను నిద్రపోయానా? ఇంద్రియాలు నిద్రపోయినాయా? (మనసు) మనసుకూడా ఇంద్రియమే కదా! నిద్రపోయింది ఏమిటి? ఇంద్రియాలు. పని చేసింది ఏమిటి? ఇప్పుడు మేలుకున్నది ఏమిటి? అదీ ఇంద్రియాలే. (ఇవన్నిటికీ కారణం మనస్సే కదా!) మనస్సుకూడా ఇంద్రియమే. (అది పనిచేస్తేనే ఇంద్రియాలు పని చేస్తాయి కదా!) అవును. అది కూడా నిద్రపోతుంది కదా! అది నిద్రపోతేనే వీటన్నిటికి. అవునండి ఏదైనా సరే ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఇంద్రియాలు నిద్రపోయినాయి. ఇంద్రియాలు మేల్కొన్నాయి. అంతేనా? వేరే ఏమన్నా వుందా? మరి దానికో పెద్ద ప్రాధాన్యత ఇస్తావే? ఏదో ప్రపంచం బద్దలు అయిపోయినట్టు. ఏమైంది? ఇంద్రియాలు పని చేశాయి. ఇంద్రియాలు విశ్రాంతి తీసుకున్నాయి. నేను ఎవడను? నేను గమనించేవాడను. నేను సాక్షిని.  నేను ఆత్మ స్వరూపుడను. నేను నిద్రపోవడం లేదు. నేను మేల్కోవడం లేదు. నేను ఎప్పుడూ ఒక్క తీరుగానే వున్నాను. ఎలా వున్నా నాకు దానితో ఏమీ పనిలేదు. ఇప్పుడు నా దగ్గర పనిముట్లు వున్నాయండి. ఆ పనిముట్లు పనిచేస్తున్నాయి. నేను ఏం చేస్తున్నాను? చూస్తూ వున్నాను. అవసరమైతే ఒక పనిముట్టును వాడాలి, వాడాను. పక్కన పెట్టాను. పనిముట్టును వాడినంతమాత్రాన, నేను పనిముట్టును అవుతానా? (సాక్షిత్వం రావాలి కదా!) రావాలి అంటే నువ్వు ప్రయత్నం చెయ్యాలి కదా! నువ్వు వున్నది ఆ తీరుగానే వున్నావు. కానీ పనిముట్టును ఉపయోగించేటప్పుడు పనిముట్టు అవుతున్నావు. అర్థమైందా అండీ!
            శరీర భావన అంటే అర్థం ఏమిటంటే ఇప్పుడు, పనిముట్టును ఉపయోగించే టప్పుడు పనిముట్టువు అయ్యావు. అంటే అర్థం ఏమిటి? Cell phone వాడుతున్నావండి, మాట్లాడుతున్నావండి. ఆ కాసేపు నువ్వు ఏమయ్యావు? Cell phone అయిపోయావు. అయ్యావా లేదా? అవ్వకూడదు కదా మరి! TV చూశావండి. TV చూస్తే ఏమయ్యావు? అందులో వచ్చే ఏ కార్యక్రమం అయితే వుందో, ఏ పాత్ర అయితే వుందో, దేనిమీద అయితే నీకు ఆకర్షణ వుందో, అది నువ్వు అవుతున్నావు. గుర్తుపెట్టుకోండి. Cell phone నువ్వు అయ్యావా? అవ్వలేదు. అవతల వున్నటువంటి ఏ వ్యక్తి చేతైతే నువ్వు మాట్లాడుతున్నావో, ఆ వ్యక్తివి నువ్వు అయ్యావు. అర్థమైందా? కానీ ఉపయోగించిన Cell phone వి అయ్యావా? అవ్వడం లేదుగా. మరి అట్లాగే, ఇంద్రియాలను ఉపయోగించి ఇంద్రియార్థములు సాధించబడుతున్నాయండి. ఇంద్రియాలు నువ్వు ఎట్లా అయ్యావు? ఇంద్రియాలు కూడా cell phone లాంటిదే కదా! మీట నొక్కితే పనిచేస్తున్నాయి, మీట కట్టేస్తే పని చేయడం లేదు. మరి ఆ ఇంద్రియాలు పనిముట్లు కదా నీకు. పట్టుకో మంటే పట్టుకుంది. వదిలెయ్యమంటే వదిలేసింది. మరి నీకు ఇది ఇంద్రియాలు పనిముట్లు కదా! మరి ఇంద్రియార్థములు? ఇంద్రియాల ద్వారా చేయబడేటటువంటి పనులు? అవీ అంతే! పనుల వల్ల వచ్చిన ఫలితాలు? అవీ అంతే! మరి ఫలితాలలో ఇన్ని Rating ఎందుకు పెట్టావు? ఇది గొప్ప, ఇది దిబ్బ. ఇది మధ్యలో. అది వెనకాల. ఇది ముందుకి. ఇది సామాన్యం. ఇది ప్రత్యేకం. అవన్నీ ఫలిత స్థాయిలో పెట్టినవి కదా! నీ ఇంట్లో అన్ని పనిముట్లు ఒకటేనా కాదా? ఒకటేనా? ఒకటే అయివున్నప్పుడు ఏం చేస్తున్నావు? వజ్రం గొప్పది, రాయి దిబ్బ. రెండూ రాళ్ళే కదండీ! అవసరం కాదు. రెండూ రాళ్ళే కదా! (రెండూ రాళ్ళే, కాకపోతే తెలుసుకోలేక వజ్రానికి విలువ ఇస్తాం, మామూలు రాయికి ఇవ్వం) ఏం చేశావు ఇప్పుడు? అయ్యో! అర్థం వుందా? రెండూ భూమిలో దొరికేవే కదా! రెండూ భూమిలో దొరికేవేనా? ఇది అరుదైనదండి. ఏమిటి అరుదైనది? (దృష్టి దానిమీద వుంది, దాని విలువ పెరిగింది). ఏం చేశావు? దానికి ఇప్పుడు ప్రత్యేకతను ఆపాదించావు. లేని ప్రత్యేకతని ఆపాదించావు. అర్థమైందా? ఈ వజ్రాలను పట్టుకుపోయి, నల్లని రాయి, శివలింగం మీద పోశావు. ఇప్పుడు ఏమంటివి? అబ్బా! ఇంకా గొప్పదండి. అన్నావు. ఏంటంట? ఈ రాయిని పట్టుకెళ్ళి, మరో రాయి మీద పెట్టావండి అంతేనా? వజ్రాలు పొదిగిన కిరీటం పట్టుకెళ్ళి, శివలింగం మీదో, వేంకటేశ్వరుని మీదో పెట్టావండీ. ఏమిటట ఇప్పుడు? ఆ బంగారము భూమిలోదే. ఆ వేంకటేశ్వరస్వామి విగ్రహము వున్నటువంటి శిలా భూమిలోదే. అంతా రాయేగా. వజ్రాలు? అదీ రాయే. రాయిమీద రాయి పెట్టి, చాలా గొప్పపనిచేశాను అంటావేమిటి? (అదేమో దేవుడని, ఇదేమో వజ్రాల కిరీటమని) దేవుడికి కిరీటం పెట్టే స్థితి నాకు వచ్చిందని? అర్థముందా ఏమైనా? బుర్ర వుందా నీకేమైనా అసలు. అదేమన్నా శరీరమా? దేవుడు? కాదు కదా! నువ్వు పెట్టుకున్నట్టు ఏమన్నా ఊరేగుతున్నాడా ఆయనేమన్నా? ఏం ఊరేగడం లేదే? అర్థమైందా? ఇప్పుడు ఊరేగింపు వస్తుంది అమ్మా! అయ్య గారి ఊరేగింపు వస్తుందండి? అందరూ వాకిళ్ళో నిలబడి హారతులు ఇస్తున్నారా? ఏమిటి అసలు ఊరేగింపు అంటే? ఏమిటి? (పక్కనుంచోని హడావుడి) దేవుడు వస్తున్నాడండి, దేవుడు వస్తున్నాడండి, దేవుడు వస్తున్నాడండి! ఏమిటి వస్తున్నాడు? అది కాదు. లోక సహజం అండి. ఆ ఊరేగింపే లేకపోతే, దేవుడికి ఆభరణాలు ఎందుకు? (మనకు తెలీదు, కానీ వాళ్ళు వస్తున్నారు) ఇప్పుడు వేంకటేశ్వర స్వామి ఇప్పుడు నీకు తిరువీధులలో ఊరేగింపబడుతారండి రోజూ ఊరేగింపబడుతారు. చంద్రప్రభ వాహనం, సూర్యప్రభవాహనం, ఏనుగు వాహనం... (మన దగ్గరికి కూడా వస్తాడుగా) నువ్వు ఎట్లా అన్నా చేసుకో! ఇదంతా ఏమిటిది? అర్చామూర్తులకు ఊరేగింపు వుంటుంది. అర్థమైందా అండీ!
             మూల విరాట్‌కు ఏమీ లేదు. అవునా కాదా? ఉత్సవ విగ్రహాలు కదా! ఊరేగింపు అంటే ఊరు + ఏగటం. ఏగటం అంటే ఏమిటి? పోవడం. అర్థమైందా అండీ! ఆయన ఊరు వెళ్ళాడు, ఏ ఊరు వెళ్ళాడు? ఊరు అంటే దేశం, ఈ దేశము నుంచి మరొక దేశానికి వెళ్ళాడు. (ఇంతింత వాటికి ఖర్చు పెడుతుంటారు కదా! అదే మరి అందరిలోనూ ఆత్మను చూడమని ఆ పేదవాళ్ళకు, బీదవాళ్ళకు ఇవ్వవచ్చు కదా! ఆ వేంకటేశ్వర స్వామికి ఎన్ని లక్షలు వచ్చుంటాయో కదా!) మనమేం చేశాం పిడకలు. మనం అంటే తెలియదు కనుక, తెలియక చేశాము. సరే! నువ్వు దేహభావనతో చేస్తున్నావు. నేను ఒకటే చెబుతా వినమ్మా! అందుకే చెప్పేది వినండి. భారత దేశంలో, బొమ్మల పెళ్ళిళ్ళ మేరకు ఎన్నో చేస్తాము. ఆ ఒక్కటి కాదు. బొమ్మల పెళ్ళిళ్ళ పేరు మీద, మనం ఎన్ని చేస్తాము? అన్ని నవరాత్రులు చేస్తాము. వినాయక నవరాత్రులు చేశాం, అమ్మవారికి నవరాత్రులు చేశాం, శ్రీరామ నవమి నవరాత్రులు చేశాము, వసంత నవరాత్రులు చేశాము. ఇవన్నీ ఏమిటివి? బొమ్మల పెళ్ళిళ్ళే కదా! బొమ్మల పెళ్ళిల్లకు కోట్లు ఖర్చుపెట్టడానికైనా సిద్ధమే. “అన్నమో రామచంద్ర! అనువాడికి పిడికెడు అన్నము బెట్టు అన్నపూర్ణ లేదు కదా! ఈ భారతావనిలో” ఏమండి మానవుడికి వున్న భ్రాంతిని తీసుకెళ్ళి అక్కడ కూడా పెట్టాము. నీకు వున్న అహాన్ని, నీకు వున్న భ్రాంతిని, నీకు వున్న అజ్ఞానాన్ని కూడా ఆయనకి, దేవుడికి తగిలిస్తే కానీ, సంతృప్తి చెందలేదు మనం. మూలవిరాట్‌ ఒకప్పుడు వేంకటేశ్వర స్వామి, ఇవాళ ఉన్న పరిస్థితి కాకుండా, మూలవిరాట్‌ వున్న విడియోలు వున్నాయండి. అప్పుడు ఏమి వున్నాయి? ఆయన విగ్రహము మీద కేవలము ఒక ఉత్తరీయము వుంది. ఓ ఉత్తరీయము వుంది అంతే. అంతకు మించి ఏమీ లేవు. ఇవాళ కాదు. ఒక రెండున్నర సంవత్సరాల క్రితం, అక్కడ ఏమీ లేవు. ఇప్పుడున్న ఆలయము లేదు, ఇప్పుడున్న బంగారు తాపడమూ లేదు, ఏమీ లేదు. మామూలుగా బయట ఎట్లా అయితే ఆంజనేయ స్వామి గుడి వుంటుందో, ఆంజనేయ స్వామికి ఒక ఉత్తరీయము కప్పి వుంటుందో, అట్లాగ ఒక ఉత్తరీయము కప్పివుంది దానికి అంతే! (ఇది కూడా 40, 50 యేళ్ళనాడు ఎట్లా వుందో.. ) నాచిన్నప్పుడు ఎలా వుందేమిటి? మరి అప్పుడు ఏముంది? (ఆ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసేవాళ్ళం) అవును, సరాసరి వెళ్ళి పోయేవాళ్ళము. ఏముంది? అవునండీ! ఇప్పుడు దానికి ఆ స్థితి ఎట్లా వచ్చింది ఇప్పుడు? (డబ్బులు) డబ్బుకాదు. భ్రాంతి. నీవు నీ దగ్గర వున్న అజ్ఞానాన్ని, నీ దగ్గర వున్న భ్రాంతిని కూడా తీసుకుపోయి, దాని మీద పెట్టేటప్పటికి, దేవుడినికూడా అజ్ఞానంలో ముంచితే కానీ మనకు నచ్చలేదు. అర్థమైందా అండీ!
            ఇప్పుడు నీ ప్రతిబింబాన్ని చూసి నువ్వు ఆనందపడుతున్నావా? పడుతున్నావా లేదా? అట్లాగే, నువ్వు చంద్ర వంకీలు పెట్టుకుంటే, అమ్మవారు చంద్రవంకీలు పెట్టుకోవాలి. (అమ్మవారికి పెడితే అది ఆనందం) అహా! మనం పెట్టుకున్నాము ముందు. ఆనందించాం. ఇప్పుడు మనం పెట్టుకుని ఆనందిస్తున్నాము కదా! కాబట్టి ఆవెడకు కూడా పెట్టావు. అలంకరణ అంతా ఎట్లా వచ్చింది ఇప్పుడు? ఇట్లా వచ్చింది.  అర్థమైందా అండీ!
            నీకు నువ్వు చేసుకుంటున్నావండీ! షోడశోపచారపూజతో భాగంగా వచ్చిందండి ఇది. గుర్తుపెట్టుకోండి. ఈ షోడశోపచారాలు ఏమిటి? నీవు చేసుకునేవి. ఎందుకు చేసుకోమన్నారు? నువ్వు దేహం కాదు అని తెలుసుకోవడం కోసం చేసుకోమన్నారు. దేహంలో వుంటూ, దేహానివి నువ్వు కాదు అని తెలుసుకోవడం కోసం, రోజూ ఈ షోడశోపచారాలు చేయినాయన. నిత్య పూజ అంటే అర్థం ఇదే! అని చెప్పారు. కానీ ఏం చేశావు? నీకు నీవు చేసుకోరా బాబు షోడశోపచారాలు అంటే, నువ్వు ఏం చేశావు? ఒక చిన్న టిక్కి కట్టి, ఆ టిక్కీలో ఒక రెండు అంగుళాల విగ్రహాలు పెట్టి, ఈ రెండు అంగుళాల విగ్రహానికి ఆ ఫలహారం చేసి, అది నిత్యపూజ అంటున్నావు. అర్థముందా ఏమైనా? అది నిత్యపూజ ఎట్లా అవుతుంది? నీకు నువ్వు చేసుకోరా బాబు, నీలో వున్నటువంటి దైవత్వం నీకు తెలుస్తుంది. నీ దివ్యజ్ఞానం నీకు తెలుస్తుంది. నీలో భగవంతుడు ఎట్లా వున్నాడో తెలుస్తుంది. కాబట్టి నీకు నువ్వు చేసుకోరా బాబు. అని పెట్టాము. అది పోయి చివరికి ఏమైంది? ఇప్పుడు దేవుడు అంటే ఎక్కడ వున్నాడు? గూటిలో వున్నాడు. మీ ఇంట్లో దేవుడు ఎక్కడున్నాడండీ? చాలా భ్రాంతికరమైనటువంటి, ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి, అజ్ఞానపూరితమైనటువంటి భావన. కొత్తిల్లు కడతారండి. మీ ఇంట్లో దేవుడిని ఎక్కడ పెడతారండి? ఎక్కడ వున్నాడండి మీ ఇంట్లో దేవుడు? అదిగో ఆ మూల వున్నాడండి. అర్థం వుందా ఏమైనా? ఎంత భ్రాంతి కరమైన అంశం? ఆలోచన వుందా? అంటే అర్థం ఏమిటి? దాంతో కూడా పనిలేకుండా  పూర్తిగా మునిగిపోయే స్థితి నుంచి ఇక్కడకు వచ్చానని చెప్పడం. అర్థమైందా?
            బాల్యంలో ఉయ్యాలలో వున్నావండి. ఉయ్యాలలో వున్నప్పుడు దేవుడితో నీకు ఏం పని? దేవుడి గుడితో నీకేమన్నా పని వుందా అప్పుడు? ఏం పని లేదుగా. ఆటలు ఆడుకునేప్పుడు దేవుడితో ఏమన్నా పనివుందా? ఏం పని లేదుగా. అంటే మనో వికాసం, బుద్ధి వికాసం పొందేటప్పుడు అవసరం వచ్చింది. అంతేనా కాదా? అంటే మనో వికాసం వచ్చిందని చెప్పడం కోసమని ఆ దేవుడికి పూలు పెట్టావు. ఏమిటట? So what? ఏమిటట? ఏమైందట? ఇప్పుడు? ఏమైంది? మరింతగా బిగుసుకుపోయావు. అంతే తప్ప ప్రయోజనం సాధించింది ఏమీ లేదు. కాబట్టి ఇలా తెలుసుకో! దేహంలో వుండి, దేహం నేను కాదు అని తెలుసుకో! తెలుసుకోవాలంటే నీకు ఏం తెలియాలయ్యా? యథార్థ స్థితి. నీవు ఏదైతే అయివున్నావో, అది నీకు తెలియాలయ్యా! ఎలా తెలుస్తుందయ్యా? అంటే ఈ దేహంతో చేసే అన్ని పనులు చేసేటప్పుడు, అన్ని పనులు అంటే ఆలోచన కూడా పనే. గాలి తీసుకుని విడిచిపెట్టడం కూడా పనే. పని అంటే నేను ఏదో, బ్రహ్మాండం బ్రద్దలు కొడితేనే పని కాదు. (శ్వాసించేటప్పుడు కూడా చెయ్యాలి) అంటే, శ్వాసతో సమంగా నేను ఆత్మస్వరూపుడను అనే భావంతో వుండు. ప్రతి ఆలోచనని మొదలు పెట్టేటప్పుడే నేను ఆత్మస్వరూపుడను అనే భావనతో ప్రారంభించు. అప్పుడు ఏమైంది? నేను ఎవడను అని ప్రశ్నించమన్నారు అదే. ఆ ఆలోచన ప్రారంభించేటప్పుడే నేను ఎవడను? నిదానంగా. ఫెళ్ళుమని అడిగితే అది సమాధానం చెప్పదు. అర్థమైందా అండీ! నిదానం. ఎందుకంటే, సూక్ష్మం అది. స్థూలం కాదు అది. కాబట్టి బుద్ధి సూక్ష్మతను పొందాలి మొట్టమొదట. ప్రశ్నించాలి అంటే ఏముండాలి? బుద్ధి సూక్ష్మత పొందాలి. అంటే బుద్ధి వికాసము పూర్తి అవ్వాలి నాయనా! బుద్ధి వికాసము పూర్తి అయ్యిందా మనకి? అవ్వలేదు కాబట్టే ఈ చిక్కులన్నీ! మనో వికాసము అయితే పూర్తి అయ్యింది కానీ, బుద్ధి వికాసము పూర్తి అవ్వలేదు నాయనా! పూర్తి అయితే నీకు తెలిసేది. అందుకని ఇప్పుడు ఏమి చెయ్యాలట ఇప్పుడు మనం? ఆ చదువు ద్వారా బుద్ధి వికాసము పూర్తి చెయ్యి. ఏ చదువు ద్వారా? నేను ఎవడను అనే చదువు ద్వారా. ప్రతినిత్యం ప్రశ్నించుకో. ప్రతి నిత్యం నిన్ను నువ్వే ప్రశ్నించుకో! ఈ చేస్తున్నవాడు ఎవడు? కారణమైన వాడు ఎవ్వడు? ఉనికి ఎవ్వడు? అనే ప్రశ్నలు వేస్తే ఏమైంది? నీ పరిమితత్వం పోయింది! నేను శరీరం అనే భావన పోయింది. తద్వారా నీవు ఉద్ధరించబడుతావు. ఏమిటి వుద్ధరించబడడం? ఉద్ధరేత్‌ ఆత్మ నాత్మానం ఆత్మానమవసాధయేత్‌ నీ ఆత్మయే, నీవు ఆత్మస్వరూపుడవు అని నీకు తెలియజేస్తుంది. ఏదో ఆత్మ స్వరూపం వున్నది. అది నువ్వే అని నీకు తెలియజెప్తున్నది. ఒరేయ్‌! తెలివితక్కువగా ఇప్పటిదాకా చేశావు. అలా చేయమాక. నేను ఏదైతే వున్నానో, నువ్వు కూడా అలా వుండరాబాబు. నేను పరమాత్మలో అంశీభూతాన్ని. నీ శరీరం? ప్రకృతిలో అంశీభూతం. ఆత్మస్వరూపమేమో పరమాత్మ అంశ. శరీరమేమో ప్రకృతిలోని అంశ. నువ్వు పనిముట్టువలే ఉపయోగించుకోరా బాబు అంటే, ఆ గిన్నె నువ్వు అయ్యి కూర్చున్నావు. నిన్ను ఎవడు కూర్చోమన్నాడు. కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకో.
            కుమ్మరివాడు కుండ ఎప్పటికన్నా అవుతాడా? అవుతాడా? చేస్తాడు కానీ, కుమ్మరి వాడు కుండ అవ్వడు ఎప్పటికి. కదా! కానీ ఇప్పుడు ఏమయ్యావు? (వాడు దానిలో లీనమైపోతే అదే అవుతాడు అంటున్నారుగా?) ఓరినీ! ఎవ్వడు అవ్వమన్నాడు నిన్ను? (అవ్వమనలేదులే కానీ,)
అసలు లీనంఅంటే ఏమిటి? ‘లయంఅంటే ఏమిటి?
            ఈ రెండు పదాలు వాడుతున్నాము మనం, కాఫీలో పంచదార కలిపాము అండీ! లీనం అయ్యిందా? లయం అయ్యిందా? (లయం అయిపోయింది, కలిసిపోయింది) లీనం అంటే ఇప్పుడు? దాంట్లో నుంచి మరలా తిరిగి దానినే వుత్పత్తి చేయగలగాలి. లీనం అంటే అర్థం అది.
నేను భగవంతుడిలో లీనం అయిపోయానండి. లయం అయ్యానా? లీనం అయ్యానా?
సృష్టి అంతా భగవంతుడిలో లయం అవుతుందండి. మళ్ళా తిరిగి ఉత్పత్తి అవుతుందా? అవ్వడం లేదా?
అవుతోంది కదా !
లీనం అయితే? ఇక అవ్వదు.
ఇది లయానికి లీనానికి తేడా. తిరిగి మళ్ళా వస్తుందయ్యా అంటే లయం.
లీనం అంటే రాదు.
లీనం అంటే అర్థం ఏమిటి? (ఆగు, తొందర పడకు, నిదానం, నేర్చుకునేదే ఇప్పుడు అంత కంగారు)
లీయతే గమయతే ఇతి లింగః
మనం అందరం శివలింగాన్ని ఎందుకు పూజిస్తున్నామయ్యా అంటే, ‘లీయతే గమయతే ఇతి లింగఃఆ లింగ శబ్దానికి అర్థం ఇది. సంస్కృతంలోది. అంటే అర్థం ఏమిటి?
లీయతే - ఆది అంతము లేకుండా.
గమయతే - వ్యాపించి వున్నది.
ఇక్కడా అక్కడా అని చెప్పడానికి వీలు లేకుండా అంతటా వ్యాపించి వున్నది ఏదైతే వున్నదో, అది నాయనా లింగము అంటే.
ఇప్పుడు నీ సూక్ష్మం వున్నదండి. ఇక్కడా అక్కడ ఎక్కడ వుంది?
సూక్ష్మం అంటేనే వ్యాపించేది అని కదా అర్థం. ఎలాగా?
వాయువు స్థూలమా? సూక్ష్మమా?
వాయువు సూక్ష్మమే.
వ్యాపించి వుందా?
వాపించి వుంది.
ఆకాశము స్థూలమా సూక్ష్మమా?
అది కూడా సూక్ష్మమే.
వ్యాపించి వుందా?
ఆఁ..
కాబట్టి సూక్ష్మమైన దానికి అర్థం ఏమిటి?
వ్యాపించి వుండడం దాని ధర్మం.
ఎంతదూరం వ్యాపించి వుందండి?
ఆద్యంతములు లేకుండా. మొదలు చివర అనేది లేకుండా వ్యాపించి వున్నది. కాబట్టి, లింగము అంటే సూక్ష్మము అని అర్థము. అర్థమైందా అండీ!
శివుడు నాయనా! శివుడు, శివుడు. విభూతి పెట్టుకో! ఆ శివుడిని ఆశ్రయిస్తే అంతా మంగళకరమే.
ఏమిటి ఆ శివుడు ఇప్పుడు?
ఆ లింగము ఏమని చెబుతోంది?
నీలోపల వున్న సూక్ష్మాన్ని తెలుసుకో!
ఈ స్థూల భ్రాంతి పోతుంది. అదే నాయనా! మంగళకరము.
ఇక ఇంతకు మించిన మంగళకరము ఏదీ లేదు.
ఇంతకు మించిన శుభం ఏదీ లేదు.
అర్థమైందా అండీ! మనం ప్రతీదానికి చెబుతూ వుంటాము.
బొట్టు పెట్టుకోక పోతే అశుభమండి, తాళి పక్కన పెడితే అశుభమండి, తెల్ల చీర కడితే అశుభమండి. ఇలా రకరకాల అశుభాలన్నీ పెట్టాము. ఇవేవీ ప్రయోజనం లేదు. ఇవన్నీ శరీరానికి పెట్టిన వాతలు. దీనివల్ల ఏమీ ప్రయోజనము లేదు.
ఈ శరీరాన్ని ఆధారం చేసుకుని, ఈ శరీరంలో వున్నటువంటిదే కాక, సృష్టి అంతా వ్యాపించి వున్నటువంటిది ఏదైతే వున్నదో, దాన్ని తెలుసుకో!
తెలుసుకుంటే ఏమైంది?
అది కదలడం లేదు అని తెలుస్తుంది. కదలని దానిని కనుక నువ్వు ఆశ్రయిస్తే, నీవు దేని కోసమైతే ఈ శరీరంలోకి వచ్చావో, అది సాఫల్యము అవుతుంది.
కాబట్టి మొదటి ప్రశ్న ఏమిటి?
నాయనా! నేను ముక్తి ఎలా చెందాలి?
నీవు యథార్థ స్థితిని తెలుసుకోవాలి నాయనా! నీ స్వరూప జ్ఞానాన్ని తెలుసుకోవాలి నాయనా!
అది ఎట్లాగ?
అది ఎట్లాగ అంటే, నువ్వు ఈశరీరంతో చేసే ప్రతి పనికి, ప్రతి ఆలోచనకి, ఆలోచనలు కూడా వస్తున్నాయా? పోతున్నాయా లేదా? నేను వచ్చితిని, నేను పోతిని. వుందా లేదా?
ఆ ఆలోచన కూడా మొదట ఎక్కడ మొదలు పెట్టాలట?
నేను ఎవడను?
ఈ ఆలోచన చేసేముందు నేను ఎవడను?
మీ అబ్బాయి నిన్ను ఒక 10 లక్షలు అడిగాడండి. ఇప్పుడు ఏం చెయ్యాలి?
ముందు ఏం చెయ్యాలి?
నేను ఎవడను అని ప్రశ్న వేయాలి.
నేను ఎవడను?
ఇవ్వడం, ఇవ్వకపోవడం అనే ఫలితంతో నాకు పనిలేదు.
నేను ఎవడను?
నేను ఆత్మస్వరూపుడను.
నేను ఆత్మ స్వరూపుడవై వుండగా నీవు ఎవరవు?
(నువ్వు ఆత్మ స్వరూపుడివే)
నేను దేని కోసం ప్రయత్నం చెయ్యాలి?
జ్ఞానం కోసం ప్రయత్నం చేయాలి.
నీకు కూడా నేను ఏం కలిగేటట్లు చేయాలి?
జ్ఞానం కలిగేటట్లు చేయాలి.
అంతే, నీకు జ్ఞానం కలిగేటట్లుగా జీవించు.
ఎదుటివాడికి ఏం చేస్తే జ్ఞానం కలుగుతుందో ఆలోచించి చెయ్యి.
నువ్వు 10 లక్షలు ఇచ్చావా? ఇవ్వలేదా అనేదాంతో అక్కడ పని లేదు.
ఆ పని చేయడం ద్వారా, అతనికి జ్ఞానం కలుగుతోందా?
జ్ఞానం కలుగుతోంది, అయితే చేయ్‌.
జ్ఞానం కలగడం లేదు, చేయమాకు.
వాడు కోపించాడు, క్రోధించాడు, మరొకటి చేశాడు, మరొకటి చేశాడు. ఏమిటట అయితే?
అజ్ఞానం కదా!
ఇప్పుడు ఇచ్చి అజ్ఞానాన్ని పెంచామా? ఇవ్వకుండా అజ్ఞానాన్ని పెంచామా?
ఇవ్వడమూ, ఇవ్వకపోవడమూ అనేదాని వల్ల కాదు అక్కడ సమస్య. అతనిలోని జ్ఞానం వృద్ధి చెందేట్టు అయితే, చెయ్యవచ్చు. ఇవ్వడం ఇవ్వకపోవడం రెండూ పనులే. అర్థమైందా? ఇవ్వడమైనా, ఇవ్వకపోవడమైనా రెండూ పనులే. కానీ, దాని వల్ల అతనికి జ్ఞానం వృద్ధి చెందుతోందనుకోండి. ఇవ్వకపోవడం కూడా చెయ్యొచ్చు. ఇవ్వకపోవడం వలన జ్ఞానం వృద్ధి చెందుతోంది. ఇవ్వమాకు. ఇవ్వడం ద్వారా జ్ఞానం వృద్ధి చెందుతుంది, ఇవ్వచ్చు.
10 లక్షలు ఎప్పుడు ఇవ్వాలట?
(పరిస్థితిని బట్టా)
జ్ఞానం వృద్ధి చెందుతుందా?
పరిస్థితి కాదు.
వాడిలో జ్ఞానం వృద్ధి చెందుతుందా?
 జ్ఞానం వృద్ధి చెందుతోంది అంటే చేయవచ్చు.
చెయ్యడం అనేది ఏమిటి?
ఇవ్వడము చేయడమే, ఇవ్వకపోవడమూ చేయడమే,
అర్థమైందా?
మన దృష్టిలో ఏమిటి?
ఇవ్వడము చేయడం లేదా ఇవ్వకపోవడమే చేయడం.
ఈ రెండిటిలో ఏదో ఒకటే,
కానీ, నేను ఎవడను అనే ప్రశ్నతో మొదలు పెడితే ఏమయ్యింది?
రెండూ ఒక్క తీరుగా అయిపోయినాయి. ఇది చెయ్యడం ద్వారా ఇవ్వడం గానీ, ఇవ్వక పోవడం గానీ, నాకు జ్ఞానం వృద్ధి చెందుతోందా? ముందు నిన్ను చూసుకోవాలి. నేను ఆత్మస్థితిలో స్థిరంగా వున్నానా? నేను ఆత్మస్వరూప జ్ఞానంలో స్థిరంగా వున్నానా? ఏమన్నా మార్పు చెందానా? ఏమన్నా వేదన కలుగుతోందా నాకు? వేదన కలిగింది అంటే ఏమైంది ఇప్పుడు నాకు? (శరీరమైపోయావు) కిందకు వచ్చేశావు. కాబట్టి, ఇలా విచారణ చేయమని చెబుతున్నారు.

(Note: Proof reading not yet done)